Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
పెట్స్ చిన్నవయస్సు నుండి పరిశుభ్రత అలవాటు చేయడం ఎలా..?

పెట్ కి క్లీన్ హ్యాబిట్స్ నేర్పించడం చాలా సులభం. ఈ పని పప్పీగా ఉన్నప్పుడే మొదలుపెట్టాలి. అప్పుడే వాటికి పరిశుభ్రత అలవాటుగా మారుతుంది. వాటికి భోజనం పెట్టిన వెంటనే కొంతసేపు బయట తిప్పాలి. సాధారణంగా కుక్కలు క్లీన్‌గా ఉండడానికే ఇష్టపడతాయి.
పొరపాటున ఇంట్లో మూత్రవిసర్జన చేస్తే అది చూసేటట్లుగా దాని మీద పేపర్ వేసి తేమ పీల్చుకున్న తర్వాత ఆ పేపర్‌ను బాత్ రూమ్‌లో కానీ బయట కానీ వేస్తే తాను పొరపాటు చేశానని అదే తెలుసుకుంటుంది.
కొంతమంది పెట్ వంటగదిలోకి రావడాన్ని ఇష్టపడరు. అలాంటప్పుడు అది కిచెన్ లోకి వస్తున్నప్పుడు పేపర్ ని కర్రలాగ రోల్ చేసి నేల మీద కొడితే చాలు. ఈ సంకేతాన్ని చాలా సులభంగా పట్టేస్తుంది, ఇక ఆ ఛాయలకు కూడా రాదు. పెట్ ఏ తప్పు చేసినా సరే... దానికి అది తప్పు అని తెలియచెప్పడానికి ఇదే పద్ధతి. కుక్కలకు తమ యజమానిని సంతోషపెట్టాలని ఉంటుంది.
అది ఏం చేస్తే మనం సంతోషంగా ఉంటామో ఆ పనులే చేస్తాయి. మనకు ఇష్టం లేని పని చేయవు. అయితే అవి మనల్ని అర్థం చేసుకునే వరకు ఓపిక పట్టాల్సిందే. అలాగే వాటిని మనతో సన్నిహితంగా మెలగనిస్తేనే మంచి అలవాట్లు నేర్చుకుంటాయి. అనుక్షణం మనల్ని గమనిస్తూ ఉంటాయి.
భోజనం తింటూ సగంలో ఇల్లంతా తిరగడం మొదలు పెట్టినప్పుడు కూడా పేపర్ రోల్ తో నేల మీద కొట్టి నియంత్రించడంతో పాటు చక్కగా భోజనం పూర్తి చేసినప్పుడు కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. సింపుల్ గా చెప్పాలంటే పిల్లల్ని మెచ్చుకున్నట్లే. వాటిని సున్నితంగా తాకితే చాలు అవి ఎంత సంతోషపడతాయో...



Click it and Unblock the Notifications