For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బట్టలపై ఏర్పడిన మొండి మరకలను తొలగించడం ఎలా ?

బట్టలపై ఏర్పడిన మొండి మరకలను తొలగించడం ఎలా ?

|

మీ బట్టలు మురికిగా తయారవ్వడానికి రకరకాల పదార్ధాలు అనగా ఫుడ్డు, డ్రింక్స్, ఇంక్, లిప్ స్టిక్, ఆయిల్ వంటివి కారణం కావచ్చు. ఒక్కొక్క రకమైన మరకకు - ఒక్కొక్క పరిష్కార మార్గాన్ని కలిగి ఉంటుంది. అలాగే మీ బట్టలు ఏ రకమైన మెటీరియల్ను కలిగి ఉన్నదో దానిబట్టి మీరు ఎలా శుభ్రం చేస్తారనేదానిపై ప్రభావాన్ని చూపుతుంది.

కాబట్టి, మీరు మీకు ఇష్టమైన బట్టలపై మరకలు ఏర్పడినప్పుడు మీరేమి చేస్తారు ? మీ బట్టలపై ఏర్పడిన వివిధ రకాల మరకలను తొలగించడానికి కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

How to remove stains from clothes: a handy stain removal guide
వేర్వేరు బట్టలు మీద ఉన్న మరకలను ఎలా అరికట్టాలి ?

వేర్వేరు బట్టలు మీద ఉన్న మరకలను ఎలా అరికట్టాలి ?

మీరు బట్టలపై ఏర్పడిన మరకలను అరికట్టడానికి ప్రయత్నం చేసేటప్పుడు, మీరు బట్టలు ఎలాంటి మెటీరియల్ను కలిగి ఉన్నాయో కొంచెం ఆలోచించండి (అది కాటన్, సింథటిక్, ఉన్ని (లేదా) పట్టుకి సంబంధించినదా అని). ఇది మీ బట్టలపై ఏర్పడిన మరకలను ఎలా తొలగించాలో అన్న దానిపై ప్రభావమును చూపుతుంది. ఇలా ఏదైనా మీరు ట్రై చేయటానికి ముందు, మీ బట్టలపై ఉన్న లేబుల్ సూచించే సూచనలను, మార్గదర్శకాలను మీరు తప్పక అనుసరించండి.

కాటన్ బట్టలపై మరకలను తొలగించడం ఎలా ?

కాటన్ బట్టలపై మరకలను తొలగించడం ఎలా ?

కాటన్ అనేది చాలా మన్నికైన ఫాబ్రిక్, కాబట్టి మీరు ఈ ఫాబ్రిక్ను ఎలాంటి నష్టం వాటిల్లకుండానే మరకలను తొలగించడానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగించవచ్చు.

సింథటిక్ బట్టలపై మరకలను తొలగించడం ఎలా ?

సింథటిక్ బట్టలపై మరకలను తొలగించడం ఎలా ?

మనము ధరించే వాటిలో అనేక రకాలైన సింథటిక్ వస్త్రాలు ఉన్నాయి, అవి సాధారణమైన మన్నికగలవి, కాబట్టి మీరు మరకలను తొలగించే పని చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

తరచుగా సింథటిక్ ఫాబ్రిక్స్ను శుభ్రం చేయడానికి, ఎంజైములు కలిగి ఉన్న సాధారణ డిటర్జెంట్లకు బాగా స్పందిస్తాయి, కానీ బ్లీచ్ వంటి కఠినమైన రసాయనాలను ఉపయోగించడం మంచి ఆలోచన కాదు.

సింథటిక్ బట్టలపై ఉన్న మరకలను తొలగించడం కోసం మీరు ఉపయోగించే స్టెయిన్ రిమూవర్లు సురక్షితంగా ఉన్నాయా / లేవా అని ముందుగా తనిఖీ చేసుకోండి.

ఉన్ని బట్టలపై మరకలను తొలగించడం ఎలా ?

ఉన్ని బట్టలపై మరకలను తొలగించడం ఎలా ?

మార్కెట్లో లభించే అనేక వాణిజ్యపరమైన స్టెయిన్ రిమూవర్లు, ఉన్ని ఫైబర్లను నష్టపరుస్తాయి, కనుక లేబుల్పై ఉన్న సూచనలను తప్పకుండా చదవండి.

పెర్సిల్ సిల్క్ & ఉన్ని వంటి మెటీరియల్ కొరకు రూపొందించిన నిర్దిష్టమైన డిటర్జెంట్లను ఉపయోగించండి, ఆపై మీ బట్టలను పొడిగా మార్చడం వల్ల సరైన ఆకారంను తిరిగి పొందగలదు.

అవసరమైతే, స్పెషల్ గార్మెంట్ స్టెయిన్ చికిత్స కోసం ఒక ప్రొఫెషనల్ డిటర్జెంట్ను తీసుకోండి.

సిల్క్ బట్టల నుండి మరకలను తొలగించడం ఎలా ?

సిల్క్ బట్టల నుండి మరకలను తొలగించడం ఎలా ?

మీరు ఒక చిన్న మరకలను నివారించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, సిల్క్ మీద సరైన డిటర్జెంట్ను ఉపయోగించడం ముఖ్యం, ఆ మరకలను తొలగించడానికి మొత్తం వస్త్రాన్ని నానబెట్టాలి.

సిల్క్ నమ్మశక్యం కానంత సున్నితమైనది, కాబట్టి కఠినమైన మరకలను తొలగించడానికి డ్రై క్లీనర్ల సహాయం తీసుకోండి.

సాధారణ మరకలను తొలగించడానికి పాటించవలసిన హోం రెమిడీస్ !

సాధారణ మరకలను తొలగించడానికి పాటించవలసిన హోం రెమిడీస్ !

అన్ని రకాల మరకలను తొలగించబడెలా ఉన్న స్టెయిన్ రిమూవర్స్ కోసం మనమంతా పరుగులు తీస్తాము. కానీ మీ ఇంట్లో ఉన్న కొన్ని పదార్ధాలు ఈ మరకలను తొలగించటానికి కూడా సహాయపడతాయి. ఇలాంటి పద్ధతుల్లో మీరు పాటించేటప్పుడు మీ బట్టల పై ఉన్న రంగులు అస్పష్టంగా గాని, పూర్తిగా గాని తొలగిపోవని మీరు ముందుగా నిర్ధారించుకోండి. అందుకోసం మీరు ఒక గార్మెంట్స్ నిపుణుడి సలహాను తీసుకోవచ్చు.

పాలతో చాక్లెట్ మరకలను తొలగించడం :-

పాలతో చాక్లెట్ మరకలను తొలగించడం :-

మొదటగా, ఆ బట్టలను ఫ్రీజర్లో ఉంచడం ద్వారా ఆ మరకలను గట్టిపడేలా చేయవచ్చు, ఆ తరువాత ఆ చాక్లెట్ను స్క్రాప్ చేయడం ద్వారా ఏ చాక్లెట్ మరకలను తొలగించవచ్చు.

ఆ తరువాత, చాక్లెట్ మరకలు ఉన్న బట్ట వెనుక భాగంలో వేడి నీటిని పోయడం వల్ల, ఆ మరకలను కరిగిస్తుంది.

ఆ మరకలను డిటర్జంట్ను కడిగిన తర్వాత, ఆ బట్టలను 30 నిమిషాల నుంచి ఒక గంట వరకు పాలులో నానబెట్టండి.

టమాటా మరకలు ఈ విధంగా తొలగించండి :-

టమాటా మరకలు ఈ విధంగా తొలగించండి :-

మీ బట్టలను సాధారణంగా వాష్ను చేయండి, అవసరమైతే మళ్ళీ మళ్ళీ వాష్ను చేయండి.

వినెగార్తో టమోటా మరకలను తొలగించండి

తెల్లని వినెగర్ (1 - 2 టేబుల్ స్పూన్) లో 30 నిమిషాల పాటు మీ బట్టలను నానబెట్టండి.

ఆపై మీ బట్టలను వాషింగ్ మిషన్లో ఉతికేముందు డిటర్జెంట్తో నేరుగా మరకలను వాష్ చేయండి.

అవసరమైతే మళ్లీ మళ్లీ మీ బట్టలను వాష్ చేయండి.

హేస్ప్రేని ఉపయోగించి ఇంక్ మరకలను తొలగించండి :-

హేస్ప్రేని ఉపయోగించి ఇంక్ మరకలను తొలగించండి :-

ఇంక్ మరకలను తొలగించడానికి ఇది చాలా గమ్మత్తైనదిగా ఉంటుంది. మిథైల్ ఆమ్లం (లేదా) హేర్ప్రెస్ వంటి ఒక ఆల్కహాల్-ఆధారిత ఉత్పత్తులలో మీ బట్టలను నానబెట్టండి, ఇది చాలా అద్భుతమైన పరిష్కార మార్గంగా ఉంటుంది.

మీ బట్టలు పై ఉన్న మరకలు పూర్తిగా తొలగిపోయే వరకు మీ బట్టలను డిటర్జెంట్ నీటిలో నానబెట్టండి. ఒకవేళ మీ బట్టలు రంగును కోల్పోయేటట్లయితే సాధారణంగానే వాష్ చేయండి.

లిక్విడ్ డిష్వాషింగ్తో ఆయిల్ మరకలను తొలగించండి :-

లిక్విడ్ డిష్వాషింగ్తో ఆయిల్ మరకలను తొలగించండి :-

నూనె వంటి అనేక జిడ్డైన మరకలను డిష్వాషింగ్ లిక్విడ్తో (లేదా) వాషింగ్ డిటర్జెంట్లను నేరుగా మీ బట్టలపై అప్లై చేయడం వల్ల మీరు లాభం పొందవచ్చు.

అవసరాన్నిబట్టి వాషింగ్ మిషన్లో మళ్ళీ మళ్ళీ మీ బట్టలను వాష్ చేయండి.

ఉప్పుతో రక్తపు మరకలను తొలగించండి :-

ఉప్పుతో రక్తపు మరకలను తొలగించండి :-

మీ బట్టల పై ఏర్పడిన రక్తపు మరకలను ఈ పద్ధతిలో తొలగించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

ఉప్పు మరియు చల్లని నీటితో మీరు ఒక పేస్ట్ను తయారు చేయాలి.

రక్తపు మరకలు ఏర్పడిన 10-15 నిమిషాల్లోనే, ఆ పేస్ట్ను మరకలపై నేరుగా రుద్దండి.

ఆ తర్వాత చల్లటి నీటితో మీ బట్టలను బాగా శుభ్రం చేసుకోవాలి.

ఇలాంటివి చిట్కాలను ఉపయోగించి మీ బట్టలు పై ఏర్పడిన మొండి మరకలను సులభంగా తొలగించుకోవచ్చు.

English summary

How to remove stains from clothes: a handy stain removal guide

There are so many different substances that can stain your clothes – from food and drink to ink, lipstick, and oil. Every stain has a different remedy, and the material of your garment will have an impact on how you clean it. So, what do you do when you get a stain on your favourite jacket, dress, or shirt? Here are some useful stain removal tips for removing a variety of stains from your clothing:
Desktop Bottom Promotion