Latest Updates
-
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా!
అబ్బుర పరచే అధ్భుత చేష్టలు!!

ఇంటిపట్టునే వుండే ఈ పొమేరియన్ జాతి కుక్క చాలా చురుకైనది, శక్తికలది. ఆటలంటే ఎంతో ఇష్టం. వాటిలానే వాటి యజమానులు కూడా సంతోషంగా వుండాలని అవి కోరుకుంటాయి. అవి తమను ప్రేమించాలని, వాటి బొచ్చు దువ్వుతూ నిమరాలని ఎపుడూ కోరుకుంటాయి. వీటి వ్యాయామాలు, శిక్షణలు ఎలా వుండాలంటే.....
1. వీటికి శిక్షణ నివ్వాలంటే మీ తోట ప్రదేశం చాలు. ఇవి రెగ్యులర్ గా నడిస్తే చాలు వ్యాయామమే. ఇవి చాలా తెలివైన కుక్కలు, ఎపుడూ కొత్తదనం కొరకు వెతుకుతూనే వుంటాయి కనుక శిక్షణ కష్టమేమీ కాదు.
2. పొమేరియన్లకు అతిగా మొరిగే అలవాటుంది కనుక దానిని మాన్పించటానికిగాను మన కమాండ్స్ అలవాటు చేయాలి. సిట్, స్టాండ్, వెయిట్, స్టాప్, కం, మొదలైన చిన్న పదాలను నేర్పించాలి. పిల్లలతోను ఇతర కుటుంబ సభ్యులతో కలసిపోయేలా చేయాలి. మీ స్నేహితులను కూడా వాటితో ఆడమని చెప్పండి. ఇంటిలో రంగు రంగుల కేండిల్స్ పెట్టి వెతకమనండి.
3. వీటికి కొద్దిపాటి ఆహారం చాలు. ప్రతి ఆహారం తర్వాత వాకింగ్ చేయించండి. చించుతూ లేదా ఏదైనా వస్తువులు పాడు చేస్తుంటే వాటి చూపు మరల్చి నిద్రపుచ్చండి.
4. వీటికి అధిక వ్యాయామం అవసరం లేదు. వయసులో పెద్దవైతే లోషుగర్ వచ్చే ప్రమాదం వుంది. ఇంట్లోనే లేదా చిన్న నడక చాలు.
5. వీటిలోనే ఒక వెరైటీ కుక్కలకు నడక కూడా అవసరం లేదు. ఇంటిలో మెట్లు ఎక్కితే చాలు.
6. ఫ్రిస్ బీ, రంగుల బంతులు మొదలైనవి ఈ కుక్కకు ఆడుకునే ఆనందమిస్తాయి.



Click it and Unblock the Notifications