Just In
- 18 min ago
శరీరంలో ఎలాంటి నొప్పినైనా తగ్గించే సహజ నొప్పి నివారణలు
- 6 hrs ago
సోమవారం మీ రాశిఫలాలు (9-12-2019)
- 22 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు
- 1 day ago
ఆదివారం మీ రాశిఫలాలు (8-12-2019)
Don't Miss
- News
Miss Universe 2019:జాతి వివక్షపై పోరాడిన యువతి జోజిబినీ తున్జీదే విశ్వసుందరి టైటిల్
- Finance
విజయవాడవాసులకు శుభవార్త, ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్
- Movies
'వెంకీమామ'లో ఆ 40 నిమిషాలు.. హైలైట్ సన్నివేశాలివే!
- Technology
జియోను అదిగమించిన వోడాఫోన్,ఎయిర్టెల్
- Sports
వరుసగా రెండోసారి: ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ టైటిల్ గెలిచిన బ్రిస్బేన్ హీట్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
వంటగదిలో సింకును శుభ్రపరుచుకునేందుకు సరళమైన మరియు సులువైన మార్గాలు
ఒక్కప్పుడు ప్రముఖ నగరాల్లో విరసిల్లిన బంగ్లాలు, ఇండ్ల స్థానాన్ని ఇప్పుడు ఫ్లాట్లు మరియు అపార్ట్మెంట్లు ఆక్రమించుకున్నాయి. స్థలాభావానికి ఇది మంచి పరిష్కరమైనప్పటికిని, ఈ ఇండ్లలోని వ్యర్ధాలను బయటకు తీసుకువెళ్లడానికి సింకులు మాత్రమే ఏకైక మార్గం.
వాటిని కనుక పరిశుభ్రంగా ఉంచుకొనకపోతే,ఇల్లు మురికి మరియు బాక్టీరియాకు ఆలవాలంగా మారి క్రిమి-కీటకాలకు ఆహ్వానం పలుకుతాయి. ఈ పిడుగులు మీ ఇంటిని కలుషితం చేసి, మీ కుటుంబ సభ్యులను, ముఖ్యంగా పిల్లలను వివిధ రకాల వ్యాధులకు గురిచేస్తాయి.
అనారోగ్య కారణాలు మాత్రమే కాక, అపరిశుభ్రంగా ఉండే సింక్ వలన వంటగది యొక్క రూపురేఖలను చూడటానికి అసహ్యంగా మారుస్తుంది. ఇటువంటి పరిస్థితులున్నట్లైతే, మీరు మీ వంటగదిని మాడ్యులర్ కిచెన్ గా మార్చడానికి పెట్టిన ఖర్చంతా చూసేవారికి వృధాగా మాత్రమే కాక, జుగుప్సకరంగా కూడా అనిపిస్తుంది.
మీరు కలలుకన్న కిచెన్ లో అన్ని సదుపాయాలను సమకూర్చుకోవడానికి ఎంతో ఖర్చు చేసి ఉంటారు. అటువంటి వంటగదిలో సూక్ష్మజీవులు మరియు అంటువ్యాధులు అడుగుపెట్టకుండా మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలంటే సింకును శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వ్యాసం ద్వారా మీకు సింకును శుభ్రంగా ఉంచుకునే పద్ధతులు వివారిస్తున్నాము.
1. ప్రాథమికంగా శుభ్రపరిచే పద్ధతి: ముందుగా సింకులో ఉండే అన్ని రకాల ఎంగిలి గిన్నెలను బయటపెట్టండి. దాని చుట్టుపక్కల ఒక్క స్పూన్ కూడా విడిచిపెట్టకండి. మీరు ఆ సింకును తరచుగా వాడేటట్లైతే, చిన్న చిన్న ఆహారం మెతుకులు కనిపిస్తాయి. వాటిని కూడా నీటితో శుభ్రపరచండి. ఇంకా కొన్ని మెతుకులు మిగిలి ఉన్నట్లైతే, గ్లోవ్స్ ధరించి, సింకులో మరియు చుట్టుపక్కల కూడా చేతులతో జాగ్రత్తగా తొలగించండి. ఈ పదార్థంతో తయారైన సింకు అయినప్పటికీ ప్రాధమికంగా ఈ పద్ధతిలో శుభ్రపరచండి.
2. స్టెయిన్ లెస్ స్టీల్ సింకుకై వంట సోడా: ఈ రోజుల్లో చాలావరకు ఇళ్లలో స్టీల్ సింకులు ఉంటున్నాయి. ఈ సింకుల వలన లాభమేమిటంటే, ఇవి త్వరగా గీతలు పడవు, పైగా శుభ్రపరచడం తేలిక. వీటిని శుభ్రపరిచేందుకు వంట సోడాను సింకులో వెదజల్లి ఐదు నిమిషాలు ఆగి, మెత్తని స్పాంజ్ తో రుద్దాలి. రుద్దేటప్పుడు వలయాకారంలో రుద్దాలి. వంటసోడా అద్భుతంగా శుభ్రపరచడమే కాక మరకలు, గీతలను కూడా పోగొడుతుంది. ఇలా చేసేటప్పుడు గ్లోవ్స్ ధరించడం శ్రేయస్కరం.
3. మొండి మరకలకు వెనిగర్: మీరు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినప్పటికి, మీ సింకుపై మరకలు ఎదో ఒక సందర్భంలో ఏర్పడతాయి. తెల్లని సిరామిక్ సింకులైతే ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. ఈ మరకలు కాఫీ, టీ లేదా ఇతర ఆహారపదార్ధాలు వొలికి పోవడం వలన పడి ఉండవచ్చు లేదా ఉప్పునీరు వినియోగం వలన కూడా కావచ్చు. మీరు నివసించే ప్రదేశంలో లభించే నీటిలో ఆర్సెనిక్ ఉన్నట్లైనా మరకలు పడతాయి. అయితే ఇటువంటి మరకలనన్నింటిని వెనిగర్ ను ఉపయోగించి తొలగించవచ్చు. సింకును వెనిగర్ తో తోమాలి. ఇది క్రిమిసంహారకంగా కూడా పనిచేయడం వలన మరకలతో పాటు సూక్ష్మజీవులు కూడా నశిస్తాయి. మెత్తని స్పాంజ్ తో రుద్ది, తరువాత నీటితో కడగాలి. అప్పుడు మీ సింక్ మెరుస్తుంది.
4. సింకులోని దుర్వాసన పోగొట్టడానికి: ఆయా కాలాలలో పండ్ల లభ్యతను బట్టి, ఒక చిన్న నిమ్మకాయ చెక్క లేదా నారింజ తొన తీసుకుని, సింకును మొత్తం గట్టిగా రుద్దండి. ఇది అన్ని పరిమాణాలు మరియు ఆకారాలు ఉన్న ( ఏ పదార్థంతో తయారైనది అయినను) సింకులను శుభ్రం చేయడానికి పనికి వస్తుంది. ఇలా నిమ్మ లేదా నరింజతో రుద్దడం వలన సింకుకు మెరుపు తిరిగి వస్తుంది. అంతేకాక, సిట్రస్ పండ్లలో ఉండే సుగుణాలు సింకుకు సువాసననిస్తాయి.