Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెంపుడు జంతువులకు జాగ్రత్తలు!

మీ పెంపుడు జంతువులను వీలైనంత వరకు ఇంటిలోపలే వుంచండి. బయట వుంచితే వాటికి వ్యాధులు వచ్చే ప్రమాదం వుంది. వింటర్ సీజన్ లో అవి బయట వుంటే, ఇతర కుక్కలు కూడా వచ్చి వాటితో చేరే అవకాశం వుంది. చలికాలంలో కుక్కలకు మంచు కారణంగా వాసనా శక్తి తగ్గుతుంది. మంచు అధికంగా పడుతూంటే, అవి బయటకు వెళితే మరల దోవతప్పే అవకాశం కూడా వుంది. కనుక మీ పెంపుడు కుక్కలకు గుర్తింపు బిళ్ళలు కట్టండి.
బయటనుండి ఇంటిలోపలికి వచ్చిన తర్వాత వాటి కాళ్ళను, పొట్ట భాగాన్ని తడి, మంచు వంటివి లేకుండా పూర్తిగా శుభ్రం చేయండి. దానంత అది కాళ్ళను నాకటం మొదలు పెడితే, దాని పాదాలలో చేరిన మంచులో క్రిములు దాని నోటిలోకి చేరే అవకాశం వుంది. చలికాలంలో కుక్క బొచ్చు కత్తిరించకండి. అది ఎంత దట్టంగా వుంటే దానికి అంత వేడిగా హాయిగా వుంటుంది. కుక్కను స్నానం చేయిస్తే పూర్తిగా తుడిచి పొడి ఆరిన తర్వాతే బయటకు తీసుకు వెళ్ళండి. బొచ్చు తక్కువగా వుంటే దానికి ఒక కోటు లేదా స్వెట్టర్ వంటివి పొట్ట, మెడ పూర్తిగా కవర్ అయ్యేలా వేయండి. కుక్కలకు ఈ రకమైన దుస్తులు రెడీగా మార్కెట్ లో దొరుకుతాయి.
చలికాలంలో మీ కుక్కను కారులో ఒంటిరిగా వదలి వెళ్ళవద్దు. వింటర్ లో కారు రిఫ్రిజిరేటర్ వలే పనిచేసి మీ నేస్తం గడ్డకట్టుకుపోయి చనిపోయే ప్రమాదం వుంది. మీ కుక్క కనుక ఎక్కువ సమయం బయట గడుపుతూంటే, దానికి తగిన ప్రొటీన్ ఆహారం ఇవ్వండి. బొచ్చు బాగా పెరిగి ఆరోగ్యంగా వుంటుంది. చివరగా మీ పెంపుడు కుక్క నిద్రించే స్ధలం వెచ్చగా వుండేలా చూడండి. సౌకర్యవంతమైన బెడ్ మరియు దుప్పటి వాటికి ఈ కాలంలో సరైనవే.



Click it and Unblock the Notifications