For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

24/7 మీ వంటగది పరిశుభ్రంగా ఉండాలంటే మీరు పాటించవలసిన ఐదు జాగ్రత్తలు

24/7 మీ వంటగది పరిశుభ్రంగా ఉంచడానికి చిట్కాలు,వంటగది పరిశుభ్రంగా ఉంటే మనకు ఆనందంగా అనిపిస్తుంది. మన వంటగది శుభ్రంగా ఉంటె, మన ఇంటిని పురుగు-పుట్ర, రోగం-రొష్టు నుండి దూరంగా ఉంచవచ్చు. అయితేమన వంటగదిని శు

|

వంటగది పరిశుభ్రంగా ఉంటే మనకు ఆనందంగా అనిపిస్తుంది. మన వంటగది శుభ్రంగా ఉంటె, మన ఇంటిని పురుగు-పుట్ర, రోగం-రొష్టు నుండి దూరంగా ఉంచవచ్చు. అయితేమన వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలంటే కొన్ని సూచనలు తప్పక పాటించాలి. ప్రతిదినం వాటిని అనుసరించాలి.

వంట పూర్తి చేసిన అనంతరం గదిని శుభ్రం చేయటం తప్పనిసరి.కూరగాయల తొక్కు, చెత్త, చెదారం అంతటిని కుప్పగా పేరుకోకముందే పారేయాలి.

five things you should keep clean in your kitchen everyday

వంటగట్టు, స్టవ్, మైక్రోవేవ్ వంటి వాటిని మనం ప్రతిరోజూ ఉపయోగించే సహజమైన పదార్దాలైన నిమ్మరసం మరియు తినేసోడాలతో శుభ్రపరచడం ఉత్తమం. ఇవి చవకైన పదార్ధాలు కనుక అందరికి అందుబాటులో ఉంటాయి. అంతేకాక ఎక్కడైనా దొరుకుతాయి.

ఇంక దేని కోసం ఎదురుచూస్తున్నారు? 24/ 7 మీ వంటింటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఉత్తమమైన మార్గాలేమిటో తెలుసుకుందాం, రండి!

వంటగట్టుని శుభ్రం చేయడం:

వంటగట్టుని శుభ్రం చేయడం:

మీ వంటపని అంటా అయిపోయాక, వంట గట్టుని శుభ్రంగా ఊడ్చండి. దీనికి మెత్తని గుడ్డను, ఇంట్లోనే దొరికే నిమ్మరసం వంటివి ఉపయోగించండి. ఇలా చేస్తే మరకలు మరియు దుర్గంధం దూరమవుతాయి.

గ్యాస్ స్టవ్ శుభ్రపరచడం:

గ్యాస్ స్టవ్ శుభ్రపరచడం:

గ్యాస్ స్తు ను ప్రతిదినం శుభ్రం చేయాలి. వంట చేసేటప్పుడు ఆహార పదార్ధాలు తుళ్లడం, పొంగడం లేదా చిమ్మడం జరుగుతుంది కనుక , అటువంటి వాటిని శుభ్రంగా తుడిచివేయాలి. ఇలా చేయటం వలన మీ స్టవ్ మీద ఎంగిలి మరకలు పడి అసహ్యంగా కనపడవు.

మైక్రోవేవ్ ను శుభ్రపరచడం:

మైక్రోవేవ్ ను శుభ్రపరచడం:

మైక్రోవేవ్ ను వాడటం అయిన వెంటనే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మైక్రోవేవ్ ను ఆహార పదార్ధాల వాసనలు అంటిపెట్టుకుని ఉండవు. నూనె వగైరా తుళ్లినప్పటికి జిడ్డు పట్టకుండా శుభ్రమవుతుంది. మైక్రోవేవ్ ను శుభ్రపరచడానికి మెత్తని గుడ్డ మరియు తినే సోడాను ఉపయోగించాలి.

సింకును శుభ్రపరచడం:

సింకును శుభ్రపరచడం:

గిన్నెలను తోమిన వెంటనే సింకులో కాస్త గడ్డ ఉప్పును చల్లండి. ఉప్పు పై నల్లని వెనిగర్ను పోసి, ఒక బ్రష్ తో మృదువుగా రుద్దండి. వెనిగర్ వాసనను పోగొడుతుంది. ఉప్పు మరకలను తొలగిస్తుంది.

వంట సామాన్లను శుభ్రపరచడం:

వంట సామాన్లను శుభ్రపరచడం:

గిన్నెలను సింకులో రాత్రంతా ఉంచకండి. ఇలా వదిలేస్తే గిన్నెలు పాడవుతాయి. వాడటం అయిపోయిన వెంటనే గిన్నెలను తోమి కడిగేయాలి.

English summary

5 Things You Should Keep Clean In Your Kitchen 24/7

Ladies, if your newly married, living in a new home can be a task. Here are 5 Things You Should Keep Clean In Your Kitchen 24/7. Take a look.
Story first published:Saturday, May 5, 2018, 17:40 [IST]
Desktop Bottom Promotion