For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాపం.. శునకానికి డైటింగ్ తప్పలేదు..!!

|

Australian Lab
ఉండాల్సిన బరువు కన్నా అధిక బరువు ఉంటే మనుషులకే కాదు.. పెంపుడు జంతువువలకు ఆరోగ్య సమస్యలు తలెత్తక తప్పవు కాబోలు. అందకే మద్దుగా పెంచుకుంటున్న వారి 'శ్యాంసన్' బ్లాక్ రాడర్ డాగ్‌కు కఠిన నియమాలతో డైటింగ్ చేయిస్తున్నారు. ప్రేమతో యజమానులు పెట్టిన పిజ్జాలు, బర్గర్లు, చికెన్, మటన్లను ఇరిగ లాగించిన ఈ శునకమహారాజు 200 ఎల్బీల బరువెక్కాడు.

ఉండాల్సిన దానికన్న అధిక బరువు ఉండటతో 'శ్యాంసన్' తన పెట్ హౌస్ లోంచి బయటకు వచ్చేందుకు అపసోపాలు పడుతున్నాడట.. ఇది చూసి చలించి పోయిన యజమానులు వైటర్నరి వైద్యులను సంప్రదించి వారి సూచనల మేర శ్యాంసన్‌తో స్ట్రిక్ట్ డైటింగ్ చేయుస్తున్నారు. ఈ డైట్ ప్రారంభించాక 'శ్యాంసన్' క్రమంగా బరువు తగ్గటం మొదలైంది. వైద్యులు సూచించిన ఆహార నియమాలను పాటించి తమ 'శ్యాంసన్'ను కాపాడుకోవటమే తమ లక్ష్యమని యజమానులు కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అతి బరువైన శునకంగా 'శ్యాంసన్' గుర్తింపు పొందింది.

English summary

Australian Lab Reaches Nearly 200 lbs..!! | పాపం.. శునకానికి డైటింగ్ తప్పలేదు..!!

One of Australia's most obese dogs is going on a diet. Samson is a black Labrador retriever who's lived on a diet of pizza, burgers and pies for years.
Story first published:Saturday, September 3, 2011, 15:36 [IST]
Desktop Bottom Promotion