Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
చలికి తట్టుకునే 5 మంచి రకాల కుక్క జాతులు!

1. సెయింట్ బెర్నార్డ్ జాతి - ఈ జాతి కుక్కలు స్విస్ దేశానికి చెందినవి. ఇది క్రిస్టియన్ మత సన్యాసులకు వెంటవుంటుంది కనుక దీనిని సెయింట్ అని పిలుస్తారు. చాలా బలిష్టమైనది. వేడికి అసలు తట్టుకోలేదు.
2. గోల్డెన్ రిట్రీవర్ - పిల్లలు ఇష్టపడే ఈ బొచ్చు కుక్క కుటుంబం అందరకు ఇష్టమైనదే. పెద్దవిగా వుంటాయి. ఏది కావాలన్నా తెచ్చిస్తాయి. బొచ్చు ఎక్కువ కనుక చలికి తట్టుకోగలదు. ఎండాకాలంలో బొచ్చును కత్తిరించి ఎయిర్ కండిషన్ గదుల్లో వుంచాలి.
3. అలాస్కన్ మాలాముటే-ఇవి అలాస్కా దేశంలో వుంటాయి. మందపాటి బొచ్చు వుంటుంది. తోకకు బొచ్చు అధికంగా వుండటం చేత తోడేలుగా కూడా మనం భావిస్తాం. వీటికి వేడి వున్నా పరవాలేదు కాని సూర్య రశ్మి మాత్రం తగిలితే భరించలేవు. సహజంగా ఇవి చలికాలం పూర్తవగానే తమ బొచ్చును కోల్పోతాయి. మరల వచ్చే వేసవికి తమ శరీరాన్ని సిద్ధం చేసుకుంటాయి.
4. చౌ చౌ - ఇది ఒక కుటుంబ కుక్క. బొచ్చు వుంటుంది. జూలు వుండి సింహాన్ని తలపిస్తుంది. కావలికి బాగా పనికి వస్తాయి. తన యజమాని, ఇల్లు అంటే ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. తెలియని వారంటే చాలు భయంకరంగా మీద పడతాయి.
5. జర్మన్ షెప్పర్డ్ - సాధారణంగా దీనిని ఇంటి పెంపుడు కుక్కగా పెంచుతూనే వుంటాం. ధైర్యం ఎక్కువ, మంచి బలం కలది. చలి రాత్రులను ఇంటి బయట ఆహ్లాదంగా గడిపేయగలదు. మందపాటి బొచ్చు వుంటుంది. చాలా తెలివైనవి. కరవడం అధికం. పోలీసులు దీనిని స్నిఫర్ డాగ్ గా ఉపయోగిస్తారు.
ఈ 5 రకాల కుక్కలు శీతా కాలంలో చలికి బాగా తట్టుకొని నిలబడగల సామర్ధ్యాన్ని కలిగి వుంటాయి.



Click it and Unblock the Notifications