Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పెంపుడు కుక్కలతో పిల్లలు..జాగ్రత్త...

ముఖ్యంగా చిన్న పిల్లలు వాటితోనే ఎక్కువసేపు గడుపుతుంటారు. వాటిని ముద్దు పెట్టుకుంటారు. ఎక్కడికెళ్లినా తమ వెంటే తీసుకెళ్తుంటారు. మూగ జీవాల పట్ల ప్రేమ చూపించడం తప్పుకాదు. అయితే వాటికి అతి సన్నిహితంగా ఉండడం వల్ల మనకు కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశముంది. అందుకే వాటిని ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలి. అప్పుడు వాటి ఆరోగ్యానికీ మన ఆరోగ్యానికీ ఎటువంటి హానీ ఉండదు. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
1. ప్రతిరోజూ పెంపుడు జంతువులకు డెటాయిల్ వేసిన నీళ్లతో శుభ్రంగా స్నానం చేయించాలి.
2. వాటికి టీకాలు వేయించి డాక్టర్ సలహాతో మధ్యమధ్యలో వైద్యం చేయిస్తూ ఉండాలి.
3. వాటికి ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించి దాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి.
4. అవి తిని వదిలేసిన ఆహార పదార్థాలను ఇంటికి దూరంగా పడేసి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.
5. అవి ఒక సమయానికి మలమూత్ర విసర్జన చేసేట్టు అలవాటు చేయాలి. అందుకోసం ఇంటికి దూరంగా తీసుకెళ్లాలి.
6. పరిసర ప్రాంతాలలోనే ఆ పని కానిచ్చేస్తే వాటిలోని మలిన కణాలు గాలిలో కలిసి మనుషులకు రోగాలు సంక్రమించే ప్రమాదముంది.
7. వాటి లాలాజలం మన శరీరంమీద గానీ, పుండ్లమీద గానీ పడకుండా జాగ్రత్తపడాలి.
8. అంతేకాదు గోళ్లలో మట్టి చేరకుండా చూసుకోవాలి.
9. చిన్న పిల్లలు ఎక్కువగా వాటి మూతితో, నాలుకతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో అవి కరవడం కానీ, గీరడం కానీ చేస్తుంటాయి. కాబట్టి చిన్నారులను వాటికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. చిన్నపిల్లలు కుక్కలతో ఆడేటపుడు నోట్లో చేతులు పెట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.
10. వాటికి ఏమాత్రం వ్యాధి సోకినట్టనిపించినా దూరంగా ఉండడమే మంచిది. పెంపుడు కుక్కలకు తప్పక రాబిస్ నిరోధక టీకాలు వేయించాలి.



Click it and Unblock the Notifications
