For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలతో సరిసమానంగా పెట్స్ కూ ఇవ్వండి సోయా...

|

Can Pet dogs have Soya Produts...
మనుషులకు చాల ఇష్టం అయిన జంతువులు కుక్క పిల్లలు. పెట్స్ ను పెంచుకునే వారు చాల మంది ఉంటారు. అయితే వాటి పెంపకంలో చాల జాగ్రతగా ఉండాలి. వాటికి పెట్టే ఆహారంలో చాల జాగ్రతలు తీసుకుంటే వాటి ఆరోగ్యం బాగుటుంది. ఇంటిలో మన పిల్లలను ఎలా పెంచుకొంటాం అలాగే పెట్స్ ను పెంచుకోవాలి. మనం తినే అన్నం. చపాతితో పాటు తినుబండారాలు పెట్ట వచ్చు. సోయా బీన్ బీన్స్ తో పాటు సోయా ఉత్పత్తులు పెట్టడం చాల మంచింది. తక్కువ ఖర్చుతో వాటి పెంపకం సులభం అవుతుంది. ఉడికించిన గింజలకు సోయా పౌడర్ కలిపి పెడితే చాల మంచింది. టీవీలలో పెట్స్ పెంపకం కొసం చూపించే అన్నిపదార్థాలు పెట్టడం మంచిది కాదు.

పిల్లల కోసం టీవీలలో చూపించే అన్ని మనం కొని పెట్టం అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి అవి అవసరమా అని ఆలోచిస్తాం. పెట్స్ విషయంలో కూడా అంతే మరి. చాల మంది కుక్క పిల్లలను పెంచుకొవడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే వాటిని చిన్నతనంలోనే తీసుకురావాలని చాలమంది బావిస్తారు. అది చాలపోరబాటు. ఒక నెలలోపు ఉన్న కుక్క పిల్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. రెండు నెలలోపు ఉన్న కుక్క పిల్లలను తీసుకురాకూడదు. ఎందుకంటే ఆసమయంలో అవి తల్లి పాలు తాగాలి. రెండు నెలలు తరువాత కుక్క పిల్లలను పెంపకానికి హాయిగా తీసుకురావచ్చు.

రెండు నెలల నుండి ఒక సంవత్సరం వరకు పెట్స్ గ్రోత్ పీరియడ్. ఆ సమయంలో వాటికి అల్లరి చాలాఎక్కువ. రెండు నెలలు నుండి ఆరు నెలల వరకు ఉండే పెట్స్ కు రోజుకు ఐదు సార్లు ఆహారం పెట్టాలి. ఆరు నెలల వచ్చిన పెట్స్ కు మూడు సార్లు ఆహారం పెట్టాలి. 8 నెలలు దాటిన పిల్లలకు రెండు సార్లు ఆహారం ఇస్తే సరిపోతుంది. పెట్స్ తో పాటు జంతువులను పెంచే సమయంలో వాటికి ఫుడ్ టైంటేబుల్ పాటించడం చాల అవసరం. పెంపెడు జంతువులతో ఎర్పడే అనుబందంతో వాటికి ఎప్పుడు ఆకలి అవుతుంది, ఎంత ఆహారం ఇవ్వాలి అనే విషయం మనకు అర్థం అయిపోతుంది. పెట్స్ ను పెంచడంలో మనం నిర్లక్షం చేస్తే చాల కష్టం అనే విషయం గుర్తు పెట్టుకొవాలి.

English summary

Can Pet dogs have Soya Produts... | పెట్స్ కూ కావాలి ఫుడ్ టైమ్ టేబుల్...


 The health risks associated with soy products far outweigh any potential benefit, which is why pet owners should avoid exposing their dog. Soy is considered a high risk allergen for dogs and often they are or develop sensitivities to soy products
Story first published:Wednesday, September 12, 2012, 14:13 [IST]
Desktop Bottom Promotion