For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్స్ ను చంటిపిల్లా చూసుకోవడం ఎలా..

|

How to take Care of Your Pet...
సాధారణంగా మనం ఇంట్లో పెంచుకొనే పెంపుడు జంతువులు ఆత్మీయతకు చిహ్నాలు. ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఎవరూ లేకపోయినా ఒక పెట్ యానిమల్ ఉంటే చాలు అన్నంతగా మనుషులతో కలిసిపోతాయి. ప్రేమను పొందడం..పంచడం రెండూ తెలిసిన ఈ జీవులను చక్కగా చూసుకోవడం ఓర్పు నేర్పుతోకూడిన బాధ్యత. అందుకు కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని మెళకువలు...

1. మనం ఇంట్లో పెంచుకొనే పెంపుడు జంతువులు నీరు తాగడానికి సాధారణంగా ప్లాస్టిక్ బౌల్స్ లేదా మెటల్ బౌల్స్ వాడుతుంటాం. అలా చేయకూడదు ఎందుకంటే విపరీతమైన చలి ఉన్నప్పుడు పాత్ర చల్లబడుతుంది. అందులో నీరు కూడా తాగలేనంత చల్లగా మారతాయి. అలాగే విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు ఆ పాత్ర వేడెక్కి నీరు కాగిపోతుంటాయి. ప్లాస్టిక్ బౌల్స్ లో నీరు వెచ్చబడి ప్లాస్టిక్ వాసన వస్తుంది. కాబట్టి నీటిని తరచూ మార్చడం లేదా ఫైబర్ వాటర్ బౌల్ వాడడం మంచిది.

2. పెట్ డాగ్స్ తమ ప్రకృతి అవసరాలను ఏదో ఒక రకంగా తెలియచేస్తాయి. వాటిని గమనించి ఆ టైమ్ లో బయటకు తీసుకెళ్లాలి. ఆ టైమ్ లో పెట్ డాగ్‌ ను ఎట్టి పరిస్థితుల్లోనూ గొలుసు లేకుండా బయటకు వదల కూడదు. ఉదయం కాలకృత్యాల నుంచి ఆహారం, వాకింగ్ వరకు అన్నింటికీ నియమిత వేళలు, క్రమపద్ధతి అలవాటు చేయాలి.

3. పెట్ డాగ్ కార్పెట్ మీద మూత్రవిసర్జన చేసినప్పుడు..వెంటనే పేపర్ టవల్ లేదా పాత న్యూస్ పేపర్ ఒత్తుగా వేయాలి. మూత్రాన్ని పేపర్ పీల్చుకున్న తర్వాత తీసి వేసి తేమ మీద బేకింగ్ సోడా చల్లి కొద్ది సేపు అలాగే ఉంచి తర్వాత కార్పెట్‌ ను దులపాలి. సోడా బై కార్బనేట్ తేమతోపాటు మూత్రం దుర్వాసనను కూడా వదిలిస్తుంది.

4. సాధారణంగా వాకింగ్‌ కు ఉదయం మంచు వదిలేలోపు లేదా సాయంత్రం ఎండతగ్గగానే తీసుకు వెళ్తుంటారు. ఇక్కడ జరిగే పొరపాటు ఏమిటంటే... ఫుట్‌ పాత్ చలికి పాదం మోపలేనంత చల్లగా ఉందేమో, ఎండకాలంలో కాలు పెట్టలేనంత వేడిగా ఉందేమోనని గమనించకపోవడం. పైగా అవి నడవడానికి మొరాయిస్తుంటే వాకింగ్‌ ను ఇష్టపడడం లేదని పొరబడుతుంటారు. దీనికి పరిష్కారం... మనం చెప్పులు వదిలి పాదాన్ని నేల మీద పెట్టి పరీక్షించుకోవడమే ఉత్తమం.

5. ఒక్కోసారి పెట్‌ డాగ్స్ యజమానికి అందకుండా ఇల్లంతా పరుగెడుతూ అల్లరి చేస్తుంటాయి. కొంత సేపు అల్లరి బావుంటుంది కానీ ఎక్కువ సేపు భరించాల్సి వచ్చినప్పుడు యజమాని సహనం కోల్పోవచ్చు. వాటి వెంట పడి దొరికించుకున్న తర్వాత ఆ కోపంలో వాటిని కొట్టకూడదు. అలా చేస్తే భయపడిపోయి మామూలుగా పిలిచినప్పుడు కూడా దగ్గరకు రావడానికి సంకోచిస్తాయి. వాటి అల్లరి మీకు ఇబ్బంది కలిగించింది అని తెలియచేయాలనుకుంటే కొద్ది సేపు అలకబూనవచ్చు కానీ కొట్టకూడదు.

6. పెట్‌ కి సమయానికి వ్యాక్సిన్లు వేయించడం, తగిన ఆహారం ఇవ్వడం, స్నానం చేయించడంతోపాటు వాటికి బోర్ కొట్టకుండా చూసుకోవాలి. బొమ్మలతో ఆడుకోవడం అలవాటు చేస్తే... రోజంతా ఎవరో ఒకరు వాటి కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉండదు.

English summary

How to take Care of Your Pet... | పెంపుడు జంతువులు పెంపకం ఎలా...

Taking care of your pet can be an almost full time job that needs dedication, a sense of responsibility and love. Here is some advice for pet owners to guarantee a lifelong pleasant experience for both pet and owner.
Story first published:Thursday, February 23, 2012, 15:55 [IST]
Desktop Bottom Promotion