For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు తప్పనిసరిగా తెలియాల్సిన టాయిలెట్ శుభ్రపరిచే మేటి చిట్కాలు

|

శుభ్రమైన టాయిలెట్ విలాసం కన్నా ఎన్నో రెట్లు ముఖ్యమైనది ; అది ఒక తప్పనిసరి అవసరం. దాన్ని సులభంగానే పొందవచ్చు కూడా. కావాల్సినవి ఒక టాయిలెట్ క్లీనర్, మంచి టాయిలెట్ బ్రష్ మరియు కొంచెం డిస్ ఇన్ఫెక్టెంట్ ద్రవం, చేయాలన్న శ్రద్ధ మరియు కొంచెం రోజులో మీ సమయం, అంతేగా !

మీ టాయిలెట్ ముందునుంచే ఎంతో శుభ్రంగా తళతళలాడుతోందనే భ్రమలో మీరున్న సమయంలోనే, బాత్ రూమ్ లో ఉన్న అనేక చిన్న చిన్న పగుళ్ళు, మూలలలో అనేక బిలియన్ల సూక్ష్మజీవులు మీకోసం పగతో ఎదురుచూస్తూ తమ నివాసాలు ఏర్పర్చుకుంటున్నాయి.

అవి టాయిలెట్ బ్రష్, టాయిలెట్ పై ఉన్న చట్రం లేదా మూత, టాయిలెట్ వెనుక ప్రదేశం, ఇంకా చెప్పాలంటే టాయిలెట్ సీటుపై కూడా ఉన్నాయి. మీరు శుభ్రమైనదని సంబరపడుతున్న టాయిలెట్ లోనే ఇంత ఊహించలేని మురికి ఉందంటే, అసలు రోత పుట్టించే టాయిలెట్ ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు.

సరేలేండి, ఇక్కడ బాగుచేయలేనంత ఏమీ లేదు- కావాల్సినది కొంచెం సమయం, సరైన విధానం అంతే.

ప్లెయిన్ ల్యాండింగ్ -టేక్ ఆఫ్ టైంలో టాయిలెట్ ఎందుకు ఉపయోగించరాదు?ప్లెయిన్ ల్యాండింగ్ -టేక్ ఆఫ్ టైంలో టాయిలెట్ ఎందుకు ఉపయోగించరాదు?

మీకు తప్పనిసరిగా తెలియాల్సిన టాయిలెట్ శుభ్రపరిచే మేటి చిట్కాలు

మీకు తెలుసా మీ బాత్ రూంలో అన్నిటికన్నా ఎక్కువ మీ టాయిలెట్ బ్రష్ లో సూక్ష్మజీవులు స్థిరపడతాయని? టాయిలెట్ శుభ్రం చేసేసాక కొంతమంది టాయిలెట్ బ్రష్ లను పట్టించుకోకపోవటంతో మలం అక్కడ చేరి అన్ని రకాల బ్యాక్టీరియా కూడా అక్కడ మెల్లగా చేరతాయి.


ఇది తిప్పికొట్టడానికి, శుభ్రం చేసేసిన రాత్రి మీ టాయిలెట్ బ్రష్ ను డిస్ ఇన్ఫెక్టంట్ ద్రవం లేదా బ్లీచ్ లో ముంచి పెట్టండి. అద్భుతం ! మరోసారి ఉపయోగించటానికి మీ టాయిలెట్ బ్రష్ శుభ్రపడిపోయి సిద్ధమైపోయింది.

టాయిలెట్ వెనుకభాగం, గోడకి దగ్గరగా ఉండే స్థలాన్ని శుభ్రపర్చటానికి కొన్ని జిమ్నాస్టిక్ వ్యాయామాలు చేయాల్సి వస్తుంది. ఆ కష్టాన్ని సులువు చేయటానికి డిస్ ఇన్ఫెక్టంట్ స్ప్రేను వాడండి.

మీకు తప్పనిసరిగా తెలియాల్సిన టాయిలెట్ శుభ్రపరిచే మేటి చిట్కాలు

టాయిలెట్ ను సరిగా శుభ్రం చేసే ఇతర చిట్కాలు, పద్ధతులు కూడా కింద చదవండి.

డిస్ ఇన్ఫెక్టంట్

కొంత డిస్ ఇన్ఫెక్టంట్ ద్రవాన్ని చల్లి రాత్రంతా వదిలేయండి. ఎండిపోయి, గట్టిగా అతుక్కున్న మలం అంత త్వరగా రాదు కాబట్టి ఇది అవసరం. ప్రత్యామ్నాయంగా, గుడ్డను డిస్ ఇన్ఫెక్టంట్ ద్రవంలో ముంచి ఆ తడిగుడ్డను చేతిలో పట్టుకుని టాయిలెట్ సీటు చుట్టూతా, పైనా రుద్ది తుడవచ్చు. తళతళా మెరిసే వరకూ తుడుస్తూనే ఉండి తర్వాత పొడి గుడ్డతో తుడవండి.

టాయిలెట్ సీటు పైన చట్రం లేదా మూత లోపల మలపదార్థాలు చేరి ఉంటాయి మరియు దాన్ని శుభ్రం చేయటం చాలా కష్టం. పైన ఒక రెండుసార్లు శుభ్రపర్చే ద్రావణాన్ని చల్లి , శుభ్రపడిపోయిందని అనుకోవటం సులువు కానీ అది సరిగ్గా శుభ్రపర్చకపోతే, బ్యాక్టీరియా అక్కడ పెరిగి చాలా హానికారకంగా మారతాయి.

పురుషులు.. ఎక్కువగా కోపం తెప్పించే ఆ 10 విషయాలు..!? పురుషులు.. ఎక్కువగా కోపం తెప్పించే ఆ 10 విషయాలు..!?

మీకు తప్పనిసరిగా తెలియాల్సిన టాయిలెట్ శుభ్రపరిచే మేటి చిట్కాలు

బ్రష్

మీ టాయిలెట్ పైన చట్రానికి కావాల్సిన, సరిపోయే బ్రష్ ను ఎంచుకోండి. టాయిలెట్ ను శుభ్రపర్చేటప్పుడు ఈ మూతకింద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి మరియు కొంచెం మోచేతులకి గీసుకోకుండా నూనెలాంటిది రాసుకోండి.

గ్లోవ్స్ వాడటం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా శుభ్రపర్చటం కష్టంగా ఉంటే పాత టూత్ బ్రష్ ను వాడి పని పూర్తిచేయండి. మేటి టాయిలెట్ శుభ్రానికి మేటి టాయిలెట్ కిట్ ఎంతో అవసరం.

తెల్ల వెనిగర్

కొంచెం తెల్ల వెనిగర్ ను ఫ్లష్ ట్యాంక్ లో పోయటం వల్ల మీ టాయిలెట్ ప్రతి ఫ్లష్ కి మంచి వాసనతో ఉండటమే కాదు, కఠిన నీరు పేరుకునే వస్తువులను కూడా శుభ్రంగా ఉంచుతుంది.


వెనిగర్ మెరుగైన డిస్ ఇన్ఫెక్టంట్ మరియు మరకలు తొలగించే పదార్థం. 100% విషపదార్థం కానిది కాబట్టి మీరు శుభ్రానికి ఎక్కడైనా వాడవచ్చు. ప్రతిరోజూ వెనిగర్ ను ఫ్లష్ ట్యాంక్ లో పోయటం వలన మీ టాయిలెట్ లో వారం తిరిగేసరికి తక్కువ మరకలు మాత్రమే ఉంటాయి. వెనిగర్ కి కొంచెం సిట్రోనెల్లా లేదా యూకలిప్టస్ నూనెను జతచేస్తే ఫ్లష్ వాడిన ప్రతిసారీ సువాసన బాత్ రూం అంతా వ్యాప్తి చెందుతుంది.

టాయిలెట్స్ గురించి 7 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...!! టాయిలెట్స్ గురించి 7 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...!!

మీ టాయిలెట్ ను నిజంగా శుభ్రంగా ఉంచాలనుకుంటే, సరిగ్గా ఫ్లష్ చేయటం ముఖ్యం. సరిగ్గా ఫ్లష్ చేయటం ఒక్కటే కాదు, మొత్తం పోయేట్లా సరిగ్గా చేయటం ముఖ్యం- ఏదీ వెనక్కి తన్ని తిరిగి పైకి రాకుండా. మూతను మూసి ఫ్లష్ చేయండి.


మీకు తెలుసా ఫ్లష్ చేసిన ప్రతిసారీ టాయిలెట్లు కొన్ని చిన్నసైజులో మలపదార్థాలను వెదజల్లుతాయని? శాస్త్రవేత్తలు టూత్ బ్రష్ లపై ఈ చిన్న మల పదార్థాలను గుర్తించి అవి ఎక్కడ నుంచి వచ్చాయో చాలాకాలం వరకూ కనుగొనలేకపోయారు. ఆఖరికి అది టాయిలెట్ పనే అని, ఫ్లష్ అయిన ప్రతిసారీ అదే వెదజల్లుతుందని కనుగొన్నారు.

అందుకని, ఇక మీ టాయిలెట్ ను ఈరోజే శుభ్రపరచండి ! అది అత్యవసరం.

English summary

Perfect Toilet Cleaning Tips You Must Know

They're on the toilet brush, under the rim of the toilet, behind the toilet itself and even on the toilet seat. Such unimaginable filth in a supposedly clean toilet; you can only imagine what a dirty toilet would be like.
Desktop Bottom Promotion