Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
అందరూ ఆనందించే గోల్డెన్ రిట్రీవర్!

కుక్క బొచ్చును వారానికి మూడు రోజులు ప్రతిసారి ఒక అయిదు నిమిషాలు చక్కటి దువ్వెనతో దువ్వండి. లూజుగా వున్న బొచ్చు పడిపోతుంది. తరచుగా దువ్వుతూ వుంటే జుట్టు ఇంట్లో ఎక్కడపడితే అక్కడ రాలకుండా వుంటుంది. బాగా దువ్విన తర్వాత కుక్కలకొరకు తయారు చేసే మంచి షాంపూతో కుక్కకు స్నానం చేయిస్తే బొచ్చు రాలటం బాగా తగ్గుతుంది. బొచ్చు పూర్తిగా షేవ్ చేసేయకండి. సాధ్యమైనంత ట్రిమ్మింగ్ చేయాలి. బొచ్చు రాలకుండా వుండాలంటే కుక్కకు ఇచ్చే ఆహారంలో రెండు చుక్కలు ఆలివ్ నూనె వేయవచ్చు. కుక్క కనుక వాక్యూమ్ క్లనర్ కు భయపడకపోతే, మెత్తటి బ్రష్ క్లీనర్ కు తగిలించి దాని శరీరంనుండి లాగేయవచ్చు.
బొచ్చు రాలుతోందంటే సరైన పోషణ కూడా కలిగి లేదని అనుకోవచ్చు. మంచి నాణ్యత గల ఆహారం ఇవ్వటమే కాక, దానికి చేపనూనె, ఒమెగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఇచ్చి బొచ్చు రాలటాన్ని అరికట్టవచ్చు. గోల్డన్ రిట్రీవర్ జాతి కుక్కలకు బొచ్చు రాలటం సహజం. కాని ఈ బొచ్చు ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కనపడుతూంటే చికాకుగా వుండగలదు. అందుకని పైన చెప్పిన చర్యలు పాటించి, మీ పెంపుడు కుక్కనేస్తంలో గల ఆనందాన్ని అధికం చేసుకోండి.



Click it and Unblock the Notifications