For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్లాస్టిక్ పాత్ర‌ల‌ను శుభ్రం చేసేందుకు 8 చిట్కాలు

By Sujeeth Kumar
|

ప్లాస్టిక్ పాత్ర‌ల‌ను క‌డ‌గ‌డం కాస్త క‌ష్ట‌మే. స్టీల్‌, గాజు పాత్ర‌ల‌తో పోలిస్తే ప్లాస్టిక్ పాత్ర‌ల‌కు జిడ్డు, వాస‌న‌, మ‌ర‌కలు త్వ‌ర‌గా పోవు. ప్లాస్టిక్ పాత్ర‌ల నిర్వ‌హ‌ణ కాస్తంత స‌వాలుతో కూడుకున్న‌దే అని చెప్పొచ్చు.

బోల్డ్ స్కై మీకు ఇవాళ ప్లాస్టిక్ నిల్వ పాత్ర‌ల‌ను శుభ్రంగా క‌డిగే టెక్నిక్స్‌ను నేర్పించ‌బోతుంది. ఈ టిప్స్‌తో మీ ప్లాస్టిక్ పాత్ర‌లు మెర‌వాల్సిందే. ఈ టిప్స్‌ను మూడు ర‌కాలుగా వర్గీక‌రించాం. వాస‌న‌, జిడ్డు, మ‌ర‌క‌లు అనే మూడు ప్ర‌ధాన అంశాలు తీసుకున్నాం.

Simple Tricks To Clean Plastic Storage Containers

పాత్ర‌ల క్లీనింగ్‌కు వెళ్లేముందు ప్లాస్టిక్ వాటి నాణ్య‌త గురించి తెలుసుకోవ‌డం ముఖ్యం. రోజువారీ అవ‌స‌రాల‌కు మందంగా ఉండే పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకోవ‌డం మంచిది. మ‌రోవైపు ప‌ల్చ‌గా ఉన్న ప్లాస్టిక్ పాత్ర‌ల వ‌ల్ల ఆహారం చెడిపోయే ప్ర‌మాదం ఉంది.


వాస‌న పోయేందుకు....

నిమ్మః

నిమ్మ‌లో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది న్యాచుర‌ల్ డిస్ ఇన్ఫెక్టెంట్ లాగ ప‌నిచేస్తుంది. నిమ్మ‌లో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉంటాయి. అవి దుర్వాస‌ను సులువుగా వ‌దిలించ‌గ‌ల‌వు. ఒక నిమ్మకాయ తీసుకొని స‌గానికి కోసి ప్లాస్టిక్ పాత్ర‌ల లోప‌లి భాగాల‌ను శుభ్రం చేయ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత బేకింగ్ సోడాతో రుద్ది నీటితో క‌డిగి ఆర‌బెడితే చాలు.

Simple Tricks To Clean Plastic Storage Containers

ప‌త్రిక‌లు

ఇది విన‌డానికి విడ్డూరంగా ఉంటుంది కానీ మీ అభిమాన దిన‌ప‌త్రిక‌ల‌తో ప్లాస్టిక్ పాత్ర‌ల‌ను శుభ్రం చేసుకోవ‌చ్చు. దుర్వాస వ‌చ్చే పాత్ర‌ల‌లో న్యూస్‌పేప‌ర్లు చుట్ట‌లా చేసి మూత‌పెట్టేయాలి. రాత్రంతా ఉంచి పొద్దునే తీసేసి స‌బ్బు నీళ్ల‌తో క‌డిగేస్తే వాస‌న మ‌టుమాయం. రాత్రే ఉంచాల‌ని కాదు ప‌గ‌లు కూడా న్యూస్‌పేప‌ర్ల చుట్ట ఉంచొచ్చు.

వెనిగ‌ర్‌

రెండు వంతుల వెనిగ‌ర్ లో 1 వంతు నీళ్లు క‌ల‌పాలి. ఈ ద్రావ‌ణాన్ని ప్లాస్టిక్ డ‌బ్బాలో వేసి రాత్రి ఉంచాలి. ఉద‌యాన్నే నీటితో శుభ్రంగా క‌డిగేయాలి.

Simple Tricks To Clean Plastic Storage Containers

జిడ్డు పోగొట్టేందుకు...

బేకింగ్ సోడాః

బేకింగ్ సోడాను నీటిలో వేసి పేస్టులా చేసుకోండి. మెత్త‌ని బ‌ట్ట‌తో ప్లాస్టిక్ బాక్సులోప‌ల తుడ‌వండి. ఆ త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేయండి. బేకింగ్ సోడా ప్లాస్టిక్ నుంచి జిడ్డును తొల‌గించ‌గ‌ల‌దు.


డిట‌ర్జెంట్ స‌బ్బుః

ఇది సాధార‌ణంగా చేసే విధానం. దీంట్లో భాగంగా గోరువెచ్చ‌ని డిట‌ర్జెంట్ నీటిని 10 నుంచి 15 నిమిషాల పాటు ప్లాస్టిక్ కంటెయిన‌ర్లో ఉంచాలి. ఆ త‌ర్వాత దాన్ని డిష్ వాష్‌తో క‌డిగేసి ఎండ‌లో ఆర‌బెట్టాలి. ఏదైనా జిడ్డు ఉంటే సుల‌భంగా వ‌దిలిపోతుంది.

Simple Tricks To Clean Plastic Storage Containers

మ‌ర‌క‌లు పోగొట్టేందుకు.....

క్లోరిన్ బ్లీచ్‌

క్లోరిన్ బ్లీచ్‌, నీళ్ల ద్రావ‌ణం తయారుచేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ క్లోరిన్ బ్లీచ్‌కు ఒక క‌ప్పు నీళ్లు స‌రిపోతాయి. ఈ మిశ్ర‌మాన్ని ప్లాస్టిక్ పాత్ర‌లో అర‌గంట పాటు ఉంచాలి. ఆ త‌ర్వాత స‌బ్బు నీళ్ల‌తో క‌డిగేస్తే స‌రి.

సూర్య ర‌శ్మి

ఏదైనా వ‌స్తువును ఎండ‌లో ఎక్కువ సేపు ఉంచితే రంగు పోతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అదే విధంగా ప్లాస్టిక్ పాత్ర‌ల‌పై ఏవైనా మ‌ర‌క‌లుంటే సుల‌భంగా వ‌దిలించుకోవ‌చ్చు. 3 లేదా 4 గంట‌లు ఎండ‌లో వ‌దిలేస్తే మ‌ర‌క‌లు పోతాయి. ఆ త‌ర్వాత నీటితో శుభ్రంగా క‌డిగేయాలి.

వంట స్ప్రే

ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారాన్ని ఉంచేముందు కాస్తంత నూనె స్ప్రే చేయ‌డం మంచిది. ఇది ఆహారానికి, ప్లాస్టిక్ కు మ‌ధ్య వార‌ధిలా ఉంటుంది.

English summary

Cleaning Plastic Storage Containers | Tips To Clean Plastic Boxes | How To Remove Smell From Plastic Containers

Cleaning plastic storage containers is a difficult task. So here are few tips to clean and remove smell from plastic boxes. So remove oil, & food stains fr
Story first published:Wednesday, February 7, 2018, 17:25 [IST]
Desktop Bottom Promotion