Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
వయసు పైబడిన మానవుడి నేస్తం!
Pet Care
oi-Nageswara
By B N Sharma

మోర: కుక్క మోర (ముఖంలోని భాగం) పరిశీలించండి. దీని చుట్టూతా తెల్లగా కనపడుతుంది.
వినికిడి: దానిని పిలవండి మీ పిలుపుకు అది స్పందించకపోతే వినికిడి సమస్య అని గ్రహించండి. మీరు ఒక్కసారి ఇంటిలో ప్రవేశిస్తే అది ఆందోళన చెందుతుంది.
నిదానం: గతంలోలాగా అది జంప్ చేయలేదు. మెట్లు దిగాలంటే మెల్లిగా దిగుతుంది. పెద్ద కుక్కలకు కీళ్ళనొప్పులు వస్తాయి. వెటరినరీ వైద్యుని సంప్రదించండి.
నీలంరంగు కళ్ళు: కుక్క కళ్ళలో నీలిరంగు కనుగుడ్డు ఏర్పడుతుంది. కుక్కలకు వయసు పైబడుతుంటే ఇది ఒక సహజమార్పు. అయితే, కాటారాక్ట్ అనుకోకండి. కాటారాక్ట్ తెల్లగా వుంటుంది.
కండరాలు సడలుతాయి: పొట్ట భాగంలోలేదా వెనుక కాళ్ళలో కల కండరాలు సడలుతాయి.
దంతాలు: లాలాజలం అధికమవుతుంది. చిగుళ్ళు, దంతాలు లూజు అవుతాయి, శ్వాస వాసన వస్తుంది.
ఇతరాలు: తరచుగా మూత్రం పోస్తుంది. దాహం అంటుంది. బరువు తగ్గుతుంది శ్వాస సమస్యలు వస్తాయి. చర్మంపై గడ్డలు వచ్చే అవకాశం వుంది.
వీటన్నిటికి పరిష్కారంగా మీరు దిగువ చిట్కాలు పాటించండి.....
1. మీ పెంపుడు కుక్కను ఆరునెలలకొకసారి వైద్యుడికి చూపండి.
2. ఆహారం మార్పు చేయండి. తేలికగా అరిగే పదార్ధాలు పెట్టండి. తక్కువగా ఎక్కువసార్లు తినిపించండి.
3. బెడ్ మార్చండి. కీళ్లకు హాయిగా వుండేలా మెత్తటి బెడ్ ఏర్పరచండి. నిశ్శబ్దంగా వుండే ప్రదేశానికి దాని పడక మార్చండి.
4. బెడ్ వద్ద తాగేటందుకు కావలసినంత నీరు పెట్టండి.
5. వారానికోసారి బొచ్చు దువ్వటం కాలి గోళ్ళు కత్తిరించడం చేయండి. రెగ్యులర్ వాక్ చేయించాలి.
6. ఇంటిలోని సభ్యులకు దాని అసౌకర్యాలు తెలుపండి. దానిని వారు బాగా చూసుకునేలా చేయండి.
వయసు పైబడ్డ పెంపుడు కుక్కలను బహు జాగ్రత్తగా సాకాలి. మీరు ఎంతబాగా ప్రేమిస్తే దాని ముసలివయసు అంత బాగా ఆనందిస్తుంది. వైద్యుడి సలహా, కుటుంబసభ్యుల జాగ్రత్తలు వీటికి ఎంతో ఊరటనివ్వగలవు.
Comments
English summary
Care For Your Aging Dog's Health | ముసలి కుక్క ఆరోగ్య జాగ్రత్తలు!
Story first published: Tuesday, October 4, 2011, 12:01 [IST]
Other articles published on Oct 4, 2011



Click it and Unblock the Notifications