ఇంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటే చాలు, వ్యాధులు ధరిచేరవు...

By Super

హైడ్రోజన్ పెరాక్సైడ్ ను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. కట్స్ మరియు క్రాప్ కు యాంటీసెప్టిక్ గా ఉపయోగిస్తారు. అంతే కాదు గొంతునొప్పి నివారించడానికి గార్గిలింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా మన ఫస్ట్ ఎయిడ్ కిట్ లో మొదట ఉండేది హైడ్రోజన్ పెరాక్సైడ్ . ఇవే కాదు, క్లీనికల్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది, హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల వివిధ రకాల ప్రయోజనాలున్నాయి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ లో ఉన్న యాంటీసెప్టిక్ లక్షణాలుండటం వల్ల ఇది ఒక ఎపెక్టివ్ హోం క్లీనింగ్ లిక్విండ్ గా ఇంట్లోని వస్తువును శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు . దీన్ని స్టెయిన్స్ ను తొలగిస్తుంది, వైట్ దుస్తుల శుభ్రపరచడంలో బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది , కిచెన్లో క్రిములను నాశనం చేస్తుంది . బాత్ రూమ్ లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంతే కాదు మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అలాంటి మరోన్నో ప్రయోజనాలను బోల్డ్ స్కై మీకోసం అందిస్తున్నది... మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

వంటగదిలో క్రిములు మరియు మరకలను వదిలిస్తుంది

వంటగదిలో క్రిములు మరియు మరకలను వదిలిస్తుంది

హైడ్రోజన్ పెరాక్సైడ్ ను వంటగదిలో వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మరకలను తొలగిస్తుంది, క్రిములను నాశనం చేస్తుంది మరియు డీఫ్లోర్ క్లీనింగ్ ,టేబుల్ టాప్ క్లీనర్ గా , విండో క్లీనర్ గా ఉపయోగించుకోవచ్చు . స్ప్రేబాటిల్లో మూడు శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయాలి. టార్గెట్ సర్ఫేస్ లో స్ప్రే చేసి శుభ్రం చేయాలి. సాధారణ క్లీనర్స్ లాగే హైడ్రోజెన్ పెరాక్సైడ్ ఉపయోగపడుతుంది. అలాగే సానిటైజ్ గా కూడా ఉపయోగించుకోవచ్చు

వైట్ క్లోత్ కు ఆల్టర్నేటివ్ బ్లీచింగ్

వైట్ క్లోత్ కు ఆల్టర్నేటివ్ బ్లీచింగ్

హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క మరో బెస్ట్ హౌస్ హోల్డ్ గా ఉపయోగిస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ దుస్తులకు బ్లీచింగ్ , తెల్ల దుస్తులను మరింత తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. బ్లీచింగ్ కంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే దుర్వాసన నివారిస్తుంది . దుస్తులను నానబెట్టే నీటిలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి నానబెట్టి, తర్వాత వాష్ చేయాలి.

రక్తం మరియు రెడ్ వైన్ మరకలను నివారిస్తుంది

రక్తం మరియు రెడ్ వైన్ మరకలను నివారిస్తుంది

మొండిమరకలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . తెల్లదుస్తులను మరింత తెల్లగా మార్చడం మాత్రమే కాదు, దుస్తుల మీద పడ్డ రెడ్ బ్లడ్ మరియు రెడ్ వైన్ మరకలను గ్రేట్ గా తొలగిస్తుంది . 3 టేబుల్ స్పూన్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ ను మెండి మరకల మీద అప్లై చేసి 1 లేదా రెండు నిముషాల తర్వాత రబ్ చేసి వాష్ చేస్తే మరకలు సులువుగా తొలగిపోతాయి. వేడినీటిని ఉపయోగించకూడదు.

బాత్రూమ్ లో దుర్వాస మరియు మరకలను నివారిస్తుంది

బాత్రూమ్ లో దుర్వాస మరియు మరకలను నివారిస్తుంది

మరో ప్రయోజనం బాత్రూమ్ లోని మరకలను మరియు దుర్వాసనను నివారించడంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ గ్రేట్ గా సహాయపడుతుంది. మకలను తొలగించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది . హైడ్రోజన్ పెరాక్సైడ్ ను స్ప్రేబాటిల్లో వేసి ప్రాబ్లెమ్ ఉన్న ప్రదేశంలో డైరెక్ట్ గా అప్లై చేయాలి . క్రిములు నాశనం అయ్యే వరకూ మరియు బాత్రూమ్ వాసన పోయే వరకూ అలాగే ఉండే తర్వాత శుభ్రం చేయాలి.

ఫ్రిజ్ లో క్రిములు లేకుండా చేస్తుంది..

ఫ్రిజ్ లో క్రిములు లేకుండా చేస్తుంది..

హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్యాక్టీరియాన్ కిల్ చేస్తుంది?ఫ్రిజ్ లో దాగి ఉండే బ్యాక్టీరియాను కిల్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . 3శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్ ను స్ప్రే బాటిల్లో పోసి ఫ్రిజ్ లో స్ప్రే చేయాలి. తర్వాత ప్రిజ్ లో క్రిములను నాశనం చేస్తుంది. అంతే కాదు, బ్యాడ్ స్మెల్ కూడా నివారిస్తుంది.

పండ్లు మరియు వెజిటేబుల్స్ మీద ఉండే పెస్టిసైడ్స్ ను తొలగిస్తుంది

పండ్లు మరియు వెజిటేబుల్స్ మీద ఉండే పెస్టిసైడ్స్ ను తొలగిస్తుంది

పండ్లు మరియు వెజిటేబుల్స్ మీద ఉండే పెస్టిసైడ్స్ తొలగించడంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ సహాయపడుతుంది. కొద్దిగా నీటిలో వేసి ఆనీటిలో పండ్లు, కూరలు వేసి 15నిముషాల తర్వాత వేరేమంచి నీటితో శుభ్రం చేయాలి . తర్వాత తడి ఆరనిచ్చి, పొడి వస్త్రంతో తుడిచి తర్వాత ఉపయోగించుకోవాలి. .

హోం మేడ్ టూత్ వైట్ నర్

హోం మేడ్ టూత్ వైట్ నర్

హైడ్రోజన్ పెరాక్సైడ్ నేచురల్ ఆక్సిడైజర్ ఇది మౌత్ బ్యాక్టీరియా తొలగించడానికి సహాయపడుతుంది . దంతాలను తెల్లగా మార్చుతుంది.కొద్దిగా నీటిలో వేసి ఆ నీటితో మౌత్ వాష్ చేసుకోవాలి. అలాగే టూత్ పేస్ట్ మీద కూడా వేసి దంతాలు రుద్దుకుంటే దంతాలు తెల్లగా మిళమిళ మెరుస్తుంటాయి . అలాగే కొద్దిగా బేకింగ్ సోడాలో కొద్దిగా పెరాక్సౌైడ్ మిక్స్ చేసి నార్మల్ టూత్ పేస్ట్ గా ఉపయోగించుకోవాలి. అయితే దీన్ని మింగకుండా జాగ్రత్తపడాలి . తర్వాత మంచి నీటితో నోటిని శుభ్రంచేసుకోవాలి.

మొక్కలకు సహాయపడుతుంది

మొక్కలకు సహాయపడుతుంది

హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన నీటిలో మిక్స్ చేసి మొక్కల మీద స్పే చేయడం వల్ల క్రిములు నాశనం అవుతాయి . మొక్కలకు అందాల్సిన పోషకాలు అంది మొక్కలు పెరుగుతాయి . మొక్కల కాండం స్ట్రాంగ్ గా పెరుగుతాయి. బ్యాక్టీరియా మరియు ఫంగస్ ను నివారిస్తుంది.

హెయిర్ లైటింగ్

హెయిర్ లైటింగ్

హైడ్రోజన్ పెరాక్సైడ్ దుస్తులను తెల్లగా మార్చడం మాత్రమే కాదు హెయిర్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ను నీటిలో 50-50 మిక్స్ చేసి తడి జుట్టు మీద స్ప్రే చేయాలి . ఇది కురులను లైట్ గా మార్చుతుంది .

Story first published: Saturday, December 26, 2015, 15:45 [IST]
Desktop Bottom Promotion