Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
బేకింగ్ సోడాతో ఇంట్లో వాసనలకు చెక్ పెట్టవచ్చు
అకస్మాత్తుగా ఇంట్లో ఏదైనా చెడు వాస వచ్చిందంటే చాలు, ఎక్కడి నుండి వస్తోంది అని పసిగట్టడ మొదలు పెడతారు. చెడు వాసన తట్టకోవడానికి కూడా చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది . చెడు వాసన మన మూడ్ పాడు చేయడంతో పాటు, వాంతి, వికారం కలిగే అనుభూతిని కలిగిస్తుంది. ఇంట్లో చెడు వాసన పొలుసు వాసన ఎక్కడ నుండి వస్తోందో తెలుసుకోవడం కూడా కష్టం అవుతుంది.
చూడటానికి అందంగా...ఆహ్లాదంగా కనిపించే ఇంట్లో చెడు వాసన(పొలుసువాసన) వస్తే, ఇంట్లో వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంత శుభ్రంగా ఇంటిని ఉంచుకొన్ని అకస్మాత్ గా ఎక్కడినుండి వచ్చింది అనుకుంటారు. ఈ చెడు వాసనలు తేమను పీల్చుకొనేందుకు మీరు ఉపయోగించే కార్పెట్, వంటగదిలోని టవల్స్, వంటగది సింకులోని పాత్రలు , రిఫ్రిజరేటర్, పెట్ లిటర్ బాక్స్, కూలర్స్, బాటిల్స్, వాక్యూమ్ క్లీనర్ మరియు ఇంకా ఎయిర్ కండీషనర్స్ నుండి కూడా ఇలాంటి ఫ్యూయల్ స్మెల్ రావడానికి అవకాశం ఉంటుంది.
ఇంట్లో చెడు వాసనకు కారణం ఏదైనా కావచ్చు , మీరు రూమ్ రిఫ్రెషనర్స్, డియోడరెంట్స్, పెర్ఫ్యూమ్స్ మరియు టాల్కం పౌడర్లు ఉపయోగించి తక్షణ ఉపశమనం పొందుతుంటారు. అయితే, ఈ వాసనలు ఎక్కువ సమయం నిలిచి ఉండవు, కొద్ది సేపటి తర్వాత తిరిగి దుర్వాసన ప్రారంభం అవుతుంది. పూర్తి వాసనలు తొలగిపోవు.
ఇలా దుర్వాసనలు నివారించడంలో బేకింగ్ సోడా ఏవిధంగా ఉపయోగపడుతుంది?ఇంట్లో దుర్వాసను పూర్తిగా నివారించడానికి ప్రతి ఒక్కరూ కొన్ని చిట్కాలను తెలుసుకొని ఉండాలి.
ఇంట్లో దుర్వాసను నివారించడానికి బేకింగ్ సోడాను ఏవిధంగా ఉపయోగించాలి అనే మార్గాలను బోల్డ్ స్కై కొన్ని మీకు అందిస్తున్నది . బేకింగ్ సోడ, చాలా సురక్షితమైనది మరియు చౌకైనది మరియు మన వంటగదిలో చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది . దుర్వాసను నివారించడంలో చాలా ఎఫెక్టిగా పనిచేస్తుంది. మరి బేకింగ్ సోడా దుర్వాసనను ఎలా నివారిస్తుందో తెలుసుకుందాం...

టాయిలెట్స్
బేకింగ్ సోడా టాయిలెట్ వాసను ఎలా నివారిస్తుంది? ఎంత శుభ్రంగా ఉన్న టాయిలెట్స్ అయినా కొన్ని సందర్భాల్లో జిడ్డుగా లేదా, పాచిగా మారుతుంది. కొద్దిగా బేకింగ్ సోడాను టాయిలెట్ బేసిన్ లో వేసి కొద్దిసేపు మూత మూసి ఒక గంట అలాగే ఉంచి తర్వాత నీరు ఫ్లష్ చేయడం వల్ల వాసన తొలగిపోతుంది.

ఎయిర్ కూలర్స్
ఎయిర్ కూలర్ పూర్తిగా వాటర్ తో నింపాలి, అందులో ఒక కప్పు బేకింగ్ సోడా వేసి మూత మూసి, ఒక గంట అలాగే వదిలేయాలి.ఇప్పుడు ఈ నీటిని తొలగించి, మంచి నీటితో కడిగి శుభ్రం చేయాలి. ఇలా చేసి చూడండి, మార్పు మీకే అర్ధం అవుతుంది.

డ్రైయిన్స్
డ్రైనేజి గొట్టాల నుండి వచ్చే ఫూయల్ స్మెల్ ను బేకింగ్ సోడాతో పూర్తిగా తొలగించుకోవచ్చు . కొన్ని వారాల పాటు, బేకింగ్ సోడాను నీళ్ళు పోయే డ్రైనేజ్ గొట్లాల్లో వేసి నింపాలి. ఒక గంట అలాగే ఉంచి తర్వాత నీరును ఫ్లష్ చేయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుండాలి.

వాక్యూమ్ క్లీనర్ మరియు కార్పెట్
బేకింగ్ సోడా దుర్వాసనను ఏవిధంగా నిర్మూలిస్తుంది? కార్పెట్ మీద మొత్తం కొద్దిగా బేకింగ్ సోడాను చిలకరించాలి. కొద్ది సమయం అలాగే ఉంచి, తర్వాత వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేయాలి . ఇది కార్పెట్ మీద మరియు వాక్యూమ్ క్లీనర్ రెండి నుండి వాసనను నిర్మూలిస్తుంది.

వంటగదిలో వాసన నిర్మూలించడానికి
వంటగదిలో వాసన వచ్చే ప్రదేశంలో మరియు షింక్ మరియు కొన్ని మూలల్లో బేకింగ్ సోడాను చిలకరించి ఒక గంట తర్వాత శుభ్రం చేయాలి. బేకింగ్ సోడా అన్ని రకాల చెడు వాసనను తొలగిస్తుంది.

షూ వాసన
బేకింగ్ సోడాను షూలోపల కొద్దిగా చిలకరించాలి . అవసరం అయితే కొద్దిసేపటి తర్వాత షూలను నీటితో కడిగేయవచ్చు. ఇలా చేయడం వల్ల మొత్త ఫ్యూయల్ స్మెల్ తొలగిపోతుంది.

రిఫ్రిజరేటర్
రిఫ్రిజరేటర్ లో అప్పుడప్పుడు వాసన వస్తుంటుంది. కాబట్టి, ఈ సమస్యను నివారించడానికి రిఫ్రిజరేటర్ లోపల ఒక చిన్న కప్పులో కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఒక పక్కగా పెట్టాలి.

బెడ్డింగ్
బెడ్ మీద కొద్దిగా బేకింగ్ సోడా చిలకరించాలి. కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేయాలి.

సోఫా మరియు ఇతర ఫర్నీచర్స్
సోఫా మరియు ఇతర ఫర్నీచర్ నుండి వచ్చే వాసనను కూడా బేకింగ్ సోడాతో తొలగించుకోవచ్చు . తర్వాత వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేయాలి.

పెట్ లిట్టర్ బాక్స్
బేకింగ్ సోడాను పెలిట్టర్ బాక్స్ లో కూడా చిలకరించి వాసనను నిర్మూలించవచ్చు. బేకింగ్ సోడా చిలకరించి, అరగంట తర్వాత మంచి నీళ్ళతో కడిగి శుభ్రం చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications











