For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నారా ? అయితే ఈ వాస్తు పద్దతులను అనుసరించండి.

|

వివాహం స్వర్గంలో నిర్ణయించబడుతుంది అని చెప్పబడింది. వివాహం అనునది దైవంచే నిర్ణయించబడిన బంధం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సంబంధాలను చూసినా, ఎంత మందిని సంప్రదించినా, దైవ నిర్ణయం చివరకు ప్రామాణికం అవుతుంది. అవునా కాదా ? మరియు మనం ఒక నిర్దిష్ట వయస్సుకు వచ్చినప్పుడు మన జీవిత భాగస్వామి కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ అందరూ వారి భాగస్వాములను త్వరగా కనుగొనలేరు.

ఒక్కోసారి సరైన భాగస్వామిని పొందాము అని అనుకునే లోపునే, ఏదో ఒక కారణం చేత, సంబంధం వీగిపోవడమో, కాలయాపన జరగడమో జరుగుతూ ఉంటుంది. తద్వారా అనేక మానసిక సంఘర్షణలకు లోనై డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా కేర్ ఆఫ్ అడ్రెస్ గా మనసు మారుతుంది. పెళ్లి కాలేదని ఆత్మహత్యల వంటి పిరికి చర్యలకు పాల్పడుతున్న యువత పరిష్కార మార్గాల వైపు దృష్టి సారించడం, నిపుణులను సంప్రదించి మానసిక చికిత్సలే కాకుండా, వాస్తు, జ్యోతిష్య సంబంధ దోషాలను కూడా నివృత్తి చేసుకోవడం ద్వారా కొన్ని సానుకూల ఫలితాలను పొందవచ్చు. ఆ క్రమంలో భాగంగానే ఈ వ్యాసం మీకు సహాయపడగలదని భావిస్తున్నాం.

Vastu Tips To Get Married: Follow these to get married soon

మీ ఇoటిలోని వాస్తు దోషం మీ వివాహ అవకాశాలను అడ్డగిస్తుoదని మీకు తెలుసా ? కొన్ని వాస్తు దోషాలు, వాస్తవానికి మీ భాగస్వామిని గుర్తించే అవకాశాన్ని ఆలస్యం చేయవచ్చని మీకు తెలుసా ? ఇది నిజం. మీరు మీ వివాహ ప్రయత్నాలలో సమస్యలను ఎదుర్కొంటుంటే, మీరు క్రింద చెప్పబడిన ఈ వాస్తు దోషాలలో కొన్నింటిని కలిగి ఉండవచ్చు.

తల్లిదండ్రులను భాదించే పెద్ద చింతల్లో ఒకటి, వారి పిల్లలు సరైన వయస్సులో, సరైన వ్యక్తిని వివాహం చేసుకోలేకపోవడం. వారు వివాహ వయస్సును చేరుకున్న తర్వాత, జరిగే ఆలస్యం వారికి ఆందోళన కలిగిస్తుంది, అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కానీ వారి పిల్లల వివాహంలో జరుగుతున్నఆలస్యానికి కారణాన్ని, పరిష్కారాన్ని కనుగొనలేక సతమతమవుతూ ఉంటారు. వారికి ఇప్పుడు చెప్పబోయే వాస్తు చిట్కాలు చక్కటి ఉపశమనాన్ని ఇస్తాయి. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు తొలగేందుకు ఈ సాధారణ వాస్తు చిట్కాలను అనుసరించండి. తద్వారా మరియు మీ బిడ్డ కోసం సరిగ్గా సరిపోయే సంబంధాన్ని కనుగొనండి. లేదా మంచి వాస్తు శాస్త్ర నిపుణున్ని సంప్రదించి, మీ ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలున్నాయేమో పరీక్షించి, వారి సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనేక ప్రతికూల పరిస్థితుల నుండి స్వావలంబన పొందవచ్చు.

పెళ్లికి సిద్దమవుతున్న అమ్మాయి

పెళ్లికి సిద్దమవుతున్న అమ్మాయి

పెళ్లికి సిద్దమవుతున్న అమ్మాయి ఇంటి దక్షిణ నైరుతిలో మూలలో నిద్రపోకూడదు. మీ వివాహ అవకాశాలు పెరగడానికి వాయువ్య దిశలో నిద్రకు ఉపక్రమించండి. వివిధ కారణాల మూలంగా ఆ దిక్కున సౌకర్యంగా లేని పక్షంలో, మీరు తూర్పు లేదా పశ్చిమ దిశని ఎంచుకోవచ్చు.

పెళ్లికి సిద్దమవుతున్న అబ్బాయి

పెళ్లికి సిద్దమవుతున్న అబ్బాయి

పెళ్లికి సిద్దమవుతున్న అబ్బాయి ఆగ్నేయ దిశలో ఉన్న పడక గదిలో నిద్రపోవడాన్ని నివారించాలి. పడక గది ఈశాన్య దిశలో ఉండాలి. ఇది సాధ్యపడకపోతే, దక్షిణం లేదా పశ్చిమ దిక్కులు మంచివిగా చెప్పబడ్డాయి. తద్వారా వివాహ ప్రయత్నాలలో సానుకూల ఫలితాలను పొందవచ్చు.

మీ భాగస్వామిని కనుగొనడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే

మీ భాగస్వామిని కనుగొనడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే

మీ భాగస్వామిని కనుగొనడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, పెళ్లి చేసుకున్న వ్యక్తి తేలికపాటి రంగుల దుస్తులతో నిద్రిస్తున్నట్లు నిర్ధారించుకోండి. మేలైన ఊదా, గులాబీ, పసుపు లేదా తెలుపు షేడ్స్ ఉన్న దుస్తులు ఎన్నుకోవడం మంచిది. ఇది గదిలో సానుకూల పవనాలు వీచేలా మరియు అసాధారణ శక్తిని ప్రసరించేలా చేస్తుంది.

మీరు భూగర్భ వాటర్ ట్యాంక్ కలిగి ఉంటే,

మీరు భూగర్భ వాటర్ ట్యాంక్ కలిగి ఉంటే,

మీరు భూగర్భ వాటర్ ట్యాంక్ కలిగి ఉంటే, అది ఇంటికి నైరుతి దిశలో లేదని నిర్ధారించుకోండి. మీరు ఆ దిశలో కలిగి ఉంటే, దాన్ని తప్పని సరిగా తీసివేసి మరెక్కడైనా ఉంచండి. ఇది వివాహ ప్రక్రియను ఆలస్యం చేసే అతి ముఖ్యమైన వాస్తు లోపాలలో ఒకటిగా చెప్పబడింది.

త్వరలోనే వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి

త్వరలోనే వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి

త్వరలోనే వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి తన మంచం క్రింద ఎటువంటి ఇనుప వస్తువులను కలిగి ఉండకూడదు మరియు ఇనుప వస్తువులను మంచం కింద ఉంచుకుని నిద్రపోవడం చేయరాదు. మరియు మంచం క్రింద లేదా గదిలో అస్తవ్యస్తంగా వస్తువులను కలిగి ఉండడం సరికాదు. శుభ్రమైన మరియు అయోమయ రహిత గది సానుకూల పవనాలకు కారణభూతమవుతుంది. ఎల్లప్పుడూ శుభ్రంగా గదిని ఉంచుకోవాలి.

 వివాహానికి సిద్దమవుతున్న అబ్బాయి గదిలో గోడల రంగు పసుపు

వివాహానికి సిద్దమవుతున్న అబ్బాయి గదిలో గోడల రంగు పసుపు

వివాహానికి సిద్దమవుతున్న అబ్బాయి గదిలో గోడల రంగు పసుపు, లేదా లేత గులాబీ లేదా పూర్తిగా తెల్లటి తేలిక పాటి షేడ్స్ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం మూలంగా త్వరగా వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. తేలికైన రంగులు మంచి శక్తిని ప్రతిబింబిస్తాయి మరియు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

మొత్తం ఇంటి గోడలను తేలిక పాటి షేడ్స్ గల రంగులలో పెయింట్ చేయాలి.

మొత్తం ఇంటి గోడలను తేలిక పాటి షేడ్స్ గల రంగులలో పెయింట్ చేయాలి.

మొత్తం ఇంటి గోడలను తేలిక పాటి షేడ్స్ గల రంగులలో పెయింట్ చేయాలి. మేలైన పాస్టెల్ రంగులు ఎంచుకోవడం మంచిది. ఇది ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది మరియు వివాహ విషయాలను వేగవంతం చేస్తుంది. ఇంటి గోడలకు నలుపు మరియు గోధుమ వంటి ముదురు లేదా చీకటి రంగులలో పెయింటింగ్ చేయడాన్ని పూర్తిగా నివారించండి.

ఇంటి మధ్యలో మెట్లు లేదా భారీ వస్తువులు ఉంచడం మానుకోండి

ఇంటి మధ్యలో మెట్లు లేదా భారీ వస్తువులు ఉంచడం మానుకోండి

ఇంటి మధ్యలో మెట్లు లేదా భారీ వస్తువులు ఉంచడం మానుకోండి. ఇంటి మధ్య భాగంలో మెట్లను కలిగి ఉండడం లేదా భారీ వస్తువులు లేదా ఆకృతులు ఉండడం మూలంగా వివాహ ప్రక్రియ ఆలస్యం చేయగలదని వాస్తు శాస్త్రం వివరించింది. కావున మీ ఇంటి మధ్యన మెట్లు లేదా అలాంటి భారీ నిర్మాణాలు లేవని నిర్ధారించుకోండి.

మంగళ దోషo కలిగి ఉన్నవారు

మంగళ దోషo కలిగి ఉన్నవారు

మంగళ దోషo కలిగి ఉన్నవారు వివాహ ప్రయత్నాలలో విఫలమవుతున్న ఎడల, వారు వారి గదిని తలుపులను ఎరుపు మరియు పింక్ రంగులతో పెయింటింగ్ చేయడం మంచిది. ఈ చిట్కా మంగళ దోషo కలిగి ఉన్న పిల్లలకు చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఎరుపు లేదా గులాబీ రంగులో మీ గది తలుపులకు పెయింటింగ్ వేయడం ద్వారా మంగళ దోషo యొక్క ప్రభావం తగ్గిస్తుంది. మరియు సానుకూల ఫలితాలను కలిగిస్తుంది.

మీ పెళ్లి ఆలస్యమవుతున్నట్లు మీరు భావిస్తున్నట్లయితే,

మీ పెళ్లి ఆలస్యమవుతున్నట్లు మీరు భావిస్తున్నట్లయితే,

మీ పెళ్లి ఆలస్యమవుతున్నట్లు మీరు భావిస్తున్నట్లయితే, ఈశాన్య మూల నుండి నైరుతి దిశలో వాలుగా ఉన్న భూమిని కొనుగోలు చేయకుండా ఉండడం ఎంతో మంచిదిగా వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కొనాల్సిన పరిస్థితులు ఏర్పడిన ఎడల, మంచి వాస్తు శాస్త్ర నిపుణుడి పర్యవేక్షణలో వారి సూచనల ప్రకారం నడుచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి వాస్తు మరియు జ్యోతిష్య సంబంధిత వివరాలకై తరచూ మా పేజీని సందర్శిస్తూ ఉండండి.

English summary

Vastu Tips To Get Married: Follow these to get married soon

If you have issues in getting married, then there might be a problem in the vastu of your house. Yes, this can lead to delay in marriage. But there is a way out to this. An unmarried girl should avoid sleeping in the south western corner of the house. Choose to place a bed in the north west direction for increasing your marriage prospects.
Desktop Bottom Promotion