For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్స్ క్లీన్ చేయడం మరవకండి

|

సాధరణంగా మనం తినేటటువంటి కూరగాయలను మరియు పండ్లను తినే ప్రతి సారి వాటిని శుభ్రం చేస్తుంటాము. ప్రతి సారి మనం ఎందుకు శుభ్రం చేయాలని ఆశ్చర్యం కలగవచ్చు? అలాంటి వారికోసమే ఈ ఆర్టికల్...

వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉపయోగించడానికి లేదా తినడానికి ప్రతి సారి శుభ్రం చేయడం వల్ల ఆహారం వల్ల వచ్చే జబ్బులను అరికట్టవచ్చు. ముఖ్యంగా పండించే కూరలు, పండ్లలో సాల్మోనెల్లా, లిస్టీరియాల మరియు ఈకాయిల్ వంటి బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బులను అరికట్టడానికి మనం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ను శుభ్రం చేయాల్సి ఉంటుంది . కూరలు మరియు పండ్లు నీళ్ళలో శుభ్రం చేయడం వల్ల వాటి మీద చేరిన దుమ్ము, ధూలి, మట్టి, హానికరమైన క్రిములను తొలగించుకోవచ్చు. అయితే బ్యాక్టీరియాను తొలగించుకోవడానికి పూల్ ఫ్రూఫ్ పద్దతి అంత మంచిది కాకపోవచ్చు.

కూరగాయలను మరియు పండ్లను పండించే విధానంలో మరియు పండించిన తర్వాత, వాటిని ఫ్రెష్ గా మార్కెట్ కు చేరవేసే పద్దతిలో కొన్ని రసాయనాలను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా భూమిలో పండిన వాటిమీద కంటికి కనబడని క్రిములు ఎక్కువగా ఉండటం వల్ల, వాటిని అలాగే నేరుగా తీసుకోకూడదు.

కాబట్టి, భూమిలో పండించినవైన, నేల మీద పండిచినవైనా ఏవైనా సరే కూరగాయలను మరియు పండ్లను తినడానికి ముందు శుభ్రం చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అందుకోసం కొన్ని సింపుల్ చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటి అనుసరించినట్లైతే మీ ఆరోగ్యం తో పాటు మీ ఇంట్లో వారి ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు...

1. గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి:

1. గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి:

కూరగాయలను కానీ, పండ్లు కానీ గోరు వెచ్చనీ నీటిలో వేసి శుభ్రం చేయాలి. ముఖ్యంగా వెజిటేబుల్స్ విషయంలో కొద్దిగా స్క్రబ్ చేసి కడగడం వల్ల వాటి మీద చేరిన పల్చటి వాక్స్ ను తొలగించుకోవచ్చు.

2. వెనిగర్ అండ్ వాటర్ తో వాష్ చేయాలి:

2. వెనిగర్ అండ్ వాటర్ తో వాష్ చేయాలి:

బ్రొకోలీ, కాలీ ఫ్లవర్, మరియు ఆకుకూరలను వెనిగర్ వేసి నీటిలో ఒక 5 నిముషాలు నానబెట్టుకొని తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. వండటానికి 10 నిముషాలు ముందు శుభ్రం చేసి పెట్టుకోవాలి.

3. స్కబ్బింగ్ బ్రష్ ఉపయోగించాలి:

3. స్కబ్బింగ్ బ్రష్ ఉపయోగించాలి:

కూరగాయలు మరియు పండ్ల మీద పేరుకొన్న దుమ్ము, ధూళి, పెస్టిసైడ్స్ ను తొలగించడానికి స్ర్కబ్ బ్రెష్ ను ఉపయోగించాలి. బంగాళదుంపలు, బెల్ పెప్పర్స్, క్యారెట్ మరియు కీరదోసకాయ వంటివి బాగా స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇది టాక్సిన్స్ మరియు పెస్టిసైడ్స్ తొలగించడానికి సహాయపడుతుంది.

4. మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి:

4. మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి:

చాలా సున్నితమైన పండ్లు మరియు చర్మం పెలుసుగా ఉన్న వెజిటేబుల్స్ మరియు పండ్లు , టమోటోలు, బెర్రీస్ మరియు ద్రాక్షవంటి వాటిని చల్లగా ఉండే మంచి నీటితో కడగడం మంచిది. పెస్టిసైడ్స్ నివారించడానికి నీటిలో కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేయాలి.

5. శుభ్రం చేయడం మరియు డ్రైయింగ్:

5. శుభ్రం చేయడం మరియు డ్రైయింగ్:

పండ్లు లేదా వెజిటేబుల్స్ నీటిలో శుభ్రం చేసిన తర్వాత కొద్దిసేపు వాటిని నీరు మొత్తం డ్రై అయ్యే వరకూ అలాగే ఉంచాలి. తర్వాత వెంటనే వండుకోవాలి.

6. కూరలు, పండ్లు శుభ్రపరచడానికి సోపులు మరియు డిటర్జెంట్స్ ఉపయోగించకండి:

6. కూరలు, పండ్లు శుభ్రపరచడానికి సోపులు మరియు డిటర్జెంట్స్ ఉపయోగించకండి:

కూరలు, పండ్లు శుభ్రపరచడానికి డిటర్జెంట్స్ మరియు సోపు వాడకూడదు. ఇవి వాడటం వల్ల పండ్లకు, వెజిటిటేబుల్స్ కు అట్టుకొన్న సోపులు సరిగా శుభ్రం చేకపోతే మరో రకంగా సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది .

English summary

Importance Of Washing Vegetables

Cleaning and washing your vegetables is an step to prevent food-borne illnesses caused by bacteria like salmonella, listeria & e.coli. Washing vegetables can eliminate most of the residues left on the fruits & vegetables like harmful pesticides, but it is not a foolproof method to remove bacteria.
Story first published: Wednesday, October 28, 2015, 16:43 [IST]
Desktop Bottom Promotion