Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
వ్యక్తులపై పెంపుడు కుక్కల ఇష్టాలు!

1. కుటుంబ కుక్క: కుటుంబంలో ఒక సభ్యుడుగా వుంటూ కలసి జీవించటం, తినటం నిద్రపోవటం, చనిపోతే విచారం వెలిబుచ్చటం వంటివి చేయాలా? దీనికిగాను లేబ్ రేడర్స్, బాక్సర్స్, గోల్డెన్ రిట్రీవర్స్ లేదా డాల్మాటిసన్స్ వంటివాటిని పెంచండి. ఇవి మీ పిల్లతో ఆడతాయి. మీ భార్యకు వస్తువులు తెచ్చిస్తాయి, యజమానిని విష్ చేస్తాయి. ప్రతిఫలంగా మీ ప్రేమ తప్పించి ఏమీ కోరవు. అంతేకాదు ఇంటిలోకి కొత్తవారొచ్చినా, పిల్లలు వచ్చినా త్వరగా అంగీకరించేస్తాయి.
2. పర్సనల్ డాగ్స్: మీరు ఒంటరిగా వున్నా లేక కుటుంబ సభ్యులతో వున్నా మీవరకే ఒక కుక్క వుండాలంటే, పగ్స్, డచ్హండ్స్, చిహుహాస్ లేదా ఫ్రెంచ్ బుల్ డాగ్ లను పెంచండి. ఈ కుక్కలు తమయజమానికి మాత్రమే ప్రత్యేక ప్రేమను అందిస్తాయి. హచ్ సెల్ ఫోన్ లో చూపే పగ్ జాతి కుక్క దీనికి ఒక ఉదాహరణ. మీరు ఎక్కడకెళితే మీ కుక్క అక్కడకు వస్తుంది. మిమ్మల్ని ఎప్పటికి ఒంటిగా వదలదు.
3. గార్డ్ డాగ్స్: మీకు విధేయత, భధ్రత రెండూ కావాలనుకుంటే ఈ కుక్కను పెంచండి. అవి మీతో ఆటలాడవు. మీరు పెట్టే ఆహారానికి సేవ చేయాలనుకుంటాయి. అంతే. మాస్టిఫ్ లు, రాట్ వీలర్స్, జర్మన్ షెప్పర్డ్, డాబర్మన్ కుక్కలు మీకు మీ ఆస్తులకు ప్రాణం పోయేటంతవరకు కావలి కాస్తాయి. కాని ఎవరిని అభిమానించవు. మాస్టఫ్ లు ఇంటి యజమాని మాట మాత్రమే వింటాయి. ఇంక ఎవరి మాటా వినవు. రాట్ వీలర్స్ జాతి కుక్క ఇంటిలో పిల్లలను కూడా కరుస్తుంది. లేదా మరీ పసిగుడ్డులైతే తినటానికి కూడా సి్ధ్ధంగా వుంటుంది. ఈ కుక్కలకు సరి అయిన శిక్షణ నిస్తే తప్ప ఇంటి పెంపకానికి సరిపడవు.
కుక్కను పెంచాలనుకున్నపుడు, దాని సైకాలజీని గ్రహించటం మంచిది. ప్రత్యేకించి కుక్కల ప్రవర్తన ఎంతైనా చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications