Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మానవ సంబంధాలలో ఒకటిగా....!

ఇంటిలో కుక్క వుంటే, దానినుండి ఏ రకమైన ఆశించటం లేకుండా ఎంతో ప్రేమ పొందవచ్చని మానసిక శాస్త్ర వేత్తలు సైతం సలహాలనిస్తున్నారు. ప్రేమ కొరకు మానవులపై ఆధారపడేకంటే, ఏమిచ్చినా ? ఏమివ్వకున్నా? అనుక్షణం పక్కన వుండి తన ప్రేమను తెలిపే పెంపుడు కుక్కలు మనిషికి ఏ క్షణంలోనైనా మంచి ఓదార్పు కాగలదని వీరు తెలుపుతున్నారు.
పిల్లలు లేని జంటలకు, నాలుగు కాళ్ళ పెంపుడు జీవాలే పిల్లలుగాను, భాగస్వామిలేని వ్యక్తులకు ఈ జీవాలే భాగస్వాములుగాను కూడా నానాటికి సమాజంలో పెరిగిపోతోంది. మానవ సంబంధాలలో భర్తీ చేయలేనివి ఏవైనా వుంటే, వాటిని మీరు అమితంగా ప్రేమించే కుక్కలు భర్తీచేస్తున్నాయంటున్నారు కుక్కల ప్రేమికులు. కుక్క సగటు జీవితం 15 నుండి 16 సంవత్సరాలు మాత్రమే. కాని అది జీవించినన్నాళ్ళయినా సరే కుటుంబంలో మంచి ఆదరణ పొంది అందరిని ప్రేమిస్తుంది.
ఇక తాజాగా, ప్రతివారూ తమ కుక్కలకు మననుషుల పేర్లు పెట్టుకోవడం, పిల్లలకు వేసే డ్రస్ లే వేయడం, కళ్ళద్దాలు పెట్టడం, వాటికొరకు ఆరోమా ధిరపీలు, స్పా లలో వినోదాలు, రిసార్టులు ఎన్నో సౌకర్యాలను ఏర్పరుస్తున్నారు. నిజంగా, కుక్కకు కూడా లేని ప్రేమ దానిపట్ల ఎంతో ఆదరణ చూపుతున్న మనిషికి వుందని చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications