Latest Updates
-
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
పడకగదిలోని వార్డ్ రోబ్ ఆకర్షణీయంగా కనబడాలంటే
ప్రస్తుతం ఇంటీరియర్ డిజైనింగ్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇంట్లో అమర్చుకునే అన్ని వస్తువుల రూపాల్లోనూ పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో అయితే కిచెన్, బెడ్ రూమ్, హాల్ ..ఇలా ప్రతి గదిలోనూ వస్తువుల్ని పెట్టుకోవడానికి ఎక్కడికక్కడే షెల్ఫ్ లు ఉండేవి. అలాగే బట్టలు కూడా బీరువా లేదా అల్మరాల్లోనే పొందికగా సర్దుకునే వారు. కానీ ఇప్పుడు వాటి స్థానాన్ని వార్డ్ రోబ్ లు ఆక్రమించాయి. దీనిలో వస్తువులు, బట్టలు పెట్టడం వల్ల వాటిపై దుమ్ము, ధూళి పడకుండా ఎప్పటికీ కొత్తగా, నీట్ గా కనిపిస్తాయి.
అయితే, ఎలగూ వార్డ్ రోబే కదా..ఏ వస్తువూ బయటికి కనిపించదని ఇష్టం వచ్చినట్లుగా అందులో పడేస్తే చూడడానికి చిరాగ్గా అనిపించడంతో పాటు కావల్సిన వస్తువు సమయానికి దొరక్కుండా పోతుంది. కాబట్టి దీన్ని కూడా ఒక క్రమపద్దతిలో సర్ధుకోవడం చాలా మంచిది. ఈ క్రమంలో బెడ్ రూమ్ లోని వార్డ్ రోబ్ ఆకర్షణీయంగా కనిపించేలా ఎలా సర్దుకోవచ్చో ఇప్పుడు చూద్దాం....

సీజన్ బట్టి...
బెడ్ రూమ్ వార్డ్ రోబ్ ను సీజన్ ను బట్టి అందంగా సర్ధుకోవచ్చు. ఉదాహరణకు...చలికాలంలో మనం స్వెట్టర్లు, క్యాప్ లు, మందంగా ఉండే దుస్తులు...వంటివి ఎక్కువగా ధరిస్తుంటాం. కాబట్టి వీటిని వార్డ్ రోబ్ లో మనకు చేతికి అందే విధంగా ముందు వరుసలో అమర్చుకోవాలి. ఇక ఈ సీజన్ లో వేసవి, వర్షాకాలాల్లో ఉపయోగించే దస్తుల్ని కింది షెల్ఫ్ ల్లో సర్ధుకోవాలి. అలాగే మనం చాలా అరుదుగా వాడే దుస్తులు, వస్తువుల్ని అన్నింటికంటే పై షెల్ఫ్ ల్లో సర్ధుకోవడం మంచిది. ఇదే విధంగా వేసవి, వర్షాకాలాలు వచ్చినప్పుడు కూడా ఆయా సీజన్ ను బట్టి దుస్తులు, వస్తువులు అమరిక ఉంటే వార్డ్ రోబ్ చూడడానికి అందంగా కనిపించడంతో పాటు, అవసరమైన వస్తువులు కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.
హ్యాంగర్స్ తో:
చాలా మంది వార్డ్ రోబ్ పెద్దగా ఉంటేనే ఎక్కువ వస్తువులు పెట్టుకోవడానికి వీలుంటుంది..అలాగే నీట్ గా కనిపిస్తుందనుకుంటారు. కానీ అది పొరపాటు. వార్డ్ రోబ్ చిన్నగా ఉన్నా దాన్ని అందంగా సర్దుకోవచ్చు. ఒక వేళ మీకు దుస్తులు ఎక్కువగా ఉండి, సర్దుకోవడానికి తక్కువ స్థలం ఉందనుకుంటే..ప్యాంట్ -షర్ట్స్, చీరలు...ఇలా కొన్ని దుస్తుల్ని హ్యాంగర్స్ కు తగిలించి వార్డ్ రోబ్ లో అందంగా అమర్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల స్థలం సరిపోవడంతో పాటు చూడడానికి కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
వేటికవే అందంగా కనిపిస్తాయి:
బెడ్ రూమ్ వార్డ్ రోబ్ లో దుస్తులతో పాటు హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, నగలు,..ఇలా రకరకాల వస్తువుల్ని పెట్టుకుంటాం. మరి అన్నింటినీ కలిపి ఒకేచోట పెట్టుకుంటే చూడడానికి అస్సలు బాగుండవు. కాబట్టి అన్నింటినీ విడివిడిగా అరల్లో పెట్టుకుంటే చూడడానికి అందంగా కనిపించడంతో పాటు ఎక్కువగా వెతికే పనిలేకుండా సులభంగా దొరికే అవకాశం ఉంటుంది. అలాగే వీటిలో కూడా రోజూ అవసరమైనవి, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కావాల్సినవి..ఇలా వేర్వేరుగా ఉంటాయి. ఇలాంటి వాటిని వేర్వేరుగా సర్ధుకోవడం మంచిది. ఇలా వేటికవే అందంగా సర్ధుకోవడం వల్ల వార్డ్ రోబ్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
వారానికోసారి:
వార్డ్ రోబ్ ఆకర్షణీయంగా సర్ధాం..ఇక్కడితో మన పని పూర్తయిందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మనలో చాలా మంది రోజూ ఆఫీసుకు వెళ్ళే హడావిడిలో పడి సమయం సరిపోక వార్డ్ రోబ్ లో ఉండే దుస్తులు, బ్యాగ్స్...ఇలా వస్తువులన్నీ చిందరవందరగా పడేస్తుంటారు. పోనీ సాయంత్రం ఇంటికి వచ్చాక సర్ధుదామంటే మళ్ళీ వంట చేయడం, మరుసటి రోజుకు కూరగాయలు కట్ చేసుకోవడం, పిల్లలు, భర్త అవసరాలు చూసుకోవడం...ఇలాంటి పనులతోనే సరిపోతుంది. కాబట్టి నోజూ నీట్ గా పెట్టుకోవడానికి సమయం ఉండదు. అందుకే వారానికోసారి సెలవు రోజున కాస్త సమయం కేటాయించి వార్డ్ రోబ్ ను శుభ్రంగా, అందంగా సర్ధుతుండాలి. లేదంటే కొన్ని రోజులకు వస్తువులన్నీ చిందరవందరగా తయారై అంతా గందరగోళంగా మారుతుంది. అలాగే వదిలేస్తే కొన్ని రోజులకు వాటిపై దుమ్ము కూడా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా వారానికోసారి లేదంటే పదిహేను రోజుకోసారి సర్ధుకోవడం వల్ల వార్డ్ రోబ్ నీట్ గా ఉండడంతో పాటు అందులో ఉండే వస్తువులు కూడా దుమ్ము పట్టకుండా శుభ్రంగా ఉంటాయి.
దుమ్మ పడకుండా: బెడ్ రూమ్ లో ఉండే వార్డ్ రోబ్ లు అన్నింటికీ తలుపులు ఉండాలనే రూలేం లేదు. ఒక వేళ తలుపులు లేని వార్డ్ రోబ్ ఉందనుకోండి. అందులో ఉండే వస్తువులకు ఎక్కువగా దుమ్ము పట్టే అవకాశం ఉంటుంది. అలాగే అవన్నీ బయటకు కనిపిస్తుంటాయి. ఇలా కనిపించడం కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఆ వార్డ్ రోబ్ కు ఒక చక్కటి కర్టెన్ వేయండి. దాంతో వార్డ్ రోబ్ లో ఉండే వస్తువులపై దుమ్ము పడకుండా ఉండడంతో పాటు బయటికి ఏ వస్తువూ కనిపించకుండా గది నీట్ గా కనిపిస్తుంటుంది.
ఫర్నీచర్ కు అనుగుణంగా:
పడకగదిలో ఉండే మంచి, డ్రెస్సింగ్ టేబుల్, వంటి ఫర్నిచర్ ఒకదానికొకటి మ్యాచ్ అయ్యేలా ఉంటేనే చూడడానికి గది అందంగా కనిపిస్తుంది. అలాగే బెడ్ రూమ్ లో ుండే వార్డ్ రోబ్ రంగు, మెటీరియల్ కూడా వీటికి తగినట్లుగా ఉంటేనే గదికి మరింత అందం చేకూరుతుంది. వార్డ్ రోబ్ లో ఉండే హ్యాంగర్లు తేలిగ్గా, నాణ్యమైనవై ుండాలి. వార్డ్ రోబ్ లోపల ఉండే చిన్న చిన్న కప్ బోర్డ్స్, డ్రాన్...వంటి వాటి మెటీరియల్, రంగు కూడా వార్డ్ రోబ్ కు అనుగుణంగా ఉండేలా చూసుకుంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వార్డ్ రోబ్ ఉండే ప్రదేశంలో లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలి. లేదంటే రాత్రి పూట మీకేమైనా వస్తువులు కావాలనుకుంటే సరైన వెలుతురు లేక..వస్తువులను వెతుక్కోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి లైటింగ్ వల్ల వస్తువులు దొరకడంతో పాటు వార్డ్ రోబ్ కూడా శోభాయమానంగా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications











