Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పెంపుడు కుక్క - కొత్తగా పుట్టిన బిడ్డ!

కుక్క బిడ్డ వాసనలకు, ధ్వనులకు కొద్దిపాటిగా అలవాటు పడిన తర్వాత బేబీని దూరం నుండే కుక్కకు చూపుతూ పరిచయం చేయండి. బేబీని వాసన చూడటానికి ప్రయత్నించే కుక్కను తరిమేయకండి. ప్రశాంతంగా ఒక గదిలో చూపాలి. కుక్క తినే స్ధలం లేదా నిద్రించే స్ధలంలో ఈ చర్యలు చేయకండి. బేబీ దాని పరిసరాలలో వుండగా కుక్కనే ప్రశంసించండి. బేబీ రాక తనకు మంచిదని కుక్క భావిస్తుంది. బేబీ చుట్టుపక్కల కుక్క బాగానే తిరుగుతూ వుంటే, కుక్కను పొగుడుతుండడం, బిస్కట్లు పెడుతూండడం వంటివి చేయాలి. మొదటి కొద్ది నెలల పాటు బిడ్డ మీ చేతుల్లో వుండగా బిడ్డతో కుక్క నియంత్రణలో వుండి వాసనలు చూడటానికి అనుమతించండి. కుక్క కొద్దిసేపు ఆసక్తిగాను మరి కొంత సేపు ఆసక్తి లేకుండాను వుంటుంది. అది వెనక్కు తగ్గే కొద్ది మీరు దానిని ప్రశంసించాలి.
కుక్కను పరిశుభ్రంగా వుంచండి. దానిని శుభ్రపరచిన తర్వాత మీ చేతులకు యాంటీ బాక్టీరియల్ సబ్బులు వాడండి. కుక్కను ఎపుడూ శిక్షించకండి. అది బేబీపై ద్వేషం పెంచుకుంటుంది. ఎవరూ లేకుండా ఎపుడూ బేబీని కుక్క వద్ద ఒక్క క్షణం కూడా వదలకండి. ఎంత మంచి కుక్కకైనా సరే ఈ నిబంధన వర్తిస్తుంది. బిడ్డ పాకేటపుడు కుక్కకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బిడ్డ పాకుతూంటే దానికి చాలా భయంగా వుంటుంది. ఒక పురుగు పాకుతోందని భావిస్తుంది. ఒక వైపు బిడ్డను, మరోవైపు కుక్కను జాగ్రత్తగా సాకటం మొదట్లో మీకు కష్టం గా వున్నప్పటికి, ఇద్దరూ కలసి కొంతకాలం పెరిగితే, తర్వాత వారిది విడదీయరాని బంధమే అవుతుంది.



Click it and Unblock the Notifications