Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కుక్కలను కూడా వదలని.... డయాబెటీస్!

మరి లేబ్రేడర్ కుక్కకు ఏ రకమైన ఆహారం ఇవ్వాలి?
ఈ కుక్కకు ఆహారం 3 లేదా 4 సార్లుగా ఇవ్వాలి. ఆహార పరిమాణం దాని వ్యాయామానికి తగినట్లుగా వుండాలి. ఇంట్లోనే దాని ఆహారం మీరు తయారు చేస్తున్నట్లయితే, రాగి, ధాన్యాలు గల ఆహారం ఇవ్వండి ఇది కండలను పెంచుతుంది. లేబ్రేడర్ జాతి కుక్కకు ఆహారంలో 70 శాతం ప్రొటీన్లు వుండాలి. తగినంత మాంసం కూడా పెట్టవచ్చు. అపుడపుడూ ఒకటి లేదా రెండు స్వీట్లు కూడా దానికి పెట్టవచ్చు. కొవ్వు పదార్ధాలు అధికంగా ఇవ్వరాదు. రసగుల్లా వంటి స్వీటు పెట్టేట్లయితే, అందులోని షుగర్ పాకం అంతా తీసి పెట్టండి.
ఇచ్చే ఆహారంలో విటమిన్లు, మినరల్స్ కనీసం 2 శాతం వుండాలి. లేబ్రేడర్లు సైజులో పెద్దవిగా వుంటాయి. ఎముక బాగా ఎదుగుతుంది. కనుక కాల్షియం అధికంగా కావాలి. ఎదేగే వయసులో కాల్షియం అధికంగా ఇవ్వండి. పాలు, పాల ఉత్మత్తులు, పెరుగు మొదలైనవి పుష్కలంగా పెట్టవచ్చు. లేబ్రేడర్ కుక్క పిల్లలు బాగా తిని వేగంగా ఎదిగిపోతాయి. వీటి ఆహారంలో కార్బో హైడ్రేట్ లు, కొవ్వులు కూడా అధికంగానే కావాలి. ఒకసారి కుక్కపూర్తిగా ఎదిగిందంటే దాని ఆహార అవసరాలు కూడా మారతాయి. ఎదిగిన కుక్కకు సంతులిత ఆహారం ఇవ్వండి. ఆహారం అధికం అయితే కొవ్వు పేరుకుంటుంది. ముసలి వయసులో దానికి స్వీటు తిండ్లు పూర్తిగా మాన్పించాలి. లేబ్రేడర్ కుక్కలకు ముసలి వయసులో డయాబెటీస్ వస్తుంది. వాటి కళ్లు, కిడ్నీలు దెబ్బతింటాయి.
ఈ చిట్కాలు ఆచరిస్తూ మీ లేబ్రేడర్ కుక్కను దాని జీవితంలోని ప్రతి దశలో సంతోషంగా వుంచండి.



Click it and Unblock the Notifications