Latest Updates
-
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.!
స్పాంజ్ తో ఆశ్చర్యకరమైన 8 ప్రయోజనాలు
మన జీవనశైలిలో స్పాంజ్ ను కూడా ఏదో ఒకరకంగా ఉపయోగిస్తున్నాము. అయితే స్పాంజ్ ను మనం పూర్తిగా మరియు సరిగా ఉపయోగించుకొంటున్నామా?చాలా మంది స్పాంజ్ ను ఏవిధంగా ఉపయోగించాలో తెలియదు. స్పాంజ్ ను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇది చౌకైనదీ కూడా. దీని కోసం ఎక్కువ డబ్బు కూడా ఖర్చుచేయాల్సిన పని కూడా లేదు. అందుకే ఇంట్లో స్పాంజ్ ను స్టాక్ పెట్టుకోవాలి.
స్పాంజ్ అంటే ఏమి కాదు, ఒది ఒక పోరస్ మెటీరియల్. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అందే కాదు, ఏలాంటి ద్రవాన్నైనా చాలా సులభంగా గ్రహిస్తుంది మరియు నిలుపుకొంటుంది. మన ఇల్లల్లో, తడిగా ఉన్న ఫ్లోర్ ను శుభ్రం చేయడం ద్వారా తడిని త్వరగా డ్రై అయ్యేలా చేయవచ్చు. ఎటువంటి ద్రవాన్నైనా చాలా తేలికగా షోషించుకుంటుంది. ఆ ప్రదేశాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాదు, స్పాంజ్ వల్ల మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం...

స్పిల్స్ శుశ్రం చేస్తుంది:
దుస్తుల మీద లేద స్వెటర్ల మీద చిన్న మరకలు పడినప్పుడు, దాన్ని చాలా సింపుల్ గా శుభ్రం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల దుస్తుల మీద ఏర్పడ్డ మరకలు, పూతను నివారిస్తుంది.
ప్లాంట్ కంటైనర్ లో ఉపయోగించాలి:
మొక్కలు పెట్టిన కుంపటి క్రింద స్పాంజ్ ఉంచడం వల్ల మొక్కలకు పోసే నీరు కుంపటి నుండి లీక్ అయినప్పుడు, స్పాంజ్ ఆనీటిని పీల్చుకొంటుంది. దాంతో ఫ్లోర్ మీద పడకుండా, మట్టి మరకలు పడకుండా సహాయపడుతుంది. అంతే కాదు, స్పాంజ్ లోని నీరు మొక్కను ఎప్పుడూ తేమగా ఉండేలా చేస్తుంది.
మీ కార్పెట్ ను శుభ్రం చేస్తుంది:
మీ ఇంట్లో పెట్స్ ఉన్నట్లైతే, కార్పెట్ మీద పెంపుడు కుక్కల యొక్క బొచ్చు పడినప్పుడు , స్పాంజ్ తో తుడిస్తే చాలా సులభంగా తొలగిస్తుంది.
గ్లాస్ వేర్ ను ప్రొటెక్ట్ చేస్తుంది:
ఇంట్లో ఏవైనా గాజు వస్తువులు పగిలినప్పుడు, వాటిని తొలగించడానికి స్పాంజ్ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. అలాగే గాజు వస్తులను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మీరు మార్చాలనుకున్నప్పుడు, స్పాంజ్ ఒక కుషన్ లాగా పనిచేస్తుంది. పగిలిపోకుండా ఉంటాయి.

గీతలు పడకుండా నివారిస్తుంది.
మన ఇంట్లో కనుక, ఒక మంచి మోడ్రన్ గ్లాస్ టీ పాయ్ ఉన్నప్పుడు, దాని మీద ఫ్లవర్ వాజ్ గీతలు పడకుండా ఉండాలంటే పల్చగా ఉండే స్పాంజ్ ను పెట్టి, దాని మీద ఫ్లవర్ వాజ్ ను అమర్చుకోవచ్చు. దాంతో గీతలు పడకుండా కొత్తవాటిలా ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి.
డిష్ వాష్:
వంటగదిలోని పాత్రలను శుభ్రపరచడానికి డిష్ వాష్ లను శుభ్రం చేస్తుంది. ఎటుంటి గీతలు పడకుండా శుభ్రం చేస్తుంది.
టేబుల్ ను శుభ్రం చేస్తుంది: డైనింగ్ టేబుల్, మరియు ఇతర టేబుల్స్ కూడా శుభ్రంచేస్తుంది . క్లాత్ ను శుభ్రం చేయడం కంటే, స్పాంజ్ తో మరింత శుభ్రంగా క్లీన్ చేయవచ్చు. టేబుల్ మీద చాలా శుభ్రంగా క్లీన్అ వుతుంది. అయితే క్లాత్ తో శుభ్రం చేస్తే వాటిని శుభ్రం చేయడానికి కొంత ఒత్తిడి, కష్టంతో కూడిన పని.
పెడిక్యూర్:
స్పాంజ్ తో మీ పాదాల మీద రుద్ద మరీ శుభ్రం చేసుకోవచ్చు. పెడిక్యూర్ జాబ్స్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications