For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2018 వాస్తు చిట్కాలు...ఇవి మీ అదృష్టానికి దారులు తెరుస్తాయి !

మన ఇంట్లో మంచం లేదా పరుపు ఎక్కడ ఉండాలి అనే విషయం దగ్గర నుండి, గోడ పై బొమ్మలను ఎక్కడ ఎలా వేలాడ దీయాలి అనే విషయాలు వరకు, మన యొక్క జీవితం లో మన యొక్క అదృష్టం పై ఇవన్నీ ప్రభావాన్ని చూపుతాయి. వ్యక్తుల అదృ

By R Vishnu Vardhan Reddy
|

మన ఇంట్లో మంచం లేదా పరుపు ఎక్కడ ఉండాలి అనే విషయం దగ్గర నుండి, గోడ పై బొమ్మలను ఎక్కడ ఎలా వేలాడ దీయాలి అనే విషయాలు వరకు, మన యొక్క జీవితం లో మన యొక్క అదృష్టం పై ఇవన్నీ ప్రభావాన్ని చూపుతాయి. వ్యక్తుల అదృష్టాన్ని ఇవి నిర్ణయిస్తామని చాలామంది నమ్ముతారు. ఈ అతి చిన్న విషయాలన్నీ మన జీవితాల్లో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్థాయి. దీనినే వాస్తు శాస్త్రం అంటారు.

మనం ఇప్పుడు 2018 లో అడుగు పెట్టేసాము. మన అదృష్ట తలుపులు తెరుచుకోవడానికి పాటించవలసిన వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ చిట్కాలు పాటించడం చాలా సులువు. వీటిని సంవత్సరంలో ఏ రోజైన మొదలు పెట్టవచ్చు. అలాంటప్పుడు ఆ మార్పులను ఎందుకు ఈరోజు నుండే మొదలు పెట్ట కూడదు.

మన జీవితాన్ని మార్చేసే ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బీరువాని దక్షిణ దిశలో పెట్టండి :

బీరువాని దక్షిణ దిశలో పెట్టండి :

మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, డబ్బుల డబ్బా లేదా బీరువాని దక్షిణ దిశలో పెట్టాలి. దాని యొక్క తలుపులు ఉత్తరం దిశకు తెరుచుకొనేలా ఉండాలి. ఉత్తర దిశని కుబేర స్థానం అంటారు. కుబేరుడు ధనానికి అధిపతి.

మీ పర్సులో అద్దం ఉంచుకోండి :

మీ పర్సులో అద్దం ఉంచుకోండి :

వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం అనేది ఒక శక్తివంతమైన సాధనంగా వాస్తుకు సంబంధించిన విషయాల్లో ఉపయోగపడుతుంది. మన యొక్క శక్తి సామర్ధ్యాలను రెట్టింపు చేస్తుందట అద్దం. మీరు గనుక పర్సులో అద్దాన్ని గనుక ఉంచుకున్నట్లైతే మీ ఆర్ధిక స్థితి గతులు అతి త్వరలోనే మెరుగుపడతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది.

ఈశాన్య మూల చెత్తను వేయకూడదట !

ఈశాన్య మూల చెత్తను వేయకూడదట !

ఇంట్లోని ఈశాన్య మూల చెత్త డబ్బని కానీ లేదా చెత్త వస్తువులను గాని ఉంచకూడదట. మరో వైపు ఆ వైపున మీకు గనుక స్మశానం లేదా ఎత్తైన భవనం గాని ఉంటే, అటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో తులసి మొక్కని ఉంచండి. తులసి మొక్క ఆర్ధిక స్థితి గతుల పై వ్యతిరేక ప్రభావం చూపించే శక్తులన్నింటిని ఆపివేస్తుంది. ఈశాన్య మూల ఏదైతే ఉందో ఇది ఒక దేవతా సంబంధమైన దిశ. ఈ దిశ లో ఎటువంటి వ్యతిరేక శక్తులు గాని రాకూడదు.

బరువైన వస్తువులను మధ్యలో ఉంచకండి :

బరువైన వస్తువులను మధ్యలో ఉంచకండి :

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని బ్రహ్మ స్థానం అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో బరువైన యంత్ర సామాగ్రి గాని లేదా బరువైన వస్తువులను కానీ ఉంచకూడదు. ఒకవేళ గనుక ఉంటే వాటిని తీసివేయడం మంచిది. అవి ఆ స్థానంలో గనుక ఉంటే, అవి మీ యొక్క వ్యాపార లాభాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

ఈశాన్య మూల చిన్న జలపాతం లేదా ఆక్వేరియం ని ఉంచండి:

ఈశాన్య మూల చిన్న జలపాతం లేదా ఆక్వేరియం ని ఉంచండి:

ఈశాన్యం మూల చిన్న ఆక్వేరియం ఉంచండి. ఆలా ఉంచడం ద్వారా నీటి యొక్క ప్రవాహం అనేది ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతాయి మరియు డబ్బు అధికంగా రావడం మొదలవుతుంది.

కాబట్టి ఈ రోజు నుండి ఈ వాస్తు చిట్కాలను పాటించి 2018 సంవత్సరాన్ని అదృష్ట సంవత్సరంగా మార్చుకోండి. మీకు గనుక వేరే ఏ ఇతర వాస్తు చిట్కాలు తెలిసినా, క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మాకు తెలియజేయండి.

English summary

Vaastu Changes That You Can Make In 2018 Which Help Release Blocked Payments

Certain changes in vaastu can affect an individual's life. From bringing in bad luck to opening doors of good luck, vaastu can do a lot. Finding out about the right way of using vaastu will result in good results. Here are a few tips that can help open your lucky doors.
Story first published:Tuesday, January 2, 2018, 15:59 [IST]
Desktop Bottom Promotion