For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో మీరు ఎల్లప్పుడూ శుభ్రపర్చాల్సిన ముఖ్యమైన వస్తువులివే...

ఇంట్లో మీరు ఎప్పుడూ శుభ్రపర్చని,కానీ శుభ్రపర్చాల్సిన 10 వస్తువులు

|

పరిశుభ్రత భగవంతుడికి మారురూపంలాంటిది. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం వలన వచ్చే లాభాలు మనందరికీ సాధారణంగా తెలిసే వుంటాయి. కేవలం మీ జీవితం అందంగా కన్పించేలా చేయటమే కాదు, ఇన్ఫెక్షన్లు, వ్యాధులను దూరంగా ఉంచుతుంది.

రోజువారీ దుమ్ము పేరుకుపోవటం వల్ల ఇల్లు మురికిగా కన్పిస్తుంది. ఈ సమస్య ఇంట్లో చంటిపిల్లలున్నప్పుడు మరింత పెరుగుతుంది ఎందుకంటే వారే ఎక్కువ ఇంటిని మురికి చేస్తారు. నిజానికి ఇల్లు మురికిగా ఉండటం ఇన్ఫెక్షన్లన్నిటికీ మూలకారణం.

10 Things In Your Home You Never Clean, But You Should

ఈ ఉరుకుల పరుగుల జీవనంలో మనకి ప్రతిరోజూ ఇల్లు శుభ్రంచేయటం కుదరకపోవచ్చు. అది కూడా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులయితే అసలు కుదరదు. సాధారణంగా మనలో చాలామంది వారానికోసారి ఇల్లు శుభ్రం చేస్తూ పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటారు.

ఇది కూడా మంచిదే కానీ, ఎలా చేస్తున్నామనేదే ముఖ్యం. ఇంట్లో కొన్ని మూలలను వదిలేసి కొన్నిటిని మాత్రమే శుభ్రం చేయడం గురించి చెప్తున్నాం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నిర్లక్ష్యం వహించిన మూలలు సాధారణంగా చాలామందికి ఒకటే అయివుంటాయి. ఈ ఆర్టికల్ లో అలాంటి 10 ప్రదేశాల గురించి చర్చించాం.ఇవి తప్పక శుభ్రం చేయాల్సిన ప్రదేశాలైతే ఇంట్లో వాటినే ఎక్కువ నిర్లక్ష్యం చేస్తుంటారు.

1.షవర్ హెడ్స్

1.షవర్ హెడ్స్

రెగ్యులర్ గా శుభ్రపర్చకపోతే దుమ్ము పేరుకునే ప్రదేశాలలో ఇది ఒకటి. నిజానికి రెండువారాలకోసారి పొడిగుడ్డతో దీన్ని తుడవాలి.అలాగే ఏడాదికి రెండుసార్లు చక్కగా పైపైన కాకుండా పూర్తిగా శుభ్రం కూడా చేయాలి.

ఇక్కడ చిట్కా ఏంటంటే మీరు ప్లాస్టిక్ సంచీ తీసుకుని అందులో సమాన పరిమాణంలో వెనిగర్, నీళ్ళు కలపండి. షవర్ హెడ్ ను ఈ ప్లాస్టిక్ సంచీలో మునిగేలా చేసి రబ్బర్ బ్యాండ్ తో సంచీని ముడివేయండి. 3 నిమిషాల తర్వాత షవర్ హెడ్ ను తీసి దాన్ని రుద్ది,కడిగి, తుడవండి.

2.కార్పెట్లు

2.కార్పెట్లు

మీ ఇంట్లో ముఖ్యంగా చంటిపిల్లలు లేదా పెంపుడు జంతువులుంటే కార్పెట్లపై ఎక్కువ మురికి చేరుతుంది. వీటిని వారానికోసారి శుభ్రపర్చాలి. మీరు చేయాల్సిందల్లా వాక్యూమ్ క్లీనర్ తో కార్పెట్ ను శుభ్రపర్చటమే. ఇదే రెగ్యులర్ గా చేసే ఎక్కువ మురికి పేరుకోకుండా శుభ్రపర్చటం తేలికవుతుంది.

3.వాషింగ్ మెషీన్ లోపలి భాగాలు

3.వాషింగ్ మెషీన్ లోపలి భాగాలు

వాషింగ్ మెషీన్ లోపలి భాగాల్లో ముఖ్యంగా ఫంగస్, బట్టల దారపుపోగులు పేరుకుంటాయి. ఇలా జరగకుండా ఆపాలంటే మీరు పావు కప్పు బ్లీచింగ్ పౌడర్ వేసి మెషీన్ ను ఖాళీగా తిప్పాలి. లేదా ఫుల్ వాటర్ ఆప్షన్ తో మూడు చెంచాల బ్లీచింగ్ పౌడర్ వేసి కూడా తిప్పవచ్చు. ఇలా వాషింగ్ మెషీన్ లోపలినుండి శుభ్రపడుతుంది.

4.ఓవెన్ అరలు

4.ఓవెన్ అరలు

చేసే వంటలను బట్టి, ఓవెన్ అరల్లో గ్రీజు,మరకలు, బేకింగ్ పదార్థాలు అతుక్కొని వుండి తీయడానికి కష్టంగా ఉంటాయి. వీటిని శుభ్రపర్చటానికి పావు కప్పు తెల్ల వెనిగర్ తీసుకుని, అంట్లు తోమే లిక్విడ్ ను అంతే తీసుకుని, ఒక కప్పు నీరుతో స్ప్రేయింగ్ సీసాలో నింపండి.

ఓవెన్ అరలను ఈ మిశ్రమంతో స్ప్రే చేసి అరగంట అలానే ఉండనివ్వండి. తర్వాత ఆ మురికి, గ్రీజుని మీ చేత్తో సాధారణంగా ఎలా చేస్తారో అలా రుద్ది తుడిచేయవచ్చు.

5.షూ ర్యాక్ లు

5.షూ ర్యాక్ లు

ఇంట్లో వీటిని కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఇక్కడ చేయాల్సింది కూడా వారానికోసారి శుభ్రమైన గుడ్డతో చక్కగా తుడవటమే. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మురికి పేరుకోదు, షూలు కూడా మురికిగా కన్పించవు.

6.ఫ్రిజ్ లో కాయిల్స్

6.ఫ్రిజ్ లో కాయిల్స్

ఫ్రిజ్ కాయిల్స్ సాధారణంగా ఫ్రిజ్ వెనకవైపు ఉంటాయి, వీటిని శుభ్రం చేయటం కూడా సులభమే. మీరు చేయాల్సిందల్లా ముళ్ళున్న బ్రష్ తో శుభ్రం చేసి తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్ ను వాడాలి. కానీ మీరు చేసేముందు ఫ్రిజ్ ను ఆపేయాలి. ఫ్రిజ్ ను క్రమం తప్పకుండా శుభ్రపర్చటం వలన అది ఇంకా బాగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి.

7.వంట కత్తులనుంచే స్టాండు

7.వంట కత్తులనుంచే స్టాండు

ఇది కూడా సులభంగా శుభ్రపర్చవచ్చు కానీ నిర్లక్ష్యం వహిస్తారు.ఇక్కడ చేయాల్సింది ఈ కత్తుల స్టాండును తల్లక్రిందులుగా కాసేపు ఉంచాలి. ఇలా చేయటం వలన చాలామటుకు చెత్త ముక్కల్లాంటివి బయట పడిపోతాయి. అప్పుడు క్యాన్డ్ ఎయిర్ ను వాడి మిగిలిన చెత్త కూడా పడిపోయేలా చేయవచ్చు. తర్వాత దీన్ని సబ్బునీళ్ళలో 20 నిమిషాలపాటు ముంచి నీళ్లతో కడిగేయండి.

8.పరుపులు

8.పరుపులు

మీరెంత శ్రద్ధగా ఉన్నా, అప్పుడప్పుడు అయినా మీ పరుపుల మీద కొన్ని మరకలు పడుతుంటాయి. అలాంటప్పుడు మీరు డైల్యూట్ చేసిన లాండ్రీ సర్ఫ్ తో ఆ మరకల ప్రాంతాన్ని మైక్రోఫైబర్ టవల్ ను వాడుతూ రుద్దండి. అయ్యాక, ఈ ప్రాంతాన్ని మామూలు టవల్ ను నీళ్లలో ముంచి రుద్దండి. ఇలా పరుపులకి సూక్ష్మజీవుల నుంచి రక్షణ లభించి,ఎక్కువకాలం మన్నుతాయి.

9.పుస్తకాలు

9.పుస్తకాలు

మీకు పుస్తకాలంటే పిచ్చి అయితే ఇంట్లో ఎక్కడో అక్కడ పుస్తకాలు అలా సర్దకుండా పడేసి ఉండటం కన్పిస్తూనే ఉంటుంది. ఇది చెడ్డ అలవాటు కాకపోయినా,వారానికోసారి వీటికి పట్టే దుమ్ము కూడా దులుపుతుండటం మంచిది. చిన్న మైక్రోఫైబర్ గుడ్డ ఈ విషయంలో అద్భుతాలు చేస్తుంది. ఇది పుస్తకాలను మంచి స్థితిలో ఉంచటమేకాక, మీ ఇల్లు కూడా సూక్ష్మజీవులు లేకుండా చేస్తుంది.

10.సాఫ్ట్ టాయ్స్

10.సాఫ్ట్ టాయ్స్

ఈ సాఫ్ట్ టాయ్స్ కి పైన ఫర్ ఉండటం వలన చాలా మురికి, దుమ్ము పేరుకుపోతాయి. పిల్లలకి వీటినుంచి అలర్జీలు రాకుండా ఉంచాలంటే, నెలకోసారి ఈ బొమ్మలను కడగండి. దీనికి మీరు చేయాల్సింది వాటిని వాషింగ్ మెషీన్ లో రెండు చెంచాల ఫాబ్రిక్ సాఫ్టనర్ వేసి, డెలికేట్ మోడ్ లో పెట్టి ఉతకండి.

English summary

10 Things In Your Home You Never Clean, But You Should

Weekends are the two days when you get the time to clean your house. Though you assume you have cleaned your house, there are certain places in the house most people tend to ignore or not notice. But it is very important to clean these things also. Shower heads, carpets, inside washing machine, mattress etc. are the most ignored places.
Desktop Bottom Promotion