Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కుక్కల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

వారానికి మూడు సార్లు మాంసాహారంతో కూడిన భోజనం పెట్టాలి. పెద్ద కుక్కలకు 200 గ్రాముల మాంసం, చిన్న కుక్కలకు 100 గ్రాముల మాంసం ఇవ్వాలి. ప్రతీ రోజూ ఉడకబెట్టిన కోడిగ్రుడ్లు వేయాలి. సాధారణంగా పుట్టిన దగ్గర నుంచి కుక్క పిల్లలకు నెలకు ఒకసారైనా ఏలుక పాములు, పరాన్నజీవుల నివారణకు మందులు వాడాలి. ఆరు నెలలకు మందు మార్పిడి చేయాలి. అలా చేస్తే, కుక్కలు ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కుక్కల ఆహారంలో తీపి, కారం, పులుపు,మసాలాలు లేకుండా జాగ్రత్తతీసుకోవాలి. కుక్కల శరీర నిర్మాణంలో స్వేదగ్రంధులు ఉండవు కనుక ఇలాంటి పదార్ధాలు తినడం వలన చర్మవ్యాధులు వచ్చి జూలు ఊడిపోతుంది. ఇటీవల కాలంలో కుక్కలకు కూడా షుగర్ వ్యాధి సోకి మృతిచెందుతున్నాయి. ఎక్కువశాతం షుగర్ వ్యాధితో కుక్కలు చనిపోతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
పరిశుభ్రమైన నీటిని కుక్కలకు అందుబాటులో ఉంచాలి. నెలకు 1, 2సార్లు షాంపులతో స్నానం చేయించాలి. ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా కొంతదూరం నడిపిస్తే వ్యాయామం లబించడంతో పాటు నిర్ణీత సమయంలో కాలకృత్యాలు తీర్చుకునే అలవాటు చేసుకుంటాయి. పెంపుడు కుక్కల శరీరాన్ని (వెంట్రుకలు) ప్రతీరోజు ఒకసారి దువ్వాలి. యజమానులు తమ పెంపుడు కుక్కలు మట్టి తినకుండా జాగ్రత్త పడాలి.
నెలరోజుల వయస్సులో పదిరోజులకోసారి తొలి ఆరుమాసాల వయస్సులో 15రోజులకోసారి, ప్రతీనెలకోసారి కడుపులో నులుపురుగుల నివారణకు పైపర్ జిన్, ఆల్ బెన్ జోల్ మందులను తాగించాలి. పేలు నివారించేందుకు బ్యూటాచ్ గా టిక్కాల్ ద్రవాన్ని శరీరంపై 1శాతం మందు పిచికారీ చేయాలి. 45రోజులవయస్సులో వ్యాధినోరోధక టీకా, 75రోజులకు బూస్టర్ టీకా వేయించాలి. మూడుమాసాలవయస్సులో యాంటిరాబిస్ టీకాను వేయించడం ద్వారా కుక్కకాటునుంచి మనుషులు రక్షణ పొందవచ్చు.



Click it and Unblock the Notifications