Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇండక్షన్ స్టౌ అంటే ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రస్తుత రోజుల్లో వంటగ్యాస్ సిలిండర్లు పరిమితం చేయడం వల్ల, వంటగ్యాస్ కొరత బాగా ఏర్పడింది. ఇలాంటి సమయంలో ‘ఇండక్షన్ స్టౌ'లు విరివిగా మార్కెట్ లోకి వస్తున్నాయి. రావడం మాత్రమే కాదు వీటి వాడకం కూడా క్రమంగా పెరుగుతున్నది. ముఖంగా నగరాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంది.
ఇంతకీ ‘ఇండక్షన్ స్టౌ' అంటే ఏమిటి? విద్యుత్, అయస్కాంత తత్వాత గురించి పాఠాల్లో వినడమో లేదా చదడవమో చేసి ఉంటారు. . ఏదైనా ఇనుప ముక్క చుట్టూ అమర్చిన తీగల్లోకి విద్యుత్‌ను ప్రవహింపజేస్తే ఆ ఇనుప ముక్క అయస్కాంత తత్వాన్ని సంతరించుకుంటుంది. ఇలా అయస్కాంత తత్వాన్ని పొందిన ఇనుప ముక్కపై మరో చోట రాగి తీగను చుట్టినట్లయితే అందులో విద్యుత్ క్షేత్రం ప్రేరేపితం అవుతుంది.
మరోవిధంగా చెప్పాలంటే మారే విద్యుత్ ప్రవాహం అయస్కాంత క్షేత్రాన్ని, మారే అయస్కాంత క్షేత్రం విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే విద్యుత్ అయస్కాంత ప్రేరణ (Electro magnetic Induction) అంటారు. ఈ సూత్రం ఆధారంగానే మన ఇళ్లలో ఫ్యాన్స్, పంటపొలాల్లో మోటార్స్ పని చేస్తున్నాయి. ఇండక్షన్ స్టౌ కూడా ఇదే సూత్రంపై పనిచేస్తుంది. స్టౌ లోపల విద్యుత్ వలయం ఉన్న ఓ ఇనుప కోర్ (ఇనుప ప్లేట్ల సముదాయం) ఉంటుంది. విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ కోర్ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.

స్టౌ మీద పాత్ర పెట్టే ప్లాట్‌ఫారం మీద కూడా ఈ క్షేత్రం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇనుప పాత్రను స్టౌ పై పెడితే అందులో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. అయితే ఈ పాత్రకు నిరోధం (resistance) ఉండడం వల్ల అందులో విద్యుత్ ప్రవాహం ఉష్ణంగా మారుతుంది. అందువల్ల పాత్ర వేడెక్కి అందులోని పదార్థాలు ఉడుకుతాయి. ఈ స్టౌ మీద కేవలం స్టీలు లేదా ఇనుప పాత్రలనే ఉపయోగించాలి. స్టౌ గురించి తెలుసుకొన్నారు కదా! దీనిని ఏవిధంగా వాడాలి మరియు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దం..

ఇళ్లలో చాలా మందికి ప్రతి వస్తువుకి క్రింద వస్త్రాన్ని పరిచే అలవాటు ఉంటుంది. ఇండక్షన్ స్టౌ విషయంలోనూ అదే చేస్తారు. ఇలా చేయడం వల్ల దాని నుంచి ఉత్పత్తి అయ్యే వేడికి కింద ఉన్న వస్త్రం కాలిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా స్టౌ కూడా పాడవ్వొచ్చు. కాబట్టి ఇండక్షన్ స్టౌ కింద పేపర్ లేదా క్లాత్ లాంటివి పరచకూడదు.
ఇండక్షన్ స్టౌ విద్యుత్ తో పనిచేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దీనిని చెక్క టేబుల్ మీదే పెట్టడం మంచిది. అంతే కాదు సిరామిక్ టైల్స్, సిమెంట్ ఫోర్ పైన కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ స్టౌ ని మెటల్ టేబుల్ మీద మాత్రం పెట్టకూడదు . దీనివల్ల షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇండక్షన్ స్టౌ మీద వంట పాత్రను పెట్టగానే రెండింటికీ మద్య ఉన్న అయస్కాంత ప్రభావం వల్ల ఒకదానికొకటి అతుక్కోవాలి. అప్పుడే అది స్టౌకి సరిపోయే పాత్ర అవుతుంది.
కొందరు ఇండక్షన్ స్టౌ వ్ ని సైతం గ్యాస్ స్టౌ పక్కనే పెడుతుంటారు. దీని వల్ల సాధారణ సందర్భాల్లో ఎటువంటి నష్టం కలగదు. కానీ ఎప్పుడైనా పొరపాటున గ్యాస్ లీకైతే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
ఇండక్షన్ స్టౌను రేడియోలు, టీవీలు, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే అయస్కాంత క్షేత్రప్రభావం వల్ల అవి పాడయిపోయే అవకాశాలున్నాయి.

మరో ముఖ్య విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్సెటెన్షన్ ప్లగ్ బాక్సులకు ఇండక్షన్ స్టౌ ప్లగ్ ని అనుసంధానించకూడదు.
మనలో చాలా మందికి ఉన్న అలవాటు ఇంట్లో ఉన్న సామాన్లను అంతటినీ సబ్బుతో రుద్దిరుద్ది తోమడం. అదే పనిని ఇండక్షన్ స్టౌ విషయంలో చేస్తామంటే కుదరదు. అలా చేయకూడదు. అలా చేస్తే అది పాడైపోయే ప్రమాదం ఉంది. నీటిని ఉపయోగించకుండా మెత్తని వస్త్రంతో మాత్రమే దీనిని తుడవాలి.
ఇండక్షన్ స్టౌకి ఉన్న రంధ్రాల్లో దుమ్ము, ధూళి చేరకుండా చూసుకోవాలి.
స్టౌకి ఏమైనా పగుళ్లు వచ్చినట్లనిపిస్తే దానిని ఉపయోగించకూడదు.
అలాగే స్టౌకి దగ్గరలో ఎలాంటి లోహసామాగ్రిని ఉంచకూడదు.



Click it and Unblock the Notifications