For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆప్యాయతలోనూ...అప్రమత్తతలోనూ..జాగ్రత్తలు

|

How to Train for you Pets
సాధారణంగా ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల కనబరిచే విశ్వాసం దాని పట్ల ఏర్పర్చుకొనే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. మనిషి జంతువుల మధ్య అలాంటి బంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. అయితే వాటిని పెంచుకోవడం ఎంత అవసరమో అందుక తగ్గ జాగ్రత్తలు కూడా అంతే అవసరం..ఆప్యాయతలోనూ...అప్రమత్తతలోనూ పెంపుడు జంతువుల పెంపకంలో జాగ్రత్తలు అవసరం.

1. వాటి ఆలనా పాలనా చూసుకోవడమే కాకుండా వాటికి చక్కని శిక్షణ కూడా ఇవ్వాలి.
2. ఇంటికి తెలిసినవారు వచ్చినప్పుడు ఎలా మెలగాలి? పక్కింటి కుక్కతో ఎలా మెసలాలి?’ అనే విషయాలపై శిక్షణ ఇవ్వాలి.
3. చీటికీ మాటికీ భౌ భౌ అంటూ మొరిగి గోలచేయకుండా మామంచి కుక్కలా ఎలా వొదిగి వుండాలో దగ్గరుండి నేర్పించాలి.
3. కుక్కలకు మంచి నడవడిక బోధించడానికి మార్కెట్లో రకరకాల పుస్తకాలు లెక్కలేనన్ని దొరుకుతున్నాయి ఈ రోజుల్లో.
4. ఇవే కాక కుక్కలకు పెట్టాల్సిన ఆహారం ఎలాతయారు చేయాలి అనే అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. లేదా తెలుసుకోవాలి.
5. కుక్కలు కూడా పసిపిల్లల మాదిరి యజమానుల దగ్గర గారాలు పోతుంటాయి. వారానికి ఒకసారి స్నానం చేయించాలి.
6. రోజూ మార్నింగ్ దువ్వెనతో దువ్వాలి. దీని వల్ల లూజ్ హెయిర్ పోతుంది. లేదంటే ఈ హెయిర్ వల్ల పిల్లలకు ఉబ్బసం వచ్చే అవకాశం ఉంటుంది.
7. కుక్క పడుకోవడానికి గోనెపట్టా లేదా పెట్ షాప్‌ల్లో దొరికిన వాటితో బెడ్ సెపరేట్‌గా ఏర్పాటు చేయాలి. మన బెడ్స్ మీదకు కుక్కలను ఎక్కనివ్వకూడదు.
8. పెంపుడు కుక్కలకు తప్పక రాబిస్‌ నిరోధక టీకాలు వేయించాలి.
9. చిన్నపిల్లలు కుక్కలతో ఆడేటపుడు నోట్లో చేతులు పెట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.
10. పిల్లలకు గాయాలు ఉంటే దాని మీద కుక్క నాకినా, చొంగ అంటినా రేబీస్ వచ్చే అవకాశం ఉంటుంది.

English summary

How to Train for you Pets...| మనిషిని పరిపించే కక్కులు...

The team at Pets in Practise appreciate how time consuming it can be to train a dog so they are very willing to do some of the hard work for you. Only positive reward based methods are used by Pets in Practise when training your dog.
Story first published:Monday, April 2, 2012, 13:06 [IST]
Desktop Bottom Promotion