Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ప్రాణాలు తీసే కుక్కలు!

1. పిట్ బుల్ - ఇది ఒక సంకర జాతి కుక్క. ఏ మాత్రం స్నేహపూరితం కాదు. క్రూరత్వం దాని జన్యువులలోనే వుంది. ఆ జన్యువు దానిని భయంకరంగా చేసింది. దాడి చేయటమే దాని సహజగుణం. ఎంతో అనుభవం వుంటేనే కాని దీనిని ఎంపిక చేయరాదు.
2. రాట్ వీలర్ - ఇవి జర్మన్ జాతి కుక్కలు. వీటిని బుచ్ఛర్ డాగ్స్ అని కూడా పిలుస్తారు. వీటిని బుచ్చర్లు అంటే మాంస ఖండాలను నరికేవారు తమ మాంసపు బండ్లను ఇతర ప్రదేశాలకు తరలించేటపుడు వీటిని వాడేవారు. కొన్ని దేశాలు వీటిని ప్రమాదకర కుక్కలుగా నిషేధించినప్పటికి అవి చాలా విశ్వాసమైనవి. జరిగే ప్రమాదాలు వాటిని సరిగా హేండిల్ చేయకపోవటంవలననే జరుగుతున్నాయి.
3. జర్మన్ షెప్పర్డ్ - ప్రపంచంలో ని భయంకరమైన కుక్క జాతి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. పోలీసులు, మిలిటరీ బలగాలు వీటిని వాసనా శక్తికిగాను వాడతారు. ఈ కుక్కల నిర్వహణ వ్యయం అధికమైనప్పటికి వాటికిగల తెలివితేటల కారణంగా అందరూ వీటిని పెంచటానికి ఇష్టపడతారు.
4. హస్కీ - ఇది సైబీరియా ఎడారుల కుక్క. బలమైనది. బండ్లు లాగటానికి ఉపయోగిస్తారు. ఇంటి పెరటి కుక్కగా పనిచేయటానికి ఇష్టపడదు. ఏ మాత్రం పెంపకానికి అనువైనది కాదు.
5. చౌ చౌ - దీని ఆకారమే చిన్న సింహంలా వుంటుంది. బయటివారనేటప్పటికి అవే దూరంగా వుండటానికి చూస్తాయి. సొసైటీలో ఏ మాత్రం ఇమడటానికి ప్రయత్నించవు. చిన్న పిల్లను తెచ్చి ఇతర కుక్కలతో స్నేహం చేయిస్తే కొంత మేరకు పెంపుడు కుక్కగా మారేందుకు అవకాశం వుంది.
ప్రపంచంలోని ప్రభుత్వ సంస్ధలు కొన్ని ఈ జాతుల కుక్కలను అత్యంత హానికర కుక్కలుగా ప్రకటించాయి. అయితే కఠినమైన శిక్షణలతో వీటిలో కొన్ని జాతులను లొంగదీసి పెంపుడు కుక్కలుగా మార్చవచ్చు.



Click it and Unblock the Notifications