Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
పెట్స్ ను చంటిపిల్లా చూసుకోవడం ఎలా..

1. మనం ఇంట్లో పెంచుకొనే పెంపుడు జంతువులు నీరు తాగడానికి సాధారణంగా ప్లాస్టిక్ బౌల్స్ లేదా మెటల్ బౌల్స్ వాడుతుంటాం. అలా చేయకూడదు ఎందుకంటే విపరీతమైన చలి ఉన్నప్పుడు పాత్ర చల్లబడుతుంది. అందులో నీరు కూడా తాగలేనంత చల్లగా మారతాయి. అలాగే విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు ఆ పాత్ర వేడెక్కి నీరు కాగిపోతుంటాయి. ప్లాస్టిక్ బౌల్స్ లో నీరు వెచ్చబడి ప్లాస్టిక్ వాసన వస్తుంది. కాబట్టి నీటిని తరచూ మార్చడం లేదా ఫైబర్ వాటర్ బౌల్ వాడడం మంచిది.
2. పెట్ డాగ్స్ తమ ప్రకృతి అవసరాలను ఏదో ఒక రకంగా తెలియచేస్తాయి. వాటిని గమనించి ఆ టైమ్ లో బయటకు తీసుకెళ్లాలి. ఆ టైమ్ లో పెట్ డాగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ గొలుసు లేకుండా బయటకు వదల కూడదు. ఉదయం కాలకృత్యాల నుంచి ఆహారం, వాకింగ్ వరకు అన్నింటికీ నియమిత వేళలు, క్రమపద్ధతి అలవాటు చేయాలి.
3. పెట్ డాగ్ కార్పెట్ మీద మూత్రవిసర్జన చేసినప్పుడు..వెంటనే పేపర్ టవల్ లేదా పాత న్యూస్ పేపర్ ఒత్తుగా వేయాలి. మూత్రాన్ని పేపర్ పీల్చుకున్న తర్వాత తీసి వేసి తేమ మీద బేకింగ్ సోడా చల్లి కొద్ది సేపు అలాగే ఉంచి తర్వాత కార్పెట్ ను దులపాలి. సోడా బై కార్బనేట్ తేమతోపాటు మూత్రం దుర్వాసనను కూడా వదిలిస్తుంది.
4. సాధారణంగా వాకింగ్ కు ఉదయం మంచు వదిలేలోపు లేదా సాయంత్రం ఎండతగ్గగానే తీసుకు వెళ్తుంటారు. ఇక్కడ జరిగే పొరపాటు ఏమిటంటే... ఫుట్ పాత్ చలికి పాదం మోపలేనంత చల్లగా ఉందేమో, ఎండకాలంలో కాలు పెట్టలేనంత వేడిగా ఉందేమోనని గమనించకపోవడం. పైగా అవి నడవడానికి మొరాయిస్తుంటే వాకింగ్ ను ఇష్టపడడం లేదని పొరబడుతుంటారు. దీనికి పరిష్కారం... మనం చెప్పులు వదిలి పాదాన్ని నేల మీద పెట్టి పరీక్షించుకోవడమే ఉత్తమం.
5. ఒక్కోసారి పెట్ డాగ్స్ యజమానికి అందకుండా ఇల్లంతా పరుగెడుతూ అల్లరి చేస్తుంటాయి. కొంత సేపు అల్లరి బావుంటుంది కానీ ఎక్కువ సేపు భరించాల్సి వచ్చినప్పుడు యజమాని సహనం కోల్పోవచ్చు. వాటి వెంట పడి దొరికించుకున్న తర్వాత ఆ కోపంలో వాటిని కొట్టకూడదు. అలా చేస్తే భయపడిపోయి మామూలుగా పిలిచినప్పుడు కూడా దగ్గరకు రావడానికి సంకోచిస్తాయి. వాటి అల్లరి మీకు ఇబ్బంది కలిగించింది అని తెలియచేయాలనుకుంటే కొద్ది సేపు అలకబూనవచ్చు కానీ కొట్టకూడదు.
6. పెట్ కి సమయానికి వ్యాక్సిన్లు వేయించడం, తగిన ఆహారం ఇవ్వడం, స్నానం చేయించడంతోపాటు వాటికి బోర్ కొట్టకుండా చూసుకోవాలి. బొమ్మలతో ఆడుకోవడం అలవాటు చేస్తే... రోజంతా ఎవరో ఒకరు వాటి కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉండదు.



Click it and Unblock the Notifications