Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మ్యాట్రస్ ను ఎంపిక చేసుకోవడానికి 5 సింపుల్ టిప్స్
ఓ అధ్యయనం ప్రకారం ప్రతి వ్యక్తీ తన జీవిత కాలంలో పదహారు సంవత్సరాల పాటు నిద్రలో గడిపేస్తారట. అందుకే పరుపుని కొనేటప్పుడు నాణ్యమైనదాన్ని ఎంపిక చేసుకోవాలి. అయితే మీకు ఎలాంటి పరుపును తీసుకోవాలో తెలుసా? నిద్రలేమి సమస్యలను నివారించి, మంచి నిద్ర పొందడానికి సహాయపడే కొన్ని మ్యాట్రస్ ఎంచుకోవడంలో కొన్ని మెలుకువళను ఈ క్రింది విధంగా సూచిస్తున్నామ.
పరుపు మరీ గట్టిగా ఉండటం మంచిది కాదంటున్నారు పరిశోధకలు. రీసెంట్ గా జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారణం మరీ మెత్తగా, లేదా మరీ గట్టిగా ఉన్నదాన్ని కాకుండా మధ్యస్థంగా ఉన్న రకాన్ని ఎంపికచేసుకుంటే వెన్ను నొప్పి బెడద ఉండదు.

మ్యాట్రస్ కొనడానికి వెళ్ళు ముందే ఆన్ లైన్ లో ఒకసారి పరిశోధన చేసుకోవాలి. ఫలితంగా మీకు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ప్రాథమికంగా ఓ అంచనాకు రావొచ్చు. మ్యాట్రసెస్ బ్రాండ్స్ ఎప్పటికప్పుడు కొత్తవి అందుబాటులోకి వస్తున్నాయి. వాతావరణ మార్పులకు అనుగుణంగా వాటి మెత్తదనంతో పాటు మారేటువంటి లక్షణాలను కలిగి ఉంటున్నాయి .
వ్యక్తి ఎత్తు కంటే కనీసం పది సెం. మీ పొడవు ఎక్కువ ఉన్న దాన్ని ఎంపికచేసుకోవాలి. ఆరు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న కింగ్ సైజ్ మాట్రస్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

మీరు ఎంపిక చేసుకోవాలనుకుంటున్న పరుపు మీ వెన్ను భాగానికి సరైన ఆధారాన్ని అందిస్తున్నదో లేదో గమనించుకోవాలంటే ముందుగా దానిపై వెల్లకిలా పడుకోవాలి. అప్పుడు నడుం వెనుకగా మీ అరచేతిని పోనివ్వండి. మీ చేయి సులభంగా వెళ్తుంటే అది మరీ మెత్తగా ఉన్నట్లు. అలా లేదంటే మరీ గట్టిగా ఉన్నట్లు అర్థం. నడుంనొప్పితో బాధపడుతున్నవారికి ఈ రెండు తరహాలు పనికిరావు. ఈ రెండు రకాలకు మధ్యస్థంగా ఉండే పరుపును ఎంపికచేసుకోవాలి.

ప్రతి పది సంవత్సరాలకొకసారి పరుపును మార్చేయాలి. అప్పటికే చాలా రకాల పరుపులు పలుచగా తయారై...ఉండలు కట్టి పరుపు మీద పడుకోవడానికి ఇబ్బందిగా మారుతుందంటున్నారు పరిశోధకులు.

మొత్తంగా చూస్తే...సౌకర్యమే పరుపు కొనడానికి ప్రధాన అర్హత. మార్కెట్లో ఉన్న రకరకాల పరుపుల్లో దేనిని ఎంచుకోవాలన్నది ఆయా వ్యక్తులను వ్యక్తిగత ఇష్టాన్ని బట్టి ఉంటుంది.



Click it and Unblock the Notifications