Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మొండి మరకలు దూరం చేసే హైడ్రోజన్ పెరాక్సైడ్
హైడ్రోజెన్ పెరాక్సైడ్ ఒక బెస్ట్ బ్లిచింగ్ ఏజెంట్ అని చాలా మందికి తెలియదు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ను తెగిన గాయాల మీద, చారల మీద అప్లై చేస్తే ఇది ఒక యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. అంతే కాదు దీన్ని గొంతు నొప్పి నివారించడానికి నీళ్ళలో వేసి పుక్కలిస్తుంటారు. అందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ మన ఫస్ట్ ఏడ్ కిట్ లో మొదటగా ఉంటుంది .
హైడ్రోజన్ పెరాక్సైడ్ క్లీనికల్ గా ఉపయోగించడం మాత్రమే కాకుండా ఇంట్లో కూడా వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ లిక్విడ్ ను యాంటీసెప్టిక్ గానే కాకుండా ఇంట్లో వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చనే విషయం మీకు తెలుసా? దీన్ని స్టెయిన్ రిమూవర్ గా, దుస్తులను తెల్లగా మిళమిళ మెరిపించడం కోసం మరియు వంటగదిలో క్రిములు లేకుండా అంతే కాదు, బాత్రుమ్ శుభ్రతకోసం ఇలా వివిధ రకాలుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తుంటారు. కాబట్టి హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగించి వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. అదెలాగో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

1. వంటగది శుభ్రతకు :
హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటగదిలో వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వంటగది ఫ్లోర్ క్లీనింగ్, టేబుల్స్, విండోస్ క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారు . స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేయాలి. అలాగే వంటగదిలో ఫ్లోర్ మీద కూడా చిలకరించి ఇల్లు తుడవొచ్చు.

2. దుస్తులు తెల్లగా మార్చడానికి:
బ్లీచ్ అనేది ఒక రసాయనం. ఇది తరచూ ఆక్సీకరణం ద్వారా రంగులను పోగొట్టడం లేదా తెల్లబరచడం చేస్తుంది. అంతే కాదు, హైడ్రోజన్ పెరాక్సైడ్ ను దుస్తులకు ఉపయోగించడం వల్ల దుర్వాసనను కూడా పూర్తిగా నిర్మూలిస్తుంది. అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ ను నేరుగా దుస్తుల మీద వేయడం వల్ల దుస్తుల యొక్క కలర్ పోతుంది. కాబట్టి, నీటిలో మిక్స్ చేసి ఉపయోగించుకోవాలి.

3. రక్తం మరియు రెడ్ వైన్
మరకలను తొలగిస్తుందిం హైడ్రోజన్ పెరాక్సైడ్ దుస్తులను తెల్లగా మార్చడం మాత్రమే కాదు, దుస్తుల మీద మరియు ఫ్లోర్ కార్పెట్ మీద ఏర్పడ్డ మొండి మరకలను మరియు రక్తంమరకలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . రక్తం లేదా రెడ్ వైన్ మరకలు ఏర్పడ్డ ప్రదేశంలో నేరుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ చిలకరించి రెండు నిముషాల తర్వాత చేత్తో రుద్ది చల్లటి నీటితో కడిగి తర్వాత సోపు పెట్టి వాష్ మిషన్ లో వేయాలి.

4. బాత్ రూమ్ క్లీనర్ :
హైడ్రోజన్ పెరాక్సైడ్ బాత్రూమ్స్ లోని చెడుగా వెలువడే దుర్వాసను తొలగిస్తుంది. మొండిమరకలను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, దీన్ని వంటగదిలో ఉపయోగించిన విధంగా ఫ్లోర్ క్లీనింగ్, వాటర్ బాటిల్ స్ప్రే చేసి కొన్ని నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవచ్చు .

5. డిస్ ఇన్ఫెక్ట్:
బాక్టీరియాన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ నాశనం చేస్తుంది? ఇది దుస్తులను శుభ్రపరచడం మాత్రమే కాదు, వాషింగ్ మెషిన్ లోనే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . ఇంకా బ్యాడ్ స్మెల్ ను తొలగిస్తుంది.

6. వెజిటేబుల్స్ మరియు తాజా పండ్లలో పెస్టిసైడ్స్ ను తొలగిస్తుంది:
తాజా పండ్లు మరియు కూరగాయల మీద ఏర్పడ్డ పెస్టిసైడ్స్ మరియు బ్యాక్టీరియాను తొలగించడంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ గ్రేట్ గా సహాయపడుతుంది.హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన నీటిలో వేసి రెండు మూడు నిముషాలు తాజా పండ్లు , మరియు కూరగాయలను వేసి అలాగే వుంచి తర్వాత మంచినీటితో కడిగి తడిన ఆరిన తర్వాత ఉపయోగించాలి

7. దంతాలను తెల్లగా మార్చుడంలో:
హైడ్రోజన్ పెరాక్సైడ్ నేచురల్ ఆక్సిడేచర్. ఇది నోట్లో బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు దంతాలను తెల్లగా మార్చుతుంది . రెండు మూడు చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ టూత్ పేస్ట్ మీద వేసి బ్రష్ చేసుకోవాలి.

8. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది:
మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. మొక్కలు ఎక్కవ పోషకాలను నీటిని గ్రహించే విధంగా చేసిన మొక్కలు ఆరోగ్యంగా మరియు స్ట్రాంగ్ గా పెరగడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications