Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
టపాసులు పేలితే..ఇంటి కుక్కలు జాగ్రత్త!

అసలు డాగ్ కేర్ లో భాగంగా దానికి పప్పీగా వున్నప్పటినుండే నలుగురితో కలసి తిరగటం, వివిధ రకాల ధ్వనులను వినటం, రకరకాల వ్యక్తులతో అనుభవం వంటివి నేర్పించండి. దీనితో దానికి కొంత ఆందోళన తగ్గుతుంది. అయినప్పటికి కొన్ని కుక్కలు టపాసులు పేలితే ఆందోళన చెందుతాయి. కనుక వీలైనంతవరకు వీటికి తగిన భధ్రతా చర్యలు చేపట్టండి. సాధారణంగా క్రేకర్లపై మనం మన పిల్లలకు ఎలా వివరిస్తామో, అదే విధంగా మీ పెంపుడు కుక్కకు కూడా భయం పోయేటందుకు కొంత శిక్షణ నివ్వండి.
క్రేకర్లు కాల్చే రోజున పగటిపూటే మీ కుక్కను వాకింగ్ కు తీసుకెళ్ళండి. క్రేకర్లు కాల్చేముందు దానిని ఇంటి లోపల ఒక గదిలో పెట్టేయండి. బయటకు రాకుండా చూడండి. కిటికీలు మూయండి, వెలుగులు పేలుడు కనపడకుండా కర్టెన్లు వేయండి. టెలివిజన్ లేదా రేడియోలను గరిష్ట శబ్దం పెట్టండి. టి.వి. చూడటం అలవాటున్న కుక్కలయితే, ఇక సందడి చేయవు.
లేదా మీ కుక్కలను ధ్వనులు వినకుండా వేరే విధంగా దానితో ఆడటం లేదా మరో చర్య చేయటం చేయండి. అది భయపడుతూంటే, ఓదార్చకండి. మీ చర్య దానిని మరింత భయపడేలా చేస్తుంది. సాధారణంగా వుండేలా చూడండి. భయంగా చూడకుండా అది ధ్వనులకు సాధారణంగా వుంటే, దానికో బిస్కట్ వంటి తిండి పదార్ధాన్ని బహుమతిగా పెట్టండి. భయపడినందుకు దానిని శిక్షించవద్దు. మీ కుక్కకు భద్రతగా ఒక స్ధలాన్ని చూపించి అది అందులో దాక్కునేలా చేయండి. క్రేకర్ల కాల్పులు పూర్తయ్యేటంతవరకు ఇక దానిని డిస్టర్బ్ చేయవద్దు.



Click it and Unblock the Notifications