For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటగదిని శుభ్రం చేసేందుకు కావలసిన పదార్థాలు !

|

శుభ్రం చెయ్యవలసిన విషయంలో, ఇంటిలో వున్న వంటగది చాలా చెత్తని కలిగి ఉండే ప్రదేశాలలో ఒకటి. ఈ వంటగది ఎల్లప్పుడూ ధూళిని, నూనెను, గ్రీజును, మరియు ఇతర మరకలను కలిగి ఉంటుంది. వంటగదిలో ఉన్న గోడలు ఆయిల్తో బాగా తడిసి, ఆహార పదార్థాలను వండేటప్పుడు ఏర్పడే మరకలు, వంటగదిలో ఉండే "ఎగ్జాస్ట్ ఫ్యాన్" ఆయిల్ వల్ల గ్రీజుకు గురవుతుంది, ఇలా ఇవన్నీ కలిపి వంటగదిని చాలా మురికిగా చేస్తుంది.

చూడటానికి అసహ్యంగా ఉన్న మీ వంటగదిని పరిశుభ్రం చేయడానికి రోజుల్లో గంట సమయాన్ని వెచ్చించాల్సి ఉంది.

మీరు రోజువారీగా వంటగదిని శుభ్రం చేయవలసిన అనేక విషయాలు చాలానే ఉన్నాయి. వంట పాత్రలు, వంట స్టవ్, మైక్రోవేవ్, సింక్, డస్ట్బిన్, వాటర్ ట్యాంక్, సీసాలు, స్లాబ్లు మొదలైనవి సాధారణంగా శుభ్రపరచవలసిన అవసరమైన కొన్ని ముఖ్యవిషయాలు. మీ వంటగదిని శుభ్రం చేసే చాలా రకాల ప్రోడక్ట్స్ను సులభంగా మార్కెట్లో పొందవచ్చు. ఏదేమైనప్పటికీ, ఏ ప్రోడక్ట్స్ కూడా 100 శాతం ఫలితాలు చూపించలేవు. అలా మీరు మీ వంట పాత్రలను స్క్రబ్తో శుభ్రం చేసేటప్పుడు మీ యొక్క శక్తిని కూడా కోల్పోవలసి వస్తుంది.

మరకలు మరియు, చెడు వాసనలు లేని విధంగా వంటగదిని ఉంచడానికి - మీరు మరి కొన్ని పరిశుభ్రత చిట్కాలను తప్పక అనుసరించాల్సి ఉంది. మీ వంటగదిని శుభ్రం చేయడానికి సరైన మార్గనిర్దేశం కావాలి అనుకున్నట్లయితే, ఈ క్రింది ఇచ్చిన చిట్కాలను పాటించండి. ఇంటిని శుభ్రపరిచే పదార్థాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి అవి మీ వంటగదిని శుభ్రం చెయ్యటానికి బాగా ఉపయోగపడతాయి. మీ వంటగదిని శుభ్రం చేయడానికి ఈ క్రింద సూచించబడిన పదార్థాలతో ప్రయత్నించి చూడండి.

వంటగదిని శుభ్రం చేసే పదార్ధాలు :-

1. తెల్లని వెనిగర్ :

1. తెల్లని వెనిగర్ :

వంట పాత్రలపై ఉన్న జట్టును మరియు మరకలను వదిలించుకోవడానికి తెల్లని వెనిగర్ను ఉపయోగించండి. అలాగే ఇది వంట పాత్రల అడుగున ఉండే గుడ్డు మరియు వెల్లుల్లి యొక్క మరకలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది.

2. నిమ్మరసం :

2. నిమ్మరసం :

వంటగది స్లాబ్ పై ఉన్న జిడ్డైన గ్రీజు మరకలను తొలగించడానికి, మీరు కొన్ని నిమ్మరసమును పిచికారీ (స్ప్రే) చేయవచ్చు. టీ పాత్రలను శుభ్రం చేయడానికి మరియు చెత్త బుట్టల నుండి వచ్చే చెడు వాసనను నిర్మూలించడానికి దీనిని ఉపయోగించవచ్చు.

3. బేకింగ్ (వంట) సోడా :

3. బేకింగ్ (వంట) సోడా :

వంటగది సింక్ నుండి వచ్చే దుర్వాసనను వదిలించుకోవడానికి, మీరు బేకింగ్ సోడాను వెదజల్లవచ్చు.

4. వేడి నీళ్లు :

4. వేడి నీళ్లు :

వంటగదిలో, అడ్డుపడిన గొట్టాన్ని శుభ్రం చేయడానికి వేడినీళ్లను పోయండి. మీరు బేకింగ్ పౌడర్ని కూడా సింక్లో జల్లి, రాత్రిపూట పూర్తిగా అలాగే వదిలేసిన తరువాత ఉదయాన్నే వేడి నీళ్లతో, వంటగది గొట్టాన్ని శుభ్రం చేయండి.

5. ఉప్పు :

5. ఉప్పు :

బాగా తడిసిన అల్యూమినియం పాత్రల నుండి తుప్పును వదిలించడానికి, ఉప్పు మరియు తెల్లని వినెగార్తో మీ పాత్రలను స్క్రబ్ తో శుభ్రం చేయండి.

6. కాటన్ బడ్ (దూది మొగ్గలు) :

6. కాటన్ బడ్ (దూది మొగ్గలు) :

వంటగదిలో ఉన్న స్టవ్ యొక్క సందులు మరియు మూలలను శుభ్రం చేయడానికి, మీరు తడి దూదిని ఉపయోగించవచ్చు.

7. గ్రేప్ ఫ్రూట్ :

7. గ్రేప్ ఫ్రూట్ :

వంటగదిలో ఉన్న అనేక విషయాలను శుభ్రం చేయడానికి సిట్రస్ పళ్లను ఉపయోగించవచ్చు. మీరు ద్రాక్షపండుతో జిడ్డుగల పాత్రలతో పాటు, నేలను కూడా శుభ్రపరచవచ్చు. ఇది పాత్రల నుండి గ్రీజును తొలగించడానికి ఒక డిష్ స్క్రబ్బర్గా ఉపయోగిస్తారు.

8. నిమ్మ నీరు :

8. నిమ్మ నీరు :

మైక్రోవేవ్ నుండి వెలువడే గాఢమైన వాసనలను తొలగించడానికి, నిమ్మరసాన్ని కలిపి 10 నిమిషాల పాటు వేడి చేసిన నీటిని ఉపయోగించవచ్చు. ఇది మైక్రోవేవ్ లోపల ఒక సిట్రస్ ఫలము యొక్క వాసనను వదిలి వేస్తుంది. మైక్రోవేవ్ను శుభ్రం చేయడానికి ఒక పేపర్ టవల్తో తుడవండి.

9. నిమ్మ తొక్కలు :

9. నిమ్మ తొక్కలు :

మీరు తేమ మరియు తడిగా ఉన్న వాసనను తొలగించడానికి క్యాబినెట్ లోపల పొడి నిమ్మ తొక్కలను కూడా ఉంచవచ్చు. కట్టింగ్ బోర్డ్ను శుభ్రపరచడానికి కూడా నిమ్మ తొక్కలను ఉపయోగించవచ్చు.

10. ఎగ్ షెల్స్ (గుడ్డు యొక్క పై పెంకులు) :

10. ఎగ్ షెల్స్ (గుడ్డు యొక్క పై పెంకులు) :

ప్రతీ వంటగదిలోని బొద్దింకలు అనేవి సాధారణంగా కనిపిస్తాయి. మీరు వాటిని వదిలించుకోవటం గుడ్డు యొక్క పెంకులను వంటగదిలో ఉంచవచ్చు. గుడ్డు యొక్క పెంకుల వాసన, బొద్దింకల దూరంగా ఉంచుతుంది.

11. వెట్ పేపర్ టవల్ :

11. వెట్ పేపర్ టవల్ :

మీ వంటగదిని శుభ్రం చేయడంలో అవసరమైన ముఖ్యమైన వస్తువు ఇది. వంటగది యొక్క స్లాబును మరియు స్టౌవ్వును శుభ్రపరచడానికి దీనిని ఉపయోగిస్తారు.

12. నెయిల్ పోలిష్ రిమూవర్ :

12. నెయిల్ పోలిష్ రిమూవర్ :

రొట్టెలను కాల్చే టోస్టర్ను శుభ్రపరచడానికి, నెయిల్ పోలిష్ రిమూవర్లో ముంచిన దూదిని ఉపయోగించండి. ఈ విధంగా దాన్ని సులభంగా శుభ్రపరచవచ్చు.

13. రబ్బింగ్ ఆల్కహాల్ :

13. రబ్బింగ్ ఆల్కహాల్ :

తడిగా ఉన్న పాత్రలకు శుభ్రం చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. దీనిని కూడా నీరు (లేదా) తెల్లని వినెగార్తో కలిపి ఉపయోగించడం ద్వారా, వంటగదిలో తడిసిన మరియు జిడ్డుగల కిటికీలను మరియు గోడలను శుభ్రం చేస్తుంది.

14. ఆపిల్ సైడర్ వినెగర్ :

14. ఆపిల్ సైడర్ వినెగర్ :

దీనిని నీటితో కలిపి ఉపయోగించడం వల్ల, రిఫ్రిజిరేటర్ను పరిశుభ్రంగా చేయడమే కాకుండా చెడు వాసనను కూడా నివారిస్తుంది. వంటగది యొక్క గోడలను మరియు కిటికీలను శుభ్రం చేయడానికి వెనిగర్లో బాగా నానబెట్టిన ఒక కాగితపు టవల్ను ఉపయోగించాలి.

15. హైడ్రోజన్ పెరాక్సైడ్ :

15. హైడ్రోజన్ పెరాక్సైడ్ :

హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించి వంటగదిలో ఉన్న చాలా సామాన్లను శుభ్రం చేయవచ్చు. హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఉడెన్ కట్టింగ్ బోర్డ్, డిష్ వాషింగ్ స్పాంజ్స్, స్క్రబ్స్ మొదలైన వాటిని కడిగినట్లయితే బ్యాక్టీరియా రహితమైనవిగా శుభ్రం చేయబడతాయి.

16. యూకలిప్టస్ ఆయిల్ :

16. యూకలిప్టస్ ఆయిల్ :

వంటగది ఫ్లోర్ మీద వున్న మచ్చలను నివారించడానికి, ఆ మచ్చలపై ఈ ఆయిల్ను వెదజల్లే మరొక సహజసిద్ధమైన క్లీనర్ అని చెప్పవచ్చును.

17. వోడ్కా :

17. వోడ్కా :

మీరు కిచెన్ ఫ్లోరింగ్ పై టైల్స్ గాని ఉంటే, మీరు దానిని శుభ్రం చేయడానికి వోడ్కాను ఉపయోగించవచ్చు మరియు ఫ్లోర్ను తెల్లగా కూడా చేసుకోవచ్చు.

18. చింతపండు :

18. చింతపండు :

వెండి పింగాణి పాత్రలు, తేమకు గురైనట్లయితే నల్లగా మారుతాయి. పాతయిన, నల్లని వెండి వస్తువులను - చింతపండును ఉప్పుతో కలిపి బాగా శుభ్రం చేయవచ్చు. తుప్పు పట్టిన రాగి కుళాయిలను, వంటగది సింక్ను మరియు చిమ్నీలను చింతపండుతో శుభ్రం చేయవచ్చు.

19. బంగాళాదుంప :

19. బంగాళాదుంప :

గాజు వస్తువులను శుభ్రం చేయడానికి, మీరు పచ్చి బంగాళదుంప ముక్కలను ఉపయోగించవచ్చు. ఇది ఉల్లిపాయ, వెల్లుల్లి, గుడ్డు, పాలు మరియు ఆల్కహాల్ యొక్క గాఢమైన వాసనను తొలగిస్తుంది.

20. పీనట్ బటర్ :

20. పీనట్ బటర్ :

ప్లేట్లు లేదా బౌల్స్ వంటి కొత్త సామానులు నుండి బాగా అతుక్కుపోయిన లేబుల్స్ను తొలగించాలనుకుంటున్నారా? కొత్త సామాన్లను పీనట్ బటర్ యొక్క సాయంతో స్క్రబ్ చేసి శుభ్రం చేయండి.

English summary

Cleaning Kitchen | Ingredients Cleaning Kitchen | Clean Stained Utensils

To maintain a stainless and odour-free kitchen, you need to follow some smart cleaning tricks. If you want a proper guide to clean your kitchen, then you can use the tips given below. Here are the few homemade cleaning ingredients that can be used in cleaning the kitchen effectively. Try these easily available ingredients for cleaning your kitchen.
Desktop Bottom Promotion