Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
అందాల మహిళలు మెచ్చే... ముచ్చటైన సందడి!

చిహుహుఆ - దీనినే ఛీ అని కూడా అంటారు. అతి చిన్నగా వుండే ఈ కుక్కను సాకటం లేదా ఎక్కడికైనా తీసుకెళ్ళటం చాలా తేలిక. 6 నుండి 9 అంగుళాల పొవుండి సుమారు 2 నుండి 4 పౌండ్ల బరువుంటుంది. చాలాకాలం అంటే సుమారు 18 ఏళ్ళవరకు కూడా బతుకుతుంది. ఇంటిలో మంచి జతగా వుండాలంటే చించుహుఆ మంచి ఆడకుక్క.
పొమేరేనియన్- ఇంటిలో ఆడకుక్కగా ఈ జాతి కుక్క బాగుంటుంది. అయితే, సంవత్సరమంతా ఇంటిలో బొచ్చు విదిలిస్తూనే వుంటుంది. సాధారణంగా ఇది ప్రతి డాగ్ లవర్ ఇంటా మెడలో బెల్టుతో ముచ్చటగా కనపడుతూనే వుంటుంది. ఎంతో అందంగా వుండి ఇంటిలో సందడి చేస్తూంటుంది. గట్టిగా కేకలేస్తేచాలు పరుగుపెడుతుంది.
పెకెంజీస్ - 6 నుండి 9 అంగుళాల పొడవు, 8 నుండి 10 పౌండ్ల బరువుతో ఇది చాలా తెలివైన కుక్క. కానీ మూడీగా వుంటుంది. ఆకారం సింహాన్నపోలివుంటుంది. జీవితకాలం 15 సంవత్సరాలు. ఒకప్పుడు చైనా దేశానికే పరిమితమైన ఈ కుక్క నేడు ప్రపంచవ్యాప్తంగా వుంది. కాని వేడి వాతావరణం దీనికి సరిపడదు.
పూడుల్ - చిన్ని బొచ్చు కుక్క. వివిధ రంగుల్లో అంటే...తెలుపు, నలుపు, బ్లూ, గ్రే, సిల్వర్, బ్రౌన్, అప్రికాట్, రెడ్, క్రీమ్ రంగుల్లో లభిస్తుంది. మహిళలు సాకటానికి ఎంతో సులువైనది.
బేసెట్ హౌండ్ - ఇవి కూడా చిన్న సైజు కుక్కలే. పొట్టికాళ్ళతో రెండు రంగుల శరీరంతో ఆకర్షణీయంగా వుంటుంది. నలుపు లేదా బ్రౌన్ రంగుల్లో సాధారణంగా దొరుకుతూంటుంది.
ఈ అయిదు రకాల ఆడకుక్కలను ఇంటి మహిళలు చాలా సులభంగా, ఆనందంగా పెంచవచ్చు.



Click it and Unblock the Notifications