Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కుక్కలకు వచ్చే చలికాల సమస్యలు!

వింటర్ అలర్జీలు: చలికాలం వచ్చిందంటే, ఇళ్ళలో సాధారణంగా గాలి చొరని రీతిలో తలుపులు వేసేస్తాం. కుక్కలు చాలా భాగం ఇంట్లోనే వుంటాయి. కనుక వాటికి అలర్జీలు వచ్చే అవకాశం వుంది. శుభ్రంగా వున్న ఇల్లు తక్కువ తేమతో వుంటే కుక్కలకు చర్మ సంబంధిత వ్యాధులు రావు. రెడ్ స్కిన్, కాళ్ళలో దురద, పొట్ట, కాళ్ళు మంటలు మొదలైనవి కుక్కలకు చర్మ వ్యాధులు వచ్చాయని చెపుతాయి. ఇది పొడి చర్మం వలన వస్తాయి. దీనికి పరిష్కారంగా బయోటిన్ వాడాలి. మందులు వాడేముందు వెటరినరీ వైద్యుడిని సంప్రదించండి.
బొచ్చు రాలటం: బొచ్చు రాలకుండా దానిని కత్తిరించండి. ప్రత్యేకించి కాలి పాదాలకు, గోళ్ళ వద్ద కత్తిరించాలి. దానితో అక్కడ మురికి, క్రిములు చేరకుంటా వుంటాయి.
కీళ్ళనొప్పులు: చలికాలంలో కుక్కలకు కీళ్ళనొప్పులు సహజంగా వస్తాయి. వీటిని ఎముకలు విరగకుండా చూడాలి. లేదంటే సమస్య అవుతుంది. అధిక బరువున్న కుక్కలు కూడా కీళ్ళనొప్పులతో బాధపడతాయి. ఈ చలికాల ఆరోగ్య సమస్యకు పరిష్కారం వాటిని బాగా నడిపించి వ్యాయామం చేయించటం.
హైపోధెర్మియా: కుక్కలకు ఈ కాలంలో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది వాటిలో జ్వరం లేదా జలుబు వచ్చేలా చేస్తుంది. కుక్కను వేడి ప్రదేశంలో వుంచండి. దానికి ఒక కోటు లేదా మందపాటి గుడ్డ కప్పండి. సమస్య తీవ్రంగా వుంటే, చల్లదనానికి దూరం వుంచటమే కాక, వైద్యడి వద్దకు కూడా తీసుకు వెళ్ళాలి.
వేడినీరు తాగించండి: చలికాలంలో కుక్కలకు వీలైనంతవరకు అది తాగినపుడల్లా కొద్దిపాటి వేడికల నీరు తాగించాలి. దీనితో వాటికి జలుబు, దగ్గు, జ్వరం మొదలైన చిన్నపాటి వ్యాధులు రాకుండా కరూడా వుంటాయి.
చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే కుక్కలకు సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు రావు.



Click it and Unblock the Notifications