Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
సైలెంట్ కుక్కలు - ఆనందించే యజమానులు!

1. బాసెంజీ - ఇది ఒక వేట కుక్క. రాయల్ బ్రీడ్. ఈజిప్టుకు చెందినది. పిల్లలను అమితంగా ప్రేమిస్తాయి. ఏది కనపడినా దానిని నమిలి తినే అలవాటు కనుక వీటికి సరైన వాక్సినేషన్ అవసరం. దీనికి చిన్నతనం నుండే కుటుంబ సభ్యుల అలవాటు చేయాలి. ప్రశాంతంగా వుంటాయి. కాని వాటిపట్ల కఠినంగా ప్రవర్తిస్తే, యజమానైనా సరే అంతు చూస్తాయి. ఆహారం...కుక్క ఆహారమైతే చాలు. నమలటానికి స్టెరిలైజ్ చేసిన ఎముకలు ఇవ్వాలి.
2. బోర్జోయి - దీనినే రష్యన్ వోల్ఫ్ హౌండ్ అంటారు. వీటికి మంచి మర్యాద తెలుసు. యజమానికి ఎంతో గౌరవం ఇస్తాయి. కుటుంబ సభ్యులకు ప్రేమనందిస్తాయి. వీటికి చలి ప్రదేశాలు కావాలి. బొచ్చు అధికం కనుక ఎపుడూ దువ్వుతూండాలి. ప్రశాంతంగా వుంటాయి. బయటివారిని చూస్తే సిగ్గుపడి రిజర్వుడుగా వుంటాయి. వీటికి నడక బాగా కావాలి. సైకిలు వెనుక పరిగెత్తటం వంటి వ్యాయామం మంచిది. ఆహారం తక్కువ కొవ్వు కల కుక్క ఆహారం ఇవ్వాలి.
3. అకిత - కుటుంబ సభ్యులతో సరళంగా వుంటాయి. చాలా బలిష్టమైన కుక్క. తిండి అధికం. నడక, పరుగు చేయిస్తే వాటికి చాలా సంతోషం. అతిగా మొరగవు. బొచ్చు అధికం, సంవత్సరానికి రెండు సార్లు ఊడుతుంది. రెగ్యులర్ గా దువ్వాలి.



Click it and Unblock the Notifications
