For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రిఫ్రిజిరేటర్ శుభ్రంగా మరియు క్రిమి రహితంగా ఉండటానికి 5 సులువైన పరిష్కారాలు

By Lakshmi Perumalla
|

ప్రతి రోజు రిఫ్రిజిరేటర్ ని శుభ్రం చేయవలసిన అవసరం ఉంది. రిఫ్రిజిరేటర్ శుభ్రంగా లేకపోతే దానిలో పెట్టె ఆహార పదార్ధాలు తొందరగా పాడు అవుతాయి. ఇది సూక్ష్మజీవుల పెరుగుదలకు పరిపూర్ణ వాతావరణాన్ని సృష్టిస్తుంది.

మనం గుర్తించలేకపోయిన, రిఫ్రిజిరేటర్ గోడలు మరియు కంపార్ట్మెంట్ లు ఆహారాన్ని కలుషితం చేసే లేదా ఆహారాన్ని వేగవంతంగా కుళ్లిపోయేలా చేసి వాటి అవశేషాలను కూడకడుతుంది.

<strong>ఫ్రిడ్జ్ లో సురక్షితం కానీ ఆహారాలు: వీటిని ఎట్టి పరిస్థిలో ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిదికాదు!</strong>ఫ్రిడ్జ్ లో సురక్షితం కానీ ఆహారాలు: వీటిని ఎట్టి పరిస్థిలో ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిదికాదు!

అదృష్టవశాత్తూ, ఖరీదైన లేదా ఘాటైన రసాయనాలను ఉపయోగించకుండా మీ రిఫ్రిజిరేటర్ ని శుభ్రం చేయటానికి అనేక పద్ధతులు ఉన్నాయి.

ఇంటిలో సులభంగా సహజమైన పద్ధతుల్లో రిఫ్రిజిరేటర్ ని శుభ్రం చేసుకోవటానికి 5 సులువైన మరియు చవకైన పరిష్కారాలు ఉన్నాయి. మిస్ కావద్దు.

1. బేకింగ్ సోడా

1. బేకింగ్ సోడా

సోడియం బైకార్బొనేట్ లేదా బేకింగ్ సోడాలో క్రిమిసంహారక మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన మీ రిఫ్రిజిరేటర్ ని శుభ్రపరచటానికి క్రిమిసంహారక ఉత్తమ పరిష్కారాలలో ఒకటి. బేకింగ్ సోడా రిఫ్రిజిరేటర్ లోపల అంటుకుని మరియు అసహ్యకరమైన వాసనలు తటస్థీకరిస్తుంది. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని తొలగిస్తుంది.

కావలసిన వస్తువులు

బేకింగ్ సోడా - 3 టేబుల్ స్పూన్లు (30 గ్రా)

వెచ్చని నీరు - 2 కప్పులు (500 మి.లీ)

సామాగ్రి

బౌల్ లేదా ఇతర కంటైనర్

స్పాంజ్ లేదా స్కౌరింగ్ ప్యాడ్

ఇంకే వస్త్రం

తయారీ విధానం

ఒక బౌల్ లో బేకింగ్ సోడా మరియు వేడి నీటిని పోయాలి.

రెండు బాగా కలిసేలా కలపాలి.

ఎలా ఉపయోగించాలి

బేకింగ్ సోడా ద్రవంలో ఒక స్పాంజ్ లేదా స్కోరింగ్ ప్యాడ్ ని ముంచి మీ రిఫ్రిజిరేటర్ యొక్క గోడలు మరియు కంపార్ట్మెంట్ల మీద రుద్దాలి. 5 నిముషాల పాటు ఆలా వదిలేయాలి. ఆ తర్వాత ఇంకే వస్త్రంతో తుడవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి.

2. నిమ్మరసం

2. నిమ్మరసం

నిమ్మ రసంలో ఉండే సహజ ఆమ్లాలు బ్యాక్టీరియా మరియు ధూళిని తొలగించే శక్తివంతమైన శుభ్రపరిచే ఏజెంట్లుగా పనిచేస్తాయి.

నిమ్మరసం సహజ లక్షణాలు రిఫ్రిజిరేటర్ యొక్క ఉపరితలం దోషరహితంగా మరియు వాసనలు లేకుండా చేస్తాయి.

కావలసినవి

నిమ్మకాయలు - 3 (జ్యుస్ తీయాలి)

వెచ్చని నీరు - 2 కప్పులు (500 మి.లీ)

సామాగ్రి

స్ప్రే సీసా

శుభ్రమైన టవల్ లేదా వస్త్రం

తయారీ

నిమ్మకాయల నుండి రసాన్ని పిండి వేడి నీటిలో కలిపి ఒక స్ప్రే సీసాలో పోయాలి.

బాగా కలపాలి.

ఎలా ఉపయోగించాలి

రిఫ్రిజిరేటర్ నుండి అన్ని ఆహారాలను మరియు వస్తువులను తీసి నిమ్మ ద్రావణాన్ని స్ప్రే చేయాలి.

ఆ తర్వాత 5 నిమిషాల పాటు శుభ్రమైన టవల్ లేదా వస్త్రంతో రుద్దాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

<strong>ఫ్రిజ్ లో స్థలం సరిపోవడం లేదా..? అందుకు సులభ చిట్కాలు </strong>ఫ్రిజ్ లో స్థలం సరిపోవడం లేదా..? అందుకు సులభ చిట్కాలు

3. వైట్ వెనిగర్

3. వైట్ వెనిగర్

రిఫ్రిజిరేటర్ లోపల మరియు వెలుపల శుభ్రం చేయటానికి వైట్ వెనిగర్ పర్యావరణానికి అనుకూలమైన ద్రావణం. వైట్ వెనిగర్ కి ఉపరితలంపై పొడిగా ఉన్న ఆహార అవశేషాలను లేదా వ్యర్ధాలను తొలగించే లక్షణం ఉంది.

కావలసిన వస్తువులు

వైట్ వెనిగర్ - అరకప్పు (125 మిలీ)

వెచ్చని నీరు - ఒక కప్పు (250 మి.లీ)

సామాగ్రి

స్ప్రే సీసా

ఇంకే వస్త్రం

తయారీ

వెచ్చని నీటిలో వైట్ వెనిగర్ కలిపి స్ప్రే సీసాలో పోయాలి.

ఎలా ఉపయోగించాలి

రిఫ్రిజిరేటర్ ని ఖాళీ చేసి శుభ్రం చేయదలిచిన అన్ని గోడలు మరియు ఉపరితలాలపై వినెగర్ ని స్ప్రే చేయాలి.

ఆ తర్వాత 5 నిముషాల పాటు ఇంకే వస్త్రంతో రుద్దాలి.

కనీసం వారానికి ఒకసారి ఈ విధంగా చేయాలి.

4. ఆలివ్ నూనె మరియు నిమ్మ

4. ఆలివ్ నూనె మరియు నిమ్మ

నిమ్మకాయ మరియు ఆలివ్ నూనె స్టెయిన్ లెస్ స్టీల్ రిఫ్రిజిరేటర్ యొక్క ఉపరితలాలను శుభ్రం చేయటానికి చాలా ఆదర్శంగా ఉంటుంది.

రిఫ్రిజిరేటర్ భాగాలు దెబ్బతీయకుండా జిడ్డైన అవశేషాలను, దుమ్ము మరియు వ్యర్ధాల నుండి శిధిలాలను తొలగిస్తాయి.

కావలసిన వస్తువులు

ఆలివ్ నూనె - 4 టేబుల్ స్పూన్లు (64 గ్రా)

నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు (30 మి.లీ)

సామాగ్రి

ప్లేట్ లేదా ఇతర కంటైనర్

మృదువైన వస్త్రం

తయారీ

ఒక ప్లేట్ లేదా ఇతర కంటైనర్లో ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసం చేర్చండి.

ఎలా ఉపయోగించాలి

రిఫ్రిజిరేటర్ ఉపరితలంపై ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని మృదువైన వస్త్రం సహాయంతో రుద్దాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా తడి వస్త్రంతో తుడవాలి.

ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి.

5. టీ ట్రీ ఆయిల్

5. టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ లో క్రిమి సంహారిక లక్షణాలు ఉండుట వలన రిఫ్రిజిరేటర్ ని శుభ్రం చేయటానికి బాగా సహాయపడుతుంది.

మునుపటి పరిష్కారాల ప్రభావంతో ఆహార అవశేషాలను తొలగించనప్పటికీ, ఇది బ్యాక్టీరియాను తొలగించడానికి మంచి ఎంపిక.

కావలసిన వస్తువులు

టీ ట్రీ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు (30 గ్రా)

వెచ్చని నీరు - 1 కప్పు (250 మి.లీ)

సామాగ్రి

స్ప్రే సీసా

మైక్రో ఫైబర్ వస్త్రం

తయారీ

వెచ్చని నీటితో టీ ట్రీ ఆయిల్ ను కలిపి స్ప్రే సీసా లోకి పోయాలి.

ఎలా ఉపయోగించాలి

ద్రవాన్ని బాగా షేక్ చేసి రిఫ్రిజిరేటర్ యొక్క గోడలపై స్ప్రే చేయాలి.

మైక్రో ఫైబర్ వస్త్రంతో తుడవాలి.

ఈ విధంగా వారంలో 2 లేదా 3 సార్లు చేయాలి.

శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఇంకా రిఫ్రిజిరేటర్ ని శుభ్రం చేయకపోతే ఈ పద్ధతుల్లో సులభంగా శుభ్రం చేసుకోండి.

English summary

5 Easy Solutions to Clean and Disinfect Your Refrigerator

5 Easy Solutions to Clean and Disinfect Your Refrigerator. Read to know more about...
Story first published:Tuesday, November 14, 2017, 16:38 [IST]
Desktop Bottom Promotion