Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆకర్షించే చేపల వలలో పడకండి...!

అక్వేరియం అనగానే పెద్ద పెట్టెలాగానే ఉండనవసరం లేదు... గాజు పాత్ర అయినా చాలు. ఇంట్లో వసతిని బట్టి, మన సమయం కేటాయింపు, బడ్జెట్‌కు తగిన విధమైనవి తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్న పాత్ర పరిమాణం నుంచి పెద్ద గాజు తొట్టె వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. విభిన్నమైన జాతులు, అనేక రంగుల్లో చేపలు మురిపిస్తున్నాయి. కాకపోతేవీటి విషయంలో మెలకువలు తీసుకోవడం చాలా అవసరం.
కొత్త చేపలను పెంచుకోవలనుకొనే వారికి ప్లాటి ఫిష్ ను పెచ్చుకోవచ్చు. వీటిని కేర్ తీసుకోవడం చాలా సులభం. ఇది మెదటి సారి ఆక్వేరియం వుంచే వాళ్ళకి అనుకూలంగా వుంటుంది (బిగినర్ ఫిష్). ఎక్కువ శ్రద్ద అవసరం లేకుండానే పిల్లలను కంటాయి. 2.5ఇన్చ్ ల వరకూ పెరుగుతాయి.వీటిని పెంచుకోవడానికి పెద్ద పెద్ద ఎక్వేరియం టాక్స్ అవసరం లేదు. మీడియం సైజ్ టాంకులు సరిపోతాయి. ప్లాటిలు చాలా రకాలు వున్నాయి. అవన్ని వివిధ రంగులలో లభ్యమవుతాయి. వీటికి ఇస్తున్న ఆహారం రొటిన్ గా కాకుండా అప్పుడప్పుడు మార్చాలి. సరియైన పొషకవిలువలు అందినప్పుడే అవి మంచి రంగును కలిగి వుంటాయి. లేదంటే పాలిపోయినట్లుగా కనిపిస్తాయి. ఆడ ప్లాటి మగ ప్లాటి కంటే కొంచం పెద్దదిగా కనిపిస్తుంది. ఇవి ఎక్కువగా ఇతర చేపలతో హ్యాపిగా స్విమ్ చేస్తుంటాయి. ఎక్కువగా ఆద ప్లాటి, తక్కువగా మగ ప్లాటిని టాంక్ లో వదలాలి. 18 డిగ్రీల నుండి 26 డిగ్రీల ఉష్టోగ్రత కలిగివుండాలి. ఒక మగ ప్లాటికి రెండు ఆడ ప్లాటిలు వుండేలా చూడాలి. ఆక్వేరియం లోని మిగతా వాటితో స్నేహంగా వుంటాయి.
అయితే ఆసక్తి ఉన్నా అతి జాగ్రత్తగా పెంచాల్సిన అక్వేరియంలోని చేపలకు సంబధించిన పూర్తి వివరాలను అందించడంతో పాటు విభన్న రకాల చేపలను నగరవాసులకు చేరువ చేయటానికి ఆక్వేరి యంల అమ్మకదారులు అన్ని విషయాలను ఎంతో ఓర్పుగా వివరిస్తున్నారు. కొన్ని రకాల చేపలకు ఆక్సిజన్ తప్పనిసరిగా అవసరం వుంటుంది. అలా కాకుండా వాటిని చిన్న చిన్న టబ్బుల్లో పెట్టడం వల్ల అవి త్వరగా చనిపోయే అవకాశం వుంటుంది. ఆహారం కూడా వాటికి నిర్దిష్ట పరిమాణంలోనే వేయాలి. ఎక్కువగా వేయడం వల్ల వాటికి హాని జరుగుతుంది. నీటిని కూడా తరచూ మార్చుతూ వుండాలి. చిన్నది అయితే రెండు రోజులకు ఓ మారు మార్చుతూ వుండాలి. పెద్దది అయితే వారానికి ఓ సారి మార్చినా పర్వాలేదు అని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications