Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
దువ్వితే దానికి మజా! మనకు శుభ్రత!!

కుక్క బొచ్చు రాలినప్పటికి ఇంటిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి. చేతులు తడి చేసుకోండి, ఫర్నిచర్, మంచాలు మొదలైన వాటిపై రాయండి. వాటికున్న కుక్క బొచ్చు అంతా ఒక బాల్ లాగా చేతికి వచ్చేస్తుంది. ఈపని చేసేటపుడు చేతులకు గ్లోవ్స్ కూడా ధరించి చేయవచ్చు. లేదా తడిపిన స్పాంజి పీసుతో తుడిస్తే మరింత తేలికగా ఈ బొచ్చును ఒక చోట చేరుస్తుంది. వాక్యూమ్ క్లీనర్ తో హెయిర్ తొలగించటం కూడా తేలికే. ఇపుడు వెల్ క్రో స్ట్రాపులు బాగా అందుబాటులో వున్నాయి. ఈ స్ట్రాపులు బొచ్చు ఎక్కడున్నా తేలికగా పట్టుకుంటాయి. తర్వాత దానిని బయట శుభ్రం చేస్తే సరిపోతుంది.
ఒక్కసారి ఇల్లు ఈ రకంగా శుభ్రం చేసి, చివరకు మీ పెంపుడు కుక్కకు భయం లేకుండా వుంటే చక్కటి బ్రష్ ఒకటి వాక్యూమ్ క్లీనర్ కు తగిలించి దాని శరీరంపై లూజుగా వున్న బొచ్చును లాగేయండి. లేదా వెడల్పు పళ్ళు వున్న దువ్వెనతో ఉదయం, సాయంత్రం రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తూ వుంటే అది ఇక ఇంటిలోపల రాలే సమస్య వుండకపోవచ్చు.



Click it and Unblock the Notifications