Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
బాత్రూమ్ వాసన నివారించడానికి కొన్ని నేచురల్ పద్దతులు
సాధారణంగా ఇల్లల్లో లివింగ్ రూమ్, బెడ్ రూమ్, వంటగది, గెస్ట్ రూమ్ లకు ఇచ్చిన ప్రాధాన్యత బాత్ రూమ్ లకు ఇవ్వరు. అయితే బాత్ రూమ్ ను శుచి శుభ్రతలతో మెయింటైన్ చేసుకోవడం ప్రతి ఒక్కరి అవసం. ఆరోగ్యం. కాబట్టి తప్పని సరిగా బాత్ రూమ్ ను క్లీన్ గా పెట్టుకోవడం ప్రతి ఒక్కరి భాద్యత. బాత్ రూమ్ క్లీన్ గా లేకపోతే, పాచి పట్టి, దుర్వాస వస్తుంటుంది. అటువంటి ప్రదేశంలో ఎక్కువ క్రిములు చేరడం వల్ల ఇంట్లో వారికి వివిధ రకాలుగా వ్యాధులను వ్యాపింపచేస్తాయి. కాబట్టి, వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోవడానికి, మీ బాత్ రూమ్ క్లీనింగ్ ను మీ దిన చర్యలో ఒక భాగంగా చేసుకోవాలి.
స్టిక్కీగా లేదా వాసన వస్తుండే బాత్ రూమ్ లను తరచూ శుభ్రం చేస్తుండాలి. . అలాగే బాత్రూమ్ లో కెమికల్స్ లేదా క్లీనింగ్ ఏజెంట్స్ ను నిల్వ ఉంచడం కూడా ఉత్తమం కాదు. అటువంటి వాషింగ్ ఏజెంట్స్ ను చాలా అరుదుగా ఉపయోగిస్తుండాలి. బాత్ రూమ్ లో వెలువడే వాసనలను నివారించడానికి కొన్ని నేచురల్ మార్గాలున్నాయి. అయితే ముఖ్యంగా బాత్ రూమ్ క్లీనింగ్ విషయంలో ఎక్కువ సమయాన్ని తీసుకోవడం, టైల్స్ ను రుద్దడానికి కెమికల్స్, రసాయానాలు వేసి అరగంట పాటు నాననిచ్చి తర్వాత శుభ్రం చేయడం ఇవన్నీ సమయాన్ని వృధాచేయడమే. కాబట్టి బాత్ రూమ్ క్లీనింగ్ విషయంలో ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా సులభమైన చిట్కాలను అతి తక్కువ సమయంలో ఎలా శుభ్రం చేయాలో చూద్దాం....
బాత్ రూమ్ వాసనను నివారించే నేచురల్ పద్దతులు:

వెనిగర్ మరియు బేకింగ్ సోడా
ముందుగా, కొద్దిగా బేకింగ్ సోడాను బాత్ రూమ్ లో చిలకరించాలి. టాయిలెంట్ బౌల్లో ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. దాంతో పాటు కొన్ని చుక్కల వెనిగర్ ను కూడా టాయిలెంట్ బౌల్లో చిలకరించాలి. ఇలా చిలకరించిన తర్వాత ఒక గంట సేపు టాయిలెంట్ సీట్ ను మూసి ఉంచాలి. తర్వాత నీరు ఫ్లష్ చేయడం వల్ల టాయిలెట్ బౌల్ శుభ్రపడటంతో పాటు, టాయిలెంట్ వాసనను నివారిస్తుంది.

ఆయిల్
బాత్ రూమ్ లో వాసనలు నివారించే కొన్ని రకాల నూనెలు. టాయిలెట్ ఫ్లోర్ మీద కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ను చిలకరించాలి. లేదా కొన్ని చుక్కల నూనెను మగ్ నీటిలో మిక్స్ చేసి తర్వాత టాయిలెట్ బౌల్ మీద చిలకరించి 15 నిముషాల తర్వాత నీరు ఫ్లష్ చేయాలి.

కొన్ని సువాసన భరితమైన మొక్కలను ఉంచాలి
బాత్ రూమ్ వాసన నివారించడానికి మరో ఉత్తమ మార్గం? బాత్ వాసన నేచురల్ గా తగ్గించడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. సువాసన భరితమైన కొన్ని రకాల మొక్కలను బాత్ రూమ్ లోపల స్టోర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కనుక చాలా చిన్న బాత్ రూమ్ ఉన్నట్లైతే, ఈ ఐడియాను అనుసరించడం కష్టం అవుతుంది . అయితే మీ బాత్ రూమ్ లో ఎక్కువ స్థలం ఉన్నట్లైతే, కొన్ని రకాల మొక్కలను అమర్చుకోవచ్చు.

శుభ్రంగా క్లీన్ చేయాలి:
స్నానం చేసిన లేదా బాత్ రూమ్ ను ఉపయోగించిన ప్రతి సారి, బాత్ రూమ్ ను శుభ్రంగా క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల బాత్ యొక్క వాసన తొలగిపోతుంది. టాయిలెంట్ బౌల్ ను స్ర్కబ్ చేసి శుభ్రం చేస్తే మరింత క్లీన్ గా ఉంటుంది. అలాగే వాసన తొలగిపోయే వరకూ బాత్ రూమ్ ను శుభ్రం చేయాలి. బాత్ రూమ్ వాసన తొలగించడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

ఎక్సాస్ట్ ఫ్యాన్ ను ఫిక్స్ చేయండి:
బాత్ రూమ్ లో యూరిన్ వాసను తొలగించడం ఎలా? బాత్ రూమ్ వాసన బాత్ రూమ్ మొత్తం వ్యాప్తి చెందకుండా చూసుకోవాలంటే, బాత్ రూమ్ లో ఎక్సాస్ట్ ఫ్యాన్ అమర్చుకోవాలి. బాత్ రూమ్ లోపల ఉండే వాసన చాలా సులభంగా తొలగించడానికి ఫ్యాన్ సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
