Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఈ చిట్కాలతో గోడలు , సీలింగ్స్ పై కల మరకలను సులభంగా తొలగించొచ్చు...
గోడలు , సీలింగ్స్ పై కల మరకలను తొలగించే చిట్కాలు
గోడలపై పట్టిన తడిమరకలను పోగొట్టడానికి హానికారక రసాయనాలే దిక్కనుకోవక్కర్లేదు. సహజమైన,తక్కువ కెమికల్స్ ఉన్న ఉత్పత్తులతో కూడా వాటిని తొలగించవచ్చు.
మనలో చాలామంది ఇంట్లో అన్నిచోట్లా మెరుస్తూ, శుభ్రంగా,ఎటువంటి దుర్వాసనలు లేకుండా ఉండాలని ఆశిస్తాం. ఇలా ఉండటం ఒక మంచి సామరస్య భావం కలిగించటమే కాదు, అలర్జీలు, శ్వాస సమస్యలతో పోరాడటానికి కూడా సాయపడుతుంది.
కానీ, కొన్నిసార్లు ఇది కష్టమవుతుంది ఎందుకంటే గోడలు, పైకప్పు ప్రాంతాలు అధిక మొత్తాలలో బూజు లేదా నాచు వంటి వాటి పెరుగుదల వల తడిగా, తేమబారినట్లు అయిపోతాయి.
ఈ ఫంగస్ క్లాడోస్పోరియం,పెన్సిలియం లేదా ఆల్టర్నేరియా జాతులకి చెందినది. దురదృష్టవశాత్తూ అవి ఉండటం గాఢమైన మరకలుగా కన్పించి తీసేయడానికి చాలా కష్టమవుతుంది.

మొదట్లో కేవలం అందంగా కన్పించట్లేదు అనిపిస్తుంది కానీ సమయం గడిచేకొద్దీ ఆరోగ్యసమస్యగా కూడా మారుతుంది.
ఫలితంగా, హానికర కెమికల్స్ ఉపయోగించకుండా ఇక్కడ మేము ఈ సమస్య కోసం కొన్ని సహజ ఇంటిచిట్కాలను మీ ముందుకితెచ్చాం.
కింద, అవేంటో,ఎలా వాడాలో వివరంగా తెలుసుకుందాం. పదండి మరి!

ఉప్పు
ఈ బూజు,నాచు మరకలను తొలగించటానికి మీ వంటల్లో వాడే ఉప్పు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అది తేమను సులభంగా పీల్చుకుంటుంది మరియు ఆ సూక్ష్మజీవులు పెరగనీయకుండా రక్షణగా, అడ్డుగోడలా నిలుస్తుంది.
చాలా ఏళ్ళపాటు ఇళ్ళు శుభ్రపర్చేటప్పుడు దీన్ని వాడేవారు, ఇది క్రిములను తొలగిస్తుందనే కాదు, ఇలాంటి మొండి మరకలను వదిలించుకోవటంలో కూడా సాయపడుతుందని.
సూచనలు
ఒకటి లేదా రెండు పౌండ్ల ఉప్పును పెద్ద మూత ఉన్న గిన్నెలో తీసుకొని తడిబారిన చోట్లు ఉన్న గదుల మధ్యలో ఉంచండి.
ఇది గాలిలో తేమను పీల్చుకుని, ఫంగస్ తిరిగిరాకుండా చేస్తుంది.
రంగు గాఢంగా మారుతున్నప్పుడు ఉప్పును మార్చండి. రంగు మారటం ఇక అది తేమను పీల్చుకోలేదనటానికి సంకేతం.

ఆవపిండి
ఆవపిండిలో ఫంగస్ వ్యతిరేక, క్రిమిసంహారక లక్షణాలుండి ఫంగస్ మరకలు పట్టిన గోడలు, సీలింగ్స్ పై ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఉప్పులాగానే తడి గదుల్లో ఇది ఉంచటం వలన సమస్య పరిష్కారమవుతుంది.
సూచనలు
ఒక గిన్నెలో కొంచెం ఎక్కువగానే ఆవపిండిని పోసి నాచు ఉన్న ప్రాంతాలకి దగ్గర్లో పెట్టి వదిలేయండి. మంచి ఫలితాల కోసం వారానికోసారి మారుస్తుండండి.

తెల్ల వెనిగర్
తెల్లవెనిగర్ మరియు నిమ్మ పర్యావరణాన్ని శుభ్రపర్చే మేటి వస్తువులలో ఒకటిగా పేరున్న తెల్ల వెనిగర్, మరకలు, ఫంగస్ మరియు దుర్వాసనలను తొలగించే మేటి ఉత్పత్తి.
దానిలో ఉన్న ఫంగస్ వ్యతిరేక, బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు నేరుగా తేమను కలిగించే సూక్ష్మజీవులపై పోరాడి శుభ్రమైన, ఆరోగ్యకర వాతావరణాన్ని అందిస్తాయి.
సూచనలు
తెల్ల వెనిగర్, నీరును సమాన నిష్పత్తిలో కలిపి, స్ప్రే బాటిల్ లో పోసుకోండి.
ఇక గోడలు, సీలింగ్స్ పై స్ప్రే చేయండి. 20 నిమిషాలపాటు అలా వదిలేయండి.
20 నిమిషాల తర్వాత, స్పాంజి లేదా తడి గుడ్డతో మరకలను తుడిచేయండి.

టీ ట్రీ నూనె
ఇల్లు శుభ్రపర్చటానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోటానికి మంచి ఎంపికగా టీ ట్రీ నూనె ప్రపంచవ్యాప్తంగా పేరుపొందింది. దాని యొక్క యాంటీబయాటిక్ మరియు ఫంగస్ వ్యతిరేక లక్షణాలు తడి గోడలకి పేరుకున్న నాచు మరియు బూజును తొలగించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. సూచనలు ఒక లీటరు గోరువెచ్చని నీటికి ఒక చెంచాడు టీ ట్రీ నూనెను కలిపి ఒక సీసాలో పోసి బాగా గిలకొట్టండి. మీకు అవసరం అన్పించినంత స్ప్రే చేయండి. 15 నిమిషాలు అలా వదిలేసి బ్రష్ లేదా గుడ్డతో మరకలను తొలగించండి.

హైడ్రోజెన్ పెరాక్సైడ్
దీని ఉపయోగాలు ముఖ్యంగా చర్మంకి సంబంధించి ఉన్నా, హైడ్రోజెన్ పెరాక్సైడ్ గోడలకు పట్టిన చెత్తను వదిలించి, ఫంగస్ ను చంపేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
కొంతమంది నీళ్ళలో కరిగించి వాడటం మంచిదంటారు కానీ, నేరుగా ఉపయోగిస్తేనే తేమను త్వరగా తీసేయగలదు.
సూచనలు
కొంచెం హైడ్రోజెన్ పెరాక్సైడ్ (3%) ను స్ప్రే బాటిలో తీసుకుని, కావాల్సిన చోట్ల స్ప్రే చేయండి. 15 నిమిషాలు ఉండనిచ్చి, బ్రష్ లేదా స్పాంజితో మరకలు తీసేయండి.

వంటసోడా
వంటసోడాలోని బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు ఇంట్లో అనేక ఉపరితలాలను శుభ్రపర్చటానికి ఉపయోగపడుతుంది.తడి ప్రదేశాలలో దీన్ని వాడటం వలన తేమను పీల్చుకుని, ఫంగస్ పై నేరుగా పనిచేస్తుంది.
దీనిలో బ్లీచింగ్ లక్షణాలు మరియు దుర్వాసనను తొలగించే పదార్థాలు మొండిమరకలను, వాసనలను తొలగిస్తాయి.
సూచనలు
కొంచెం వంటసోడాను నీరు లేదా నిమ్మరసంతో తడిచేసి నాచు లేదా బూజు పట్టిన తడిచోట్ల పూయండి. 20 లేదా 30 నిమిషాల తర్వాత బ్రష్ తో కడిగేయండి.
మంచి ఫలితాల కోసం, ప్రతిరోజూ కిటికీలు, తలుపులు తీస్తూ ఉండండి ఎందుకంటే సరైన వెలుతురు, గాలి ఇంట్లో తిరుగుతూ ఉంటే తేమ చేరదు.



Click it and Unblock the Notifications











