Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీరు ఉప్పుతో పరిష్కరించగల 9 గృహ సంక్షోభాలు
ఒక సాధారణ మోతాదులో ఉప్పును ఉపయోగించి ఇంటి విపత్తులను పరిష్కరించవచ్చు. గుడ్డు పగుళ్ళు మరియు చిందటం వంటి వాటిని పరిష్కరించటం చాలా సులభం. శుభ్రపరిచే ఉత్పత్తులను ఉపయోగించటం కంటే సాధారణంగా ఇది చాలా చౌకగా ఉంటుంది. ఇక్కడ ఉప్పుతో పరిష్కరించటానికి కొన్ని నచ్చిన మార్గాలు ఉన్నాయి.

ఇనుము మీద తుప్పు వదలటానికి
వేక్స్ పేపర్ ముక్క లో ఉప్పును చల్లి ఇనుము మీద రబ్ చేయాలి. ఉప్పు ఇనుము మీద ఉన్న తుప్పును వదిలించటం గమనించవచ్చు.

బూజు వదిలించుకోవటం
బూజు మరకలు మరియు బట్టలు లేదా టవళ్లు వాసనను వదిలించుకోవటానికి నిమ్మరసంలో ఉప్పు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మరక మీద రాసి రబ్ చేసి ఎండలో ఆరబెట్టాలి. ఆరిన తర్వాత వాషింగ్ మిషన్లో వేయాలి.

డిష్వాషర్ సబ్బు
మీరు చిటికెలో పరిష్కారాన్ని కనుగొనవచ్చు. ఉప్పు మరియు బేకింగ్ సోడా కలిపి ఒక డిష్వాషర్ డిటర్జెంట్ ను తయారు చేస్తే, అది చాలా బాగా పనిచేస్తుంది.

మసిబారిన స్పాంజ్ శుభ్రం
ఒక కంటైనర్ లో 2 కప్పుల నీరు, పావు కప్పు ఉప్పు వేసి కలపాలి. దీనిలో మసిబారిన స్పాంజ్ ని వేసి ఒక రాత్రంతా అలా ఉంచితే జిడ్డు మరియు నల్లదనం తగ్గుతాయి.

పాన్ జిడ్డు వదలాలంటే
పాన్ లో ఉప్పును జల్లి నీటిని పోసి 10 నిముషాలు అలా ఉంచాలి. ఈ ద్రావణంలో జిడ్డు కరిగిపోతుంది. మీరు సులభంగా తుడవవచ్చు.

చెక్క కట్టింగ్ బోర్డు శుభ్రం
మీరు డిష్వాషర్ లో చెక్క కట్టింగ్ బోర్డులను శుభ్రం చేయటం కుదరదు. కానీ మీరు వేడి నీరు, ఉప్పు మరియు నిమ్మ రసంతో వాటిని శుభ్రం చేయవచ్చు.

పగిలిన గుడ్డును శుభ్రం
దీనికి పేపర్ టవల్ ని ఉపయోగించవలసిన అవసరం లేదు. ఉప్పు తో కవర్ చేసి 10 నుండి 15 నిమిషాలు వేచి ఉండాలి. ఆ తర్వాత శుభ్రం చేయటం చాలా సులభంగా ఉంటుంది.

ఎరుపు వైన్ మరక శుభ్రం
ఈ మరక మీద ఉప్పు చల్లి 5 నిముషాలు వేచి ఉండాలి. ఆ తర్వాత చల్లని నీటిని పోసి రుద్దితే మరక మాయం అవుతుంది.

డ్రెయిన్ లో ఆటంకం కలిగించే జుట్టును శుభ్రం చేయుట
సహజ డ్రెయిన్ శుభ్రపరచడం కొరకు 1/4 కప్పు బేకింగ్ సోడా,1/4 కప్పు ఉప్పును మిక్స్ చేయండి. మీ చేతులకు గ్లౌజ్ లను వేసుకొని చేతులతో మీకు వీలయ్యే వరకు డ్రెయిన్ నుండి జుట్టును తొలగించండి. ఆ తర్వాత డ్రెయిన్ డౌన్ లోకి ఈ మిశ్రమంను పోయాలి.ఆ తర్వాత 1/2 కప్పు తెలుపు వినెగార్ పోసి 15 నిమిషాల తర్వాత వేడి నీటిని పోసి శుభ్రం చేయాలి.



Click it and Unblock the Notifications