Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
పెంపుడు కుక్కలకూ వేపనూనెతో ప్రయోజనాలు..!?

పెంపుడు కుక్కల చర్మ సంరక్షణకు వేపనూనె, సహజ నివారణ మార్గం అని చెప్పవచ్చు. వేపనూనె క్రిమిసంహారక మరియు ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉంటుంది. యాంటీ సెప్టిక్ లక్షణాలు మెండుగా ఉండే వేపాకు మంచి ఆస్ట్రిజెంట్‌గా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇది చర్మం సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. కుక్కల చర్మం సంరక్షణలో వేపాకు ప్రయోజనాలేంటో చూద్దాం...
1. వేపనూనెను కుక్కలకు రాయడం ద్వారా చర్మం ఇన్ఫెక్షన్, అలర్జీలు, అంటువ్యాదులు సోకకుండా కాపాడుతుంది. కుక్కకు రోగనిరోధక శక్తిని అందిస్తుంది. చర్మాన్నిమరియు పళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెంపుడు కుక్క ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండి మంచి వాసనతో ఉండేట్లు చేయడానికి ఏదైనా ఒక నూనెలో వేపనూనె చేర్చి వాటి శారీరానికి రాయాలి.
2. కుక్కలు ఎప్పుడు ఫ్రెష్ గా, సురక్షితంగా ఉండేందుకు వేపనూనెతో తయారు చేసినటువంటి షాంపూలను ఉపయోగించాలి. సాధారణంగా కుక్కలకు ఉపయోగించే పెట్ షాంపూలో రెండు టేబుల్ స్పూన్ల వేపనూనె వేసి వారానికి రెండు మూడు సార్లు స్నానం చేయించాలి. ఇలా చేయడం వల్ల పెంపుడు కుక్కలకు అనవసరమైన బొచ్చు పెరగకుండా చేసి ఉన్నటువంటి బొచ్చును బలపడేవిధంగా చేసి, చర్మ వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
3. పెట్స్ కోసం ప్రత్యేకం పెట్స్ కోసమే తయారు చేసినటువంటి నీమ్ సోప్స్ మార్కెట్లో దొరుకుతాయి. వేపతో తయారు చేసిన సోపులు కుక్కలకు సురక్షితంగా ఉండేలా చేస్తుంది. పెంపుడు కుక్కల చర్మంపై గజ్జి, చర్మం దద్దుర్లు, అంటువ్యాదులు రాకుండా సహాయపడుతుంది.
4. ఎన్నో ఔషద గుణాలున్న వేపఆకులను కొన్నింటిని కుక్కకు ఇచ్చే ఆహారంలో అప్పడప్పుడు చేర్చుతుండాలి. వేపాకలు చర్మ రక్షణకే కాకుండా, రక్తాన్ని శుభ్రపరిచి, కాలేయం బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. పేగే పరాన్నజీవులను హరించి, నిగనిరోదకశక్తి బలపడుతుంది. వేపాకులకు కొద్దిగా పసుపు చేర్చి మొత్తటి పేస్ట్ లా చేసి కుక్క శరీరాని రాశి శుభ్రపరిస్తే పెంపుడు కుక్కలకు సహజంగా వ్యాపించేటటువంటి గజ్జి అతి సులువుగా పోగుడుతుంది.
5. కుక్క పాదాలను, చర్మాన్ని అప్పుడప్పుడు పరిశీలిస్తుండాలి. పెంపుడుకుక్క దులిపుకోవడం, గీరుకోవడం, అరవడం వంటి చేస్తుంటే..చర్మం ఇన్ఫెక్షన్ కు గురైందని పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే వేపనూనె రాయడం లేదా స్ప్రేలా చల్లడం ద్వారా ఇన్ఫెక్షన్ ఇతర శరీర భాగాలకు వ్యాప్తి చేందకుండా నిరోధిస్తుంది.
6. పెంపుడు కుక్కకు స్నానం చేయించే నీళ్ళల్లో వేపనూనెను చేర్చితే మంచి ఫలితం ఉంటుంది.
కుక్కవయస్సు, బరువు ఆధారంగా మార్కెట్లో వేపతో తయారు చేసిన షాంపూలు, సోపులు, నూనెలో అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు కుక్క నివసించే ప్రదేశం, వాటికి వేసి మాట్లు, తివాచీలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూసుకవాలి. వేపనూనెను కుక్క ఆట్లాడే లాన్ లోనూ చల్లుకొంటే ఎంటువంటి ఇన్ఫెక్షన్లు బారిన పడకుండా సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications