Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పెంపుడు కుక్కలతో మీ పిల్లలు జాగ్రత్త....

అందుకే వాటిని గట్టిగా పట్టుకోవాలని, హత్తుకోవాలని చూస్తారు. పిల్లలకు కుక్కలు మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా వెంట ఉండే బంట్లు. అలా అని అతిగా ప్రవర్తిస్తే ‘కాటు’వేసేస్తాయి. కాబట్టి కుక్కలతో స్నేహం ‘పరిధి’లేంటో వివరించండి. వాటి వల్ల ఎదురయ్యే ప్రమాదం నుంచి పిల్లల్ని కాపాడండి. కుక్కల మూడ్స్ అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఉండకపోవచ్చు. ఇరుగు పొరుగు పిల్లలు వచ్చినప్పుడు తమ ఇంట్లో ఉన్న కుక్క గురించి, దానికి ఏది నచ్చదో ఆ విషయాన్ని పిల్లలకు తెలియజేయాలి. అలాగే ఆ కుక్క బాగోగులు చూసుకునే వ్యక్తి దాని వెంట ఉండాలి. లేదంటే పిల్లలు తోక పట్టుకోవడం, చెవులు లాగడం, భౌ భౌ మనడం.. లాంటివి చేస్తుంటారు. అది కుక్కకు నచ్చక పైకి ఎగబడే అవకాశం ఉంటుంది.
ఫ్రెండ్లీగా ఉంటుంది కదా అని చిన్నపిల్లలను ఒంటరిగా కుక్కకు దగ్గరగా ఉండనివ్వకూడదు. ముద్దుగా, బొద్దుగా ఉంది కదా అని మరీ దగ్గరగా తీసుకోకూడదని పిల్లలకు చెప్పాలి. వాటికి ఆహారం తినిపించి, అదే చేత్తో పిల్లలూ తినకుండా చూడాలి. అలాగే పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్లినప్పుడు మరో కుక్కతో ఆడటం, పోట్లాడటం, కొరకడం... వంటివి గమనిస్తే వెంటనే పెద్దలకు తెలియజేయమనాలి.
కొంతమంది పిల్లలు కుక్కల మీదకు రాళ్లు విసరడం, కాలు దువ్వడం, గట్టిగా అరవడం, పుల్లలు పెట్టి గుచ్చడం... వంటి పనులతో రెచ్చగొడుతుంటారు. అలాంటప్పుడు ఆత్మరక్షణ కోసం అవి తిరగబడే అవకాశం ఉంది. గీరడమో, కరవడమో కూడా చేయవచ్చు. తప్పు తమదే కాబట్టి ఈ విషయం పెద్దలకు చెబితే తిడతారో, కొడతారో అనే భయానికో, చిన్న గాయమేగా తగ్గిపోతుందిలే అనో కొంతమంది పిల్లలు ఇంట్లో చెప్పరు. దీంతో సరైన ట్రీట్‌మెంట్ అందక ప్రమాదం వాటిల్లవచ్చు.
పిల్లలు భయం లేకుండా ఏ విషయాన్నైనా చెప్పగలిగే వాతావరణాన్ని తల్లిదండ్రులు ఏర్పరచాలి. ఇలాంటి పిల్లల ప్రవర్తన గురించి తల్లిదండ్రులకు ముందే తెలుస్తుంటుంది. కాబట్టి మనం ఎలా ప్రవర్తిస్తే కుక్కలకు చిరాకో, మనం ఏం చేస్తే కుక్కలు బాగుంటాయో చెప్పాలి. కుక్క దంతాలు ఎంత వాడిగా ఉంటాయి? అవి కరిస్తే వచ్చే ప్రమాదాలు.. తదితర వివరాలను చిత్రాల ద్వారా చూపించవచ్చు. ఇందుకు ఇంటర్‌నెట్‌లో కొన్ని ఇమేజెస్‌ను డౌన్‌లోడ్ చేసి వివరించవచ్చు.



Click it and Unblock the Notifications