For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి వాస్తులో ఈశాన్యం, నైరుతి ఇలా 8 దిక్కుల విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం..

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రాంగణంలో ఈశాన్యం, నైరుతి ఇలా 8 దిక్కుల విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం..

|

వాస్తు శాస్త్రం దిక్కులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఒక్కో దిక్కుకు ఒక్కో అధిపతి ఉంటాడని నమ్ముతారు. కాబట్టి వాస్తు ప్రకారం ఇంటి ప్రాంగణంలో 8 దిక్కులు ఎలా ఉండాలో చూద్దాం.

8 directions according to Vastu Shastra their importance in telugu

ఇంటి నిర్మాణంలో దిక్కులకు చాలా ప్రాధాన్యం ఉంది. వాస్తును పాటించేవారు దిక్కులను అనుసరించే ఇంటి నిర్మాణాన్ని చేపడతారు. ఎనిమిది దిక్కుల్లో ఒక్కో దిక్కుకు ఒక్కో అధిదేవత ఉంటారని నమ్మకం. దీన్ని అనుసరించి ఎనిమిది దిక్కుల్లో ఒక్కోదాని ప్రభావం గురించి తెలుసుకుందాం.

తూర్పు:

తూర్పు:

తూర్పు దిక్కును ఇంద్రుడు పాలిస్తుంటాడు. ఇంద్రుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. అందుకే ఈ దిక్కులోని ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మించటం వల్ల శుభం చేకూరుతుంది.

పడమర:

పడమర:

పడమర దిక్కుకు అధిష్టాన దేవత వరణుడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు దిక్కు కంటే తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఈ దిశలో ఎత్తు ఉండేలా చేస్తే సర్వ శుభములు కలుగుతాయి. పడమర భాగంలో కూడా మంచి నీటి బావులు, బోరులు ఏర్పరచవచ్చు. అయితే ఇవి విదిశలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

 ఉత్తరం:

ఉత్తరం:

ఈ దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగానూ విశాలంగానూ ఉత్తరం ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు ఏర్పాటు చేసుకోవటం మంచిదే. దీనివల్ల విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరుగే అవకాశం ఉంది.

 దక్షిణం:

దక్షిణం:

దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తర దిశతో పోల్చినపుడు ఈ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.

ఈశాన్యం:

ఈశాన్యం:

ఈ దిక్కుకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగాను, పల్లంగానూ ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కాబట్టి ఈ దిశలో నీరు లేదా బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భక్తి, జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.

ఆగ్నేయం:

ఆగ్నేయం:

ఈ దిక్కుకు అధిదేవత అగ్నిదేవుడు. అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవటం శుభం. బావులు, గోతులు ఉండడం, ఇతర దిక్కులకంటే ఎక్కువ పల్లంగా ఉండడం ఎంత మాత్రం మంచిదికాదు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యాల బారిన పడటం, స్థిరాస్తులు కోల్పోవటంలాంటి అపశకునాలు కలుగుతాయి.

వాయువ్యం:

వాయువ్యం:

వాయువ్యానికి అధిదేవత వాయువు. ఈ దిక్కు నైరుతి, ఆగ్నేయ దిశలకంటే పల్లంగానూ, ఈశాన్యం కంటే ఎత్తుగానూ ఉండాలి. అలాగే ఈ దిశలో నూతులు, గోతులు ఉండకూడదు. ఈ దిశ ఈశాన్యం కంటే ఎక్కువగా పెరిగి ఉండరాదు. ఇలా ఉంటే పుత్ర సంతానానికి హాని, అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉంది.

నైరుతి:

నైరుతి:

ఈ దిక్కుకు అధిదేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్ని దిక్కులకన్నా ఈ దిక్కు తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. అలాగే ఈ దిక్కులో ఎక్కువగా బరువు ఉండటం శుభం. ఈ దిక్కులో గోతులు, నూతులు ఉంటే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.

పైన చెప్పిన విధంగా ఉన్న ఎనిమిది దిక్కుల అధి దేవతలను బట్టి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపడితే ఆ గృహం సకల ఆనందాలకు నెలవవుతుందని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.

English summary

8 directions according to Vastu Shastra their importance in telugu

Vaastu Shastra, one of the most ancient doctrines of Indian civilization, deals with the science of architecture and designing.
Story first published:Monday, September 12, 2022, 11:50 [IST]
Desktop Bottom Promotion