For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటగదిలో మనీ సేవ్ చేయడానికి సాధారణ చిట్కాలు మీకోసం....

నెలాఖరుకు డబ్బులు మిగిల్చుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? కష్టపడి సంపాదించిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయలేం కదా?మీరు ఒక తెలివైన కస్టమర్ గా స్థానిక సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

By Madhavi Lagishetty
|

నెలాఖరుకు డబ్బులు మిగిల్చుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? కష్టపడి సంపాదించిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయలేం కదా?మీరు ఒక తెలివైన కస్టమర్ గా స్థానిక సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

డబ్బును పొదుపు చేయడం అనేది చాలా కష్టమైన పని. కానీ మీరు ఒక మంచి ప్రణాళికను రూపొందించుకుని...దాని ద్వారా ప్రతీ పైసాను ఖర్చు చేసినట్లయితే...పొదుపు చేయడం అనే చాలా సులభం అవుతుంది.

ఇంట్లో డబ్బులు ఎక్కడ దాచిపెడితే.. అత్యంత ధనవంతులవుతారు..!!ఇంట్లో డబ్బులు ఎక్కడ దాచిపెడితే.. అత్యంత ధనవంతులవుతారు..!!

సేవింగ్స్ అనేది లైఫ్ స్టైల్ గా మార్చుకుని అనుసరించండి. దీని ద్వారా మీరు మరింత మనీ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచో కాదు మీ కిచెన్ నుంచే ప్రారంభించండి. మనీ సేవ్ చేయడానికి కిచెన్ ఒక మంచి ప్రదేశం.

కిచెన్ గార్డెన్ ను ప్రారంభించండి...

కిచెన్ గార్డెన్ ను ప్రారంభించండి...

మీ కిచెన్ గార్డెన్ పెద్దగా..విశాలంగా ఉండాల్సిన అవసరం లుదు. మీ బాల్కనీలో రెండు కుండలు ఉంటే చాలు. వాటి నుంచి ఒక కుటుంబానికి సరిపడే కూరగాయాలను పండించుకోవచ్చు. టొమాటోలు, వెల్లుల్లి, గ్రీన్స్, బంగాళదుంపలు, పొట్లకాయల తీగలు పెంచండి. మొక్కల కోసం ప్రత్యేకంగా ట్రెల్స్ ను ఏర్పాటు చేయండి. దీంతో అవి బాగా పెరుగుతాయి. అంతేకాదు తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. స్క్రాప్స్ నుంచి మీ కిచెన్ ను గార్డెన్ గా రూపొందించుకుంటారు. మీకు కావాల్సిన కూరగాయాలు మీ కిచెన్ లో నుంచే తీసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పండి.

స్వంతగా డిజర్జెంట్ ను తయారు చేయండి...

స్వంతగా డిజర్జెంట్ ను తయారు చేయండి...

చాలా వరకు ఇంట్లో అకర్బన మరియు విషపూరితమైన క్లీనర్స్ వాడుతుంటారు. వారు ధరించిన వస్త్రాలు డిజర్టెంట్ తో ఉతకడం ద్వారా నురుగు డ్రైనేజీల గుండా సముద్రాల్లో కలుస్తుంది. వాటి ద్వారా జలచరాలు అన్నీ కలుషితం అయి అవి చనిపోగా...చివరికి ఆ డిటర్జంట్లతో కలుషితం అయిన సముద్రంలోని ఉప్పును తిరిగి మనం టేబుల్ సాల్ట్ గా వాడుతున్నాం.

దీనికి పరిష్కారం ఏమిటంటే తక్కువ ఖర్చుతో డిటర్జంట్లను మనమే తయారు చేసుకోవచ్చు. అలాగే విషపూరిత రసాయనాలు లేకుండా తయారు చేసుకునే వీలుంది.

టిష్యూస్ మరియు క్లాత్ వైప్స్...

టిష్యూస్ మరియు క్లాత్ వైప్స్...

మీ కిచెన్ ను క్లీన్ గా చేసేందుకు వెనెగార్ మరియు నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది. వెనెగార్, నిమ్మరసంలో ముంచిన వస్త్రాలతో వంటగది కౌంటర్లను శుభ్రపరిచేందుకు పనిచేస్తాయి. పేపర్ రోల్స్ కన్నా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అంతేకాదు పర్యావరణానికి ఎలాంటి హానిచేయవు. వాటిని డ్రై చేసి తిరిగిఉపయోగించుకోవచ్చు.

ప్రెషర్ కుక్కర్ ను ఉపయోగించండి...

ప్రెషర్ కుక్కర్ ను ఉపయోగించండి...

ప్రెషన్ కుక్కర్ ను ఉపయోగించడం ద్వారా గ్యాస్ ను చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. మైక్రోవేవ్ లేదా బేకింగ్ లేదా పాన్లో వంట చేయడం ద్వారా ఎక్కువ సమయం పడుతుంది. ప్రెషర్ కుక్కర్ లో వండినట్లయితే తొందరగా ఉడుకడంతోపాటు ఖర్చును కూడా తగ్గింస్తుంది. మీరు ప్రెషర్ కుక్కర్ ను వాడుతున్నట్లయితే..చాలా వరకు మనీ సేవ్ చేస్తున్నారని అర్థం.

రైతుల మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేయిండి....

రైతుల మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేయిండి....

కూరగాయాలు సూపర్ మార్కెట్లో కంటే రైతుల దగ్గర 50శాతం తక్కువ ధరకు లభిస్తాయి. రైతుల వద్ద కొనుగోలు చేసిన కూరగాయలు తాజాగా ఉంటాయి. కానీ చాలా దూరం ప్రయాణించి కొనుగోలు చేయాలనేది అసలైన సమస్య. కానీ దాన్ని అధిగమించినట్లయితే...రైతు మార్కెట్ అనేది ఒక మంచి ఆప్షన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే లక్కీ సిగ్నల్స్..!!అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే లక్కీ సిగ్నల్స్..!!

ఒక పెద్ద ఫ్రీజర్ ను కొనుగోలు చేయండి...

ఒక పెద్ద ఫ్రీజర్ ను కొనుగోలు చేయండి...

ఒక పెద్ద ఫ్రీజర్ లేదా రిఫ్రిజిరేటర్ ను కొనుగోలు చేయండి. ఇది మీరు తరుచుగా షాపింగ్ చేయాల్సిన పనిలేకుండా చేస్తుంది. రిఫ్రిజిరేటర్ వల్ల ఎక్కువ రోజులు సరుకులు నిల్వ ఉండేందుకు సహాయపడుతుంది. దీంతో ఎక్కువ వ్రుధా అనేది ఉండదు..మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు.

బల్క్ లో కొనండి....

బల్క్ లో కొనండి....

పెద్దమొత్తంలో సరుకులు కొనుగోలు చేస్తే...మీరు ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ పెందేందుకు ఆస్కారం ఉంటుంది. వీటిని ఆర్థిక పరమాణువులు అని పిలుస్తారు. మీరు 500ఎంఎల్ షాంపూని కొనుగోలు చేస్తు...175రూపాయలు అవుతుంది. 250ఎంఎల్ కొనుగోలు చేస్తే...90రూపాయలు అవుతుంది. అంతేకాదు. ధాన్యాలు, పప్పులు, నూనెలు, సుగంధ ద్రవ్యాలు వంటివి బల్క్ లో కొనుగోలు చేస్తే..తక్కువ ధరకు వస్తాయి.

జాడీలను సేవ్ చేయడం...

జాడీలను సేవ్ చేయడం...

గ్లాస్, మెటల్, ప్లాస్టిక్ జాడిని పునర్వినియోగపరచుట ద్వారా మీరు పర్వావరణంలోకి బయోడిగ్రేడబుల్ వ్యర్ధాన్ని తగ్గిస్తుంది.

గ్లాస్ మరియు మెటల్ సీసాలు చూడానికి చాలా అందంగా కనిపిస్తాయి. వాటిని శుభ్రపరచడం కూడా సులభంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండే మీరు ప్రారంభించండి.

స్క్రాప్స్ ను తిరిగి ఉపయోగించుట....

స్క్రాప్స్ ను తిరిగి ఉపయోగించుట....

కిచెన్ స్ర్ర్కాప్స్ క్రియేటివ్ గా రీసైకిల్ చేయబడతాయి. దీంతో ఏది ఎప్పుడూ వ్యర్ధంగా మారుతుందో...ఇంటర్ నెట్లో సమాచారం ఉంది. కూరగాయాల స్క్రాప్లు మీ కంపోస్ట్ పిట్ లోకి వెళ్లోచ్చు...లేదా కొత్త మొక్కలు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. అందుకే ఎక్కువ వండుకోవడం మానేయండి. మీకు కావాల్సినంత ఆహారాన్ని ఉడికించుకోండి.

తక్కువ తినడానికి....

తక్కువ తినడానికి....

స్వంతగా భోజనం తయారు చేసుకోవాలి. దీంతో ఎక్కువ సేవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బయట తినాల్సిన అవసరం ఉండదు. ఖర్చు తగ్గుతుంది...సమయం ఆదా అవుతుంది. రుచికరమైన వంటలు నేర్చుకుంటారు.

కలలో డబ్బులు కనబడితే అదృష్టమా..?దరదృష్టమా..?కలలో డబ్బులు కనబడితే అదృష్టమా..?దరదృష్టమా..?

ఆన్ లైన్ షాపింగ్...

ఆన్ లైన్ షాపింగ్...

ఆన్ లైన్ లో మీరు షాపింగ్ చేయాలనుకుంటే...సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. మీకు కావాల్సిన వస్తువులను ఇంట్లో నుంచే కొనుగోలు చేయవచ్చు. మీ బంధువులు, ఇరుగుపొరుగువారితో కలిసి కొనుగోలు చేస్తే...ఎలాంటి ఒత్తిడి ఉండదు.

అమ్మకానికి ప్రయోజనం...

అమ్మకానికి ప్రయోజనం...

స్థానికి సూపర్ మార్కెట్ కానీ లేదా మీకు ఇష్టమైన వెబ్ సైట్స్ లేదా మీ ఇంటి చుట్టు అద్భుతమైన డిస్కౌంట్లను కలిగి ఉన్న వాటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నిజంగా సమయానికి సంబంధించిన గొప్ప ప్రశ్న. ప్రాంఫ్ట్ మరియు అమ్మకం సమయంలో మీ అవసరానికి షాపింగ్ చేయండి.

జాబితాను తయారు చేయుట...

జాబితాను తయారు చేయుట...

షాపింగ్ సంబంధించిన జాబితాను ముందే తయారు చేసుకోవాలి. ఇది అలవాటుగా మార్చుకోవాలి. ఇది మీ పనిపై ద్రుష్టిని కేంద్రీకరిస్తుంది. మీకు కావాల్సిన సరుకులన్నీ ముందే జాబితా రూపంలో తయారు చేసుకున్నట్లయితే...స్టోర్ కు వెళ్లి ఈజీగా కొనుగోలు చేయవచ్చు. లేదంటే కొన్ని సరుకులను మరిచిపోయి మళ్లీ స్టోర్ కి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో సమయంతో పాటు డబ్బు కూడా వ్రుదా అవుతుంది.

కూపన్లను ఉపయోగించుట....

కూపన్లను ఉపయోగించుట....

కూపన్లు డబ్బు ఆదా చేసేందుకు ఒక గొప్ప మార్గం అని చెప్పొచ్చు. ఆలీవ్స్ కూజా కోసం 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కూపన్ ఉంటే పూర్తిగా ఉచితంగా వినియోగించుకోవచ్చు. కొంచెం తొందరపాటు అనేక సమస్యలకు దారి తీస్తుంది. ప్రతీ పైసా కష్టపడి సంపాదించారు కాబట్టి...ప్రతీ పైసా పొదుపు చేసుకోవడం ఉత్తమం.

English summary

Simple Tricks To Save Money In Your Kitchen

Did you know there are certain ways and tricks that will help you save money in your kitchen?
Story first published:Thursday, August 17, 2017, 12:08 [IST]
Desktop Bottom Promotion