For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్స్ అనారోగ్యంగా ఉన్నాయని ఎలా గుర్తుపట్టడం....?

|

How to find Pets are ill health...?
సాదారణంగా పెట్ కి అనారోగ్యం వచ్చిందన్న విషయం తెలుసుకోవడం చాలా తేలిక. పెట్స్ గురించి బాగా తెలిసినవాళ్లు, వాటిని కొన్ని సంత్సరాలుగా పెంచుకొని అనుభం కలిగిన వాళ్లు వెంటనే ‘ఇది రోజూలాగ లేదే' అని గుర్తుపట్టేస్తారు. ముఖ్యంగా పెట్స్ కి అనారోగ్యం చేస్తే రోజూ కనిపించే హుషారు, చలాకీతనం ఉండవు. పిలిచినా పలకవు, ఆడువకోవు. రోజూ అవి ఇష్టంగా మసులుకునే వ్యక్తులు పిలిచినా స్పందించవు. ఒక మూల ముడుచుకుని పడుకుంటాయి. ఎప్పుడూ తడిగానే ఉండే ముక్కు, అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం పొడిగా మారుతుంది.

పెట్స్ వచ్చే సాధారణ అనారోగ్యాలు స్టమక్ అప్ సెట్, జ్వరం వంటివే, స్టమక్ అప్ సెట్ అయితే దానికి అదే నయం చేసుకుంటుంది. జీర్ణవ్యవస్థ యథా స్తితికి వచ్చిన తర్వాత మాత్రమే ఆహారాన్ని ముట్టుకుంటుంది. ఏ అనారోగ్యమైనా సరే వెటర్నరీ డాక్టర్ ను సంప్రదించాల్సిందే తప్ప సొంత వైద్యాలు చేయకూడదు. కాబట్టి మీరు అడినట్లు ముందులు, ఇంజక్షన్లను సూచించడం సాధ్యం కాదు.

ఇక మీరు అడిగిన మరో అంశం క్రాసింగ్ వయసు గురించి.... ఆడకుక్కలు ఎనిమిది నెలలకు హీట్ కు వస్తాయి, కానీ ఈ వయసులో క్రాస్ చేయించరాదు. ఒకటిన్నర సంవత్సరం నిండిన తర్వాత క్రాస్ చేయించాలి. హీట్ వయసు వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి హీట్ కి వస్తాయి. కానీ ప్రతి ఆరునెలలకు క్రాస్ చేయించడం మంచిది కాదు. సవంత్సరానికి ఒకసారి క్రాస్ చేయించడం ఆరోగ్యకరం. మగకుక్కలకు హీట్ ఉండదు. కానీ ఒకటిన్నర ఏడాది నిండిన తర్వాత మాత్రమే క్రాస్ ని ప్రోత్సహించాలి.

ఆడ పెట్ డాగ్ ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటి లేదా రెండు డెలివరీల తర్వాత ఆపరేషన్ చేయించాలి. ఆడకుక్క గర్భం దాల్చిన తర్వాత 60 రోజులకు డెలివరీ అవుతుంది. రెండు నెలల వరకు పప్పికి పాలిస్తుంది. పాలివ్వడం ఆపిన తర్వాత ఆరు నెలలకు మళ్లీ హీట్ కు వస్తుంది.

English summary

How to find Pets are ill health...? | పెట్స్ కు అనారోగ్యం చేస్తే...?

To keep your pet in good condition it must be fed a healthy diet and allowed regular exercise. Mental
 stimulation in the form of an interesting environment and opportunities to play are also important. The
 closer your pet's diet and environment is compared to how it would eat and live in the wild, the healthier
 and happier it will be.
Story first published:Monday, August 6, 2012, 9:39 [IST]
Desktop Bottom Promotion